Saturday, 23 July 2011

athma hathyalu vaddu

పోరాడి తెలంగాణ సాధించుకుందాం
- ఆత్మహత్యల నిరోధక కమిటీ చైర్మన్ ఘంటా చక్రపాణి వ్యాఖ్య
- యాదిడ్డి ఢిల్లీలో ఆత్మహత్య చేసుకుంటే ఆ వార్తను ప్రసారం చేయరా?
- టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ సూటి ప్రశ్న

యాదిడ్డి ఆత్మహత్యలో ప్రధాన దోషి కేంద్ర ప్రభుత్వమేనని ఆత్మహత్యల నిరోధక కమిటీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. గురువారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆత్మహత్యల నిరోధక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మహత్యల ద్వారా తెలంగాణ రాదనే విషయాన్ని గ్రహించాలని యువతకు సూచించారు. ఆత్మహత్యలు వద్దని, పోరాడి తెలంగాణ సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కమిటీ ఆధ్వర్యంలో ఏడాది నుంచి ఆత్మహత్యల నివారణకు తెలంగాణ పది జిల్లాల్లో అవగాహన కార్యక్షికమాలు నిర్వహించామని, దీంతో మంచిఫలితాలు వచ్చాయని గుర్తుచేశారు.

తాజాగా సీమాంధ్ర ప్రజావూపతినిధులు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంతో ఆత్మహత్యలు మళ్లీ ప్రారంభమయ్యాయని చక్రపాణి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, యాదిడ్డి ఆత్మహత్య యూపీఏ ప్రభుత్వపు హత్యగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంకన్వీనర్ అల్లం నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజావూపతినిధులు రాజీనామాలు చేసినప్పటికీ, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నప్పటికీ, ఎక్కడికక్కడ ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకపోవడంతో యువకులు కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని, తెలంగాణ కోసం ఉద్యమాన్ని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమీపంలో యాదిడ్డి ఆత్మహత్యకు పాల్పడిన విషయం సంచలన వార్త అయినప్పటికీ కొన్ని పత్రికలు, చానళ్లు ఆ వార్తను ప్రసారం చేయకపోవడం బాధాకరమన్నారు.

తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత విఠల్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజావూపతినిధులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నందున ప్రభుత్వం సుమోటోగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆత్మహత్యల వ్యతిరేక కమిటీ సభ్యులు డాక్టర్ నర్సయ్య, డాక్టర్ వీరేందర్, వీవీ రావు, బాల్‌డ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.

తెలంగాణకు అవమానం: టీజేఎఫ్
శుక్రవారంనాటి బంద్‌కు తెలంగాణ జర్నలిస్టు ఫోరం తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అమరవీరుడి పట్ల జరిగిన అవమానం, తెలంగాణకు జరిగిన అవమానమని టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment