గల్లీలోని తెలంగాణ ఉద్య మం మళ్లీ ఇప్పుడు ఢిల్లీకి చేరుకుంటోంది. ఉద్యమ సెగను ఢిల్లీకి తాకించాలని చెబుతూ వచ్చిన రాజకీయ పార్టీల నాయకులు, టీజేఏసీ నేతలు ఎవరికి వారే హస్తినలో లాబీయింగ్ ప్రక్రియ కోసం అర్రులు చాచడం విమర్శలకు తావిస్తోంది. ఉద్యమాన్ని గాలికొదిలిస్తే, లాబీయింగ్ ప్రక్రియ ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమేనా? అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చంశనీయంగా మారింది. ఢిల్లీకి చేరుకున్న టీ-కాంగ్రెస్ నేతలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్‌తో దశల వారీగా చర్చలు జరుపుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై సానుకూల ప్రకటన చేయా లని అధిష్టానంపై వారు ఒత్తిడిని తెస్తున్నారు. కానీ ఎటూ తెమలడం లేదు.
లాబీయింగ్ ద్వారా ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషి చేద్దాం అంటూ టీ-కాంగ్రెస్ నేతలు ఉద్యమాన్ని అటకెక్కించే ప్రయ త్నాలు ప్రారంభించారు. తెలంగాణ బీజేపీ నాయకులు సైతం అదే దారి పట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షు డు గఢ్కరి, ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ లను కలుసుకుని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. టీజేఏసీతో కలిసి ఉద్యమించడం కంటే జాతీయ పార్టీ హోదాలో తాము ఢిల్లీతో సంబంధాలను నెరుపుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం లాబీయింగ్ చేయడమే సరైందని బీజేపీ నాయకులు భావిస్తు న్నారు. బుధవారం నాడు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యచరణ కమిటీ (టీజే ఏసీ) ప్రతినిధి బృందం ఢిల్లీకి బయల్దేరనుంది. టీజేఏసీ ప్రతినిధులు ఎన్డీఏ భాగ స్వామ్య పార్టీల అగ్రనాయకులను, సీపీఐ జాతీయ నాయకులను కలుసుకుని ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు కూడగట్టే ప్రయత్నాన్ని చేయాలని నిర్ణయించారు.
లాబీయింగ్ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధ్యమంటూ తొలి నాళ్లలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టిన విషయం తెలిసిందే. జాతీయస్థాయి పార్టీల అగ్ర నాయకులతో మంతనాలు చేసిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని అడుగు కూడా ముందుకు కదిలించలేక పోయా రనే విమర్శలను ఎదుర్కొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు చేసిన ఉద్యమాలతో పాటు కేసీఆర్ చేసిన అమరణ నిరహారదీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి 2009 డిసెంబర్ తొమ్మిదవ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు హోంమంత్రి చిదంబరంచేత ప్రకటన చేయించిన విషయం విధితమే.
డిసెంబర్ తొమ్మిది ప్రకటన తరువాత రాష్ట్రం లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంది. లాబీయింగ్ ద్వారా గులాబీ దళపతి కేసీఆర్ ఏమి సాధించలేక తిరిగి ఉద్యమ బాట పట్టగా, ఉద్యమాన్ని గాలికి వదిలేసి రాజకీయ పార్టీల నాయకులు, జేఏసీ నేతలు లాబీయింగ్ కోసం ఢిల్లీ బాట పట్టడం విమర్శలకు తావిస్తోంది. రాజకీయ లాబీయింగ్ ద్వారా ప్రత్యేక రాష్ర్ట సాధన అంతా సులు వేమి కాదని తెలంగాణ వాదులు అంటున్నారు. టీ-కాంగ్రెస్, బీజేపీ నేతలు రా జకీయ లాబీయింగ్‌కు స్వస్తి చెప్పి ఉద్యమబాట పట్టాలని వారు కోరుతున్నారు.
No comments:
Post a Comment