తెలంగాణలో బంద్ కారణంగా నిలిచిన బస్సులు
నేడు తెలంగాణ బంద్ సందర్భంగా తెలంగాణలోని అన్ని జిల్లాలో బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. నగరంలోని ఎంజీబీఎస్, జూబ్లీబస్‌స్టేషన్ నుంచి వెళ్లాల్సిన బస్సులు నిలిపివేశారు. ఆదిలాబాద్‌లోని ఆరు డిపోల పరిధిల్లో 600 బస్సులు నిలిచిపోయాయి. ఉదయం నుంచే బస్సులు డిపోలనుంచి బయటికి వెళ్లనీయకుండా టిఆర్‌ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
మెదక్ జిల్లాలో ఏడు డిపోల పరిధిలో 550 బస్సులు, నిలిచిపోయాయి. డిపోల ఎదుట ఆందోళనకారులు ధర్నాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హకీంపేట డిపోనుంచి బస్సుల్ని బయటకు వెళ్లకుండా నిలిపివేశారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలో బంద్ సందర్భంగా 8 డిపోల్లో, 804 బస్సుల్ని నిలిపివేశారు. తెలంగాణ బంద్‌కి మద్దతుగా షాద్‌నగర్‌లో తెలంగాణ వాదులు రోడ్డుపై బైఠాయించారు. నల్గొండ రీజియన్‌లోని 7 డిపోల్లో 705 బస్సులు నిలిచిపోయాయి. టిఆర్‌ఎస్, బీజేపీ నేతలు డిపోల ముందు బైఠాయించారు. కరీంనగర్‌లో 11 డిపోల్లో 865 బస్సుల్ని నిలిచిపోయాయి. నిజామాబాద్‌లో 630 బస్సులు డిపోలోనే ఆగిపోయాయి.
No comments:
Post a Comment