Tuesday, 19 July 2011

t congress yudda beri

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేసిన తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజా్ర పతినిధులు గ్రామస్థాయిల్లోంచి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిధ్ధమయ్యారు. ఈ నెల 20 వ తేదీన తెలం గాణలోని 443 మండలాల్లో రాష్ట్ర సాధనకోసం సత్యా గ్రహ దీక్షలు చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్‌ నాయకులు ఉద్యమిస్తున్నారనే విషయాన్ని గ్రామగ్రామాన తీసుకు పోయేందుకుగానూ 26 వ తేదీన జెండాపండుగలు నిర్వహించనున్నారు.

కాంగ్రెస్‌ జెండాలో తెలంగాణ మ్యాప్‌తో కూడిన జెండాలను తెలంగాణ వ్యాప్తంగా ఎగురవేయాలని, పరిస్థితులను బట్టి అవసరమై తే ఈ నెలాఖరులో భారీబహిరంగ సభను కూడా నిర్విహ స్తామని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు. సోమ వారం చంపాపేటలో ఒక ఫంక్షన్‌ హాలులో జరిగిన తెలం గాణ కాంగ్రెస్‌ విస్తృతస్తాయి సమావేశంలో పలు నిర్ణ యాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి రాజీనామాలు చేసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులతో పాటు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లా, మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు, ముఖ్యనాయకులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించారు.

సోమవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశంలో రాజీనామాలు చేసిన ప్రజాప్రతినిధు లే కాకుండా పలువురు జిల్లా, మండల స్తాయి కాంగ్రెస్‌ నాయకులు కూడా ప్రసంగించారు. రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చే సిన తెలంగాణ కాంగ్రెస్‌ నాయకు లను అభినందించారు. తెలంగాణ ఏర్పడే దాకా రాజీ నామాలను వెనక్కి తీసుకోవద్దని సూచించారు. అధిష్టానం బుజ్జగింపులకు లోబడి మళ్ళీ పదవుల్లో కొనసాగితే, నియోజక వర్గాల్లో తిరగనిచ్చేది లేదని కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులను హెచ్చరించారు. తెలంగాణ కోసం రాజీ నామాలు చేసిన వారికి అండగా ఉంటామని తెలిపారు.

తెలంగాణ కోసం ఇకపై కాంగ్రెస్‌ నాయకులు గ్రామ గ్రామాన చేసే ఉద్యమాలు ఢిల్లిలో మార్మోగాలని మంత్రి జానారెడ్డి పిలుపునిచ్చారు. అంతేకాదు పరిస్థితిని అర్ధం చేసుకొని కేంద్ర వెంటనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మొదలు పెట్టాలని కోరారు. రెండు రోజుల క్రితమే సూడా న్‌ను 193 వ దేశంగా ప్రకటించారని, అక్కడి ప్రజలు కోరుకోవడం వల్లే అది సాధ్యమైందని, తెలంగాణలోని ప్రజలంతా పార్టీలకతీతంగా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకొంటు న్నారని, కేంద్రం వెంటనే దేశంలో 31 వ రాష్ట్రంగా తెలం గాణను ప్రకటించాలని జానారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆందోళనలు జరగకుండా, అభివృద్ది కుంటుపడకుండా తె లుగు ప్రజలను సామరస్యంగా రెండు రాష్ట్రాలుగా విడదీ యాలని కోరారు.

ప్రజల ఆకాంక్షను గుర్తించి దేశ విదే శాల్లో కాంగ్రెస్‌ ప్రతిష్ట పెరగడానికి వీలుగా, కాంగ్రెస్‌ చరి త్ర చిరకాలంగా ఉండేలా రాష్ట్ర ఏర్పాటు జరగాలని జానారెడ్డి అన్నా రు. అపుడే తెలంగాణ కాంగ్రెస్‌కు కంచు కోటగా మారుతుందని ఆయన చెప్పారు.రాజీనామాలు చేసిన మంత్రులు సమావేశాలకు రానం త మాత్రానా తెలంగాణ సాధనకు వ్యతిరేకం కాదని, కొన్ని వ్యక్తిగత పనులు ఉండడం వల్ల కొందరు రాలేక పోతు న్నారని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ప్రభుత్వాన్ని సంక్షో భంలో పడవేసేందుకు రాజీనామాలు చేయలేదని, తెలం గాణ ఆవసరంపై అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకే అలా చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

తెలంగాణ కోసం ఏ నిర్ణయం తీసుకొన్నా, కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఒప్పించేలా ఉండాలని శ్రీధర్‌బాబు సూచించారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలయ్యే వరకు పదవుల్లో చేరేది లేదని, బాధ్యతలు నిర్వహంచబోమని ఎంపీ పొన్నంప్రభాకర్‌ స్పష్టంచేశారు. తెలంగాణలో ఉన్న దేవాలయాల్లో ప్రత్యేక రాష్ట్రం త్వరగా రావాలని పూజలు చేసే కార్యక్రమం తెలంగాణ కాంగ్రెస్‌ చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇకపై భవిష్యత్తులో గ్రామగ్రామాన కాం గ్రెస్‌ను బలోపేతం చేసుకుంటూ తెలంగాణ ఉద్యమం సాగించాలని చెప్పారు. రాష్ట్రంలో సమైక్యవాదుల పెత్తనం కొనసాగుతుందని, రాష్టానికి కేంద్రప్రభుత్వం సైనిక్‌ స్కూల్‌ని ఇస్తే ముఖ్యమంత్రి కిరణ్‌ తన స్వంత జిల్లాలో పెట్టుకొన్నారని మండిపడ్డారు. ఇదివరకు ఉన్న సైనిక ్‌స్కూల్‌ కూడా ఆంధ్రాప్రాంతంలోనే ఉందని చెప్పారు.

ఎంపీ మధుయాష్కీ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణలర్పించిన వారికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే అసలైన నివాళి అని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనకోసం చేసిన రాజీనామాలను ప్రధానప్రతిపక్షం అయిన టీడిపి రాజ కీయం లబ్దికోసం వాడుకొంటుందని, అలా వాడుకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని యాష్కీ మండిపడ్డారు. ఆంధ్రప్రాంత నాయకులు అధిష్టానానికి వ్యతిరేకంగా మా ట్లాడి లబ్ది పొందుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షపదవులన్ని సీమాంధ్ర ప్రాంతానే ఉన్నాయని, తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగాలంటే రాష్ట్ర ఏర్పా టు తప్పనిసరి అని ఆయన చెప్పారు. తెలంగాణ మైనా ర్టీలు కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారన్నారు.

తెలంగాణ కాంగ్రె్‌స్‌ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణ యించుకున్న కార్యాచరణను అమలు చేయడానికి ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త కృషి చేయాలని సభకు హాజరైన నాయ కులంతా పిలుపునిచ్చారు. ఇకపై ఎలాంటి కార్యాచరణ లను తీసుకున్నా అన్నింటిని విజయవంతం చేయాలని ఎంపీ కే కేశవరావు కోరారు. రాజీనామాలపై వెనకడుగు వేయమని ఆయన చెప్పారు. అవసరాన్ని బట్టి ఎప్పటికపు డు తెలంగాణ కాంగ్రెస్‌ స్టీరింగ్‌ కమిటీ కార్యచరణను ప్రకటిస్తుందని కేకే తెలిపారు.

సోమవారం తెలంగాణ కాంగ్రెస్‌ విసృ్తత స్థాయి సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు.
మంత్రులు.. కె జానారెడ్డి, బస్వరాజు సారయ్య, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డి శ్రీధర్‌బాబు
ఎంపీలు.. కే కేశవరావు, మంద జగన్నాదం, కోమట ిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జి వివేక్‌, గుత్తా సుఖేంధర్‌రెడ్డి. సిరిసిల్ల రాజయ్య, మధుయాష్కి, బలరాం నాయక్‌, పొన్నం ప్రభాకర్‌.
ఎమ్మెల్యేలు.. కే లకా్ష్మరెడ్డి, అబ్రహాం, భిక్షమయ్యగౌడ్‌, బాలూనాయక్‌, చిరుమర్తి లింగయ్య, రాంరెడ్డి దామోదర రెడ్డి, సుధీర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, గండ్ర వెంకటరమణారెడ్డి, టీ రాజయ్య, కే శ్రీధర్‌, ఆరెపల్లి మోహ న్‌, ప్రతాప్‌రెడ్డి, జూపల్లి కృష్టారావు, రాజేశ్వర్‌రెడ్డి, ముత్యం రెడ్డి, ప్రసాద్‌రెడ్డి.
వీరితో పాటు పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనాయకులు హాజరయ్యారు.

No comments:

Post a Comment