ఎస్.ఐ. రాత పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వాయిదా పడతాయని వచ్చిన వార్తలు అవాస్తమని, ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా ఆగస్టు 13, 14 తేదీల్లో జరుగుతాయని అన్నారు. ఎస్టీ, ఎస్సీ సంక్షేమ వసతి గృహాలను మూసివేయమని సీఎం స్పష్టం చేశారు.
బుధవారం గుంటూరు పర్యటనకు వచ్చిన ఆయన మేడు కొండూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ హాస్టళ్ల విలీనాంశంపై మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని అన్నారు. ప్రతి రెండు నెలలకు ఒ కొత్త పథకం అమలులోకి వస్తుందని సీఎం పేర్కొన్నారు. విద్యా, ఉపాధి రంగానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు.
కాగా గుంటూరు జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బుధవారం గుంటూరు జిల్లాలో జరగనున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటారనే అనుమానంతో పిడుగురాళ్ల ఔషదబాధితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. దీంతో పోలీసుల వైఖరిపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జిల్లా పర్యటన నేపథ్యంలో స్థానిక సంస్థలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. వరాల జల్లు కురిపించకపోయినా కనీసం ట్రెజరీ ఆంక్షలు ఎత్తివేస్తే అదే పది వేలన్న భావనలో ఉన్నాయి. ఇప్పటికే జిల్లాపరిషత్తు, మండలపరిషత్తు పాలకవర్గాల పదవీకాలం ముగిసి స్పెషలాఫీసర్ల పరిపాలన రావడం, మరో నెల లోపే పంచాయతీల పదవీకాలం కూడా ముగియనున్న నేపథ్యంలో ఆర్థికపరమైన వెసులుబాటు కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. నేడు జడ్పీలో జరగనున్న సీఎం సమీక్షలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని అధికారవర్గాలు యోచిస్తున్నాయి.
No comments:
Post a Comment