తెలంగాణపై ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం రాజకీయ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపునకు గ్రేటర్ హైదరాబాద్‌లో అన్నివర్గాల వారు స్పందించారు. బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. తెలంగాణపై, ఉద్యోగులపై ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేతను ఎండగట్టారు. యాదిడ్డి భౌతిక కాయాన్ని ఢిల్లీ నుంచి స్వగ్రామానికి తరిలించే క్రమంలో ప్రభుత్వం అనుసరించిన ధోరణిని తీవ్రంగా ఖండించారు. బంద్ ప్రభావంతో నగర రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు తెరుచుకోలేదు.
-నినదించిన తెలంగాణ
- పలు బస్సులు
పాక్షిక ధ్వంసం
- యాదిడ్డికి నివాళులు
- బంద్‌కు అన్నివర్గాల వారి మద్దతు
- మూతపడ్డ దుకాణాలు, విద్యాలయాలు
- నిర్మానుష్యంగా మారిన రహదారులు
రెచ్చగొట్టే ధోరణిలో పోలీసుల రక్షణ వయలంలో కొన్ని ఆర్టీసీ బస్సులను నగరంలో తిప్పేందుకు ప్రయత్నించింది. దీనికి ఆగ్రహించిన తెలంగాణవాదులు 30బస్సులను పాక్షికంగా ధ్వంసం చేశారు. కూకట్‌పల్లి ప్రాంతంలో కొన్ని దుకాణాలు తెరిచి ఉంచడంపై మండిపడ్డారు. వాటిని మూసివేయించారు. రాజేంవూదనగర్ వెటర్నరీ కళాశాల విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం విద్యార్థులు పరిపాలనా భవనం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. హైకోర్టు, సిటీ సెమీకోర్టు, మియాపూర్ కోర్టుల తెలంగాణ న్యాయవాదులు విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు. గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పద్మారావు ఆధ్వర్యంలో సికింవూదాబాద్ నియోజకవర్గ పరిధిలో దుకాణాలు మూసి వేయించి బంద్‌ను విజయవంతం చేశారు. మాజీ మంత్రి నాయిని నర్సింహాడ్డి తన కార్యకర్తలతో కలిసి తిరుగుతూ ముషీరాబాద్, చిక్కడపల్లి ప్రాంతాల్లో దుకాణాలను మూసి వేయించారు.
సైఫాబాద్‌లోని అరణ్యభవన్‌లో తెలంగాణ అమరవీరుడు యాదిడ్డికి శ్రద్ధాంజలి ఘటించి, ఉద్యోగులు విధులు బహిష్కరించారు. తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ ఆధ్వర్యంలో యాదిడ్డికి నివాళులు అర్పించారు. అనంతరం జలసౌధలో విధులను బహిష్కరించి బంద్‌లో పాల్గొన్నారు. విద్యుత్, ట్రాన్స్‌కో, జెన్‌కో, ఏపీసీపీడీసీఎల్, కార్మికశాఖ, ఆర్టీసీ, జలమండలి, విద్యా శాఖ, వైద్య శాఖ, కలెక్టరేట్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, సచివాలయం, బూర్గుల రామకృష్ణ భవన్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. బంద్‌లో పాల్గొని విజయవంతం చేశారు. యాదిడ్డిని స్మరించుకుంటూ పశుసంవర్థక శాఖ ఉద్యోగులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం విధులను బహిష్కరించారు.
సచివాలయం వద్ద బీజేపీ ధర్నా
బంద్‌కు మద్దతుగా సచివాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఆ పార్టీ సీనియర్ నాయకులు బండారు దత్తావూతేయ, రాంచందర్‌రావు, కాశం వెంక అశోక్‌యాదవ్‌లతో పాటు వంద మంది కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంటులో వెంటనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. దత్తావూతేయ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో కిరణ్ సర్కారు అప్రకటిత ఎమ్జన్సీని అమలు చేస్తున్నదని మండిపడ్డారు.
భయోత్పాతాన్ని సృష్టిస్తున్న సర్కారు: అల్లం నారాయణ
తెలంగాణ బంద్‌కు తెలంగాణ జర్నలిస్టు ఫోరం(టీజేఎఫ్) సంపూర్ణ మద్దతును ప్రకటించింది. జర్నలిస్టులపై పోలీసుల అమానుష దాడులను ఖండించింది. దాడులకు నిరసనగా డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఫాసిస్టు విధానాన్ని అవలంబిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణవాదులపై, జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతూ భయోత్పాతాన్ని సృష్టించే దిశగా సర్కారు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఉద్యమంలో అంతా కలిసి శాంతియుత పోరాటం చేస్తున్నారని, దీన్ని హింస వైపునకు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.
No comments:
Post a Comment