జై తెలంగాణ అన్న వాళ్లను అసాంఘిక శక్తులుగా పరిగణిస్తూ సీమాంధ్ర ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని తెలంగాణ ప్రజా ఫ్రంట్ కన్వీనర్ గద్దర్ అన్నారు. ఓయూ క్యాంపస్ ఒక పోలీస్ కాన్సన్‌వూటేషన్ క్యాంపుగా మారిందని పేర్కొన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘శాంతియుతంగా గాంధేయ మార్గంలో దీక్షలు చేపడుతున్న ఓయూ విద్యార్థులను కలవడానికి వెళ్తున్న ప్రజా సంఘాలను, ప్రజా ప్రతినిధులను అసాంఘిక శక్తులుగా పరిగణించడం ఎంతవరకు సమంజసం? కాంగ్రెస్ ప్రజావూపతినిధులు, ప్రజాసంఘాల నాయకులు అసాంఘిక శక్తులా? ఉస్మానియా యూనివర్సిటీ దేశ సరిహద్దా?’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రభుత్వంలో భాగస్వాములైన ప్రజావూపతినిధులను అసాంఘిక శక్తులుగా చూస్తే ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుందని విమర్శించారు. ఓయూలో మా బిడ్డల ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని వారికి ఎలాంటి హాని జరిగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని హెచ్చరించారు.
దీక్షలు చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి వారి డిమాండ్లను తెలుసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. ఓయూలోకి అనుమతించాలని వైస్ చాన్స్‌లర్‌ను కోరితే రిజివూస్టార్‌ను సంప్రదించాలని, రిజివూస్టార్‌ను సంప్రదిస్తే ఒఎస్‌డీని కలవాలని, ఆయనను కలిస్తే పోలీసుకమిషర్‌ను సంప్రదించాలని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూను పోలీస్ క్యాంపుగా మార్చి ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చట్టబద్ధమైన హక్కులను కాలరాస్తోందని మండి పడ్డారు. ఉద్యమంలో భాగమైన అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదికగా ఏర్పడి ఓయూ విద్యార్థులను కలుస్తామని గద్దర్ వెల్లడించారు. ఈసమావేశంలో ప్రజా ఫ్రంట్ నాయకులు వేదకుమార్, చిక్కుడు ప్రభాకర్, సామానుల్లా, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment