జేఏసీ, టీఆర్‌ఎస్‌లతో పనిచేసేందుకు సిద్ధం
- ఈనెల 21 నుంచి పోరుబాట:ఫోరం
- ఆగస్టు 5 నుంచి నిరహార దీక్షలు
తెలంగాణ రాజకీయ జేఏసీ, టీఆర్‌ఎస్‌లతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమేనని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎరవూబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్‌తో నేరుగా కలిస్తే అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉందని, మధ్యవర్తుల ద్వారా చెప్పిస్తామని ఆయన అన్నారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఫోరం విస్తృత సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఫోరం నేతలు మెత్కుపల్లి నర్సింహులు, కొత్త కోట దయాకర్‌డ్డి, పి.రాములు, పట్నం మహేందర్‌డ్డి, ఎల్.రమణ, అరికెల నర్సాడ్డి, బి కలిసి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసిన వాళ్లంతా కలిసి కట్టుగా ఉద్యమిస్తేనే తెలంగాణ వస్తుందని, అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.
కేంద్రం దిగి వచ్చే విధంగా తెలంగాణ కోసం పోరాటం చేయాలని తాము నిర్ణయించామని ఎర్రబెల్లి తెలిపారు. ఇందుకోసం ఈనెల 21 నుంచి ఆగస్టు రెండవ వారం వరకు ఉద్యమ కార్యక్షికమాలను రూపొందించామని వివరించారు. గ్రామ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఈనెల 21, 24 తేదీల్లో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలని, స్థానికంగా కలిసి వచ్చే వారందరిని ఈ కమిటీలో కలుపుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. అదేవిధంగా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో ఈనెల 25 నుంచి 31 వరకు పల్లెపప్లూకు టీ టీడీపీ పేరుతో ఊరేగింపులు నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 1న అన్ని మండల కేంద్రాల్లో టీ టీడీపీ జెండాలు ఎగురవేస్తామని వివరించారు. ఆగస్టు 5 నుంచి ఇందిరాపార్కు వద్ద వారంరోజులు రోజుకు 10మంది చొప్పున దీక్షలు చేస్తామన్నారు.
రాజకీయేతర సంస్థలతో కలుస్తాం: ఎర్రబెల్లి
రాజకీయ జేఏసీ సహా అందరినీ ఒకే గొడుడు కిందకు వచ్చి ఉద్యమించాలని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. రాజకీయేతర సంస్థలతో తాము కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ యునైటెడ్‌ఫోరం నేతలు దిలీప్‌కుమార్, విమల, కేశవరావ్ జాదవ్‌లను ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సోమవారం ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ ఉద్యమంలో ఎమ్మెల్సీ దిలీప్ మొదటి నుంచి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని పేర్కొన్నారు. జేఏసీతో సహా అందరూ పార్టీని, జెండా, ఎజెండాలను వదలిపెట్టి ఒక్కటిగా పని చేయాలని కోరారు. ప్రస్తుత జేఏసీ తెలంగాణకు చొరవ చూపడం లేదని విమర్శించారు. అవసరమైతే పార్టీని వదులుకొని వస్తానని తాను పేర్కొనడాన్ని దిలీప్‌కుమార్ స్వాగతించారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికలంటూ వస్తే ఇక తెలంగాణ రాష్ట్రంలోనే రావాలని పేర్కొన్నారు.
No comments:
Post a Comment