Friday, 15 July 2011

telangana sarihaddullo goda kadutham:dhamodara reddy

టీ కాంగ్రెస్ నేత, సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌డ్డి సీమాంవూధులపై నిప్పులు చెరిగారు. తాము తల్చుకుంటే సీమాంధ్ర నాయకులు హైదరాబాద్‌కు ఎలా వస్తారో చూస్తామని హెచ్చరించారు. గురువారం ఆయన టీ కాంగ్రెస్ నిరశన దీక్షలో మాట్లాడారు. మహబూబ్‌నగర్, నల్లగొండ సరిహద్దుల్లో గోడకడతామని ఆయన హెచ్చరించారు. సరిహద్దుల్లో గోడ కట్టిన తరువాత ఇక్కడికి ఎలా వస్తారని ప్రశ్నించారు. మా తెలంగాణ ఆకాంక్షను అర్థం చేసుకొని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరారు. చెప్పినట్టు విన్నా తెలంగాణ ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.
నీళ్లు, నిధులు, ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ ప్రకటించాలని జూపల్లి కృష్ణారావు అన్నారు.

ట్యాంకుబండ్‌పై ప్రాణంలేని విగ్రహాలను కూల్చివేస్తే అతిగా స్పందించారుగానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మాటేమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని బస్వరాజు సారయ్య అన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే 2014 ఎన్నికలు బహిష్కరిస్తామని ఎంపీ బలరాం నాయక్ హెచ్చరించారు. తెలంగాణవాదాన్ని ప్రజలు ప్రపంచానికి చాటారని, త్యాగాలు చేయడం తెలంగాణ ప్రజల సొత్తు అని అన్నారు. తెలంగాణ వస్తేనే ప్రతి ప్రజావూపతినిధి గౌరవంగా బతుకుతామని, లేకుంటే సీమాంవూధుల కింద బానిసలుగా బతకాల్సి వస్తుందని హెచ్చరించారు. ఐక్యమత్యంగా పోరాడితే తెలంగాణ వస్తుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రాజీనామాలు చేశామని, కాంగ్రెస్ పార్టీ ప్రజావూపతినిధులు రాజీనామా చేసిన తర్వాత ప్రతి గిరిజన తండాలకు తెలంగాణ ఉద్యమం విస్తరించిందని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు.

అధిష్టానం తెలంగాణపై అనుకూల నిర్ణయం తీసుకునే వరకు రాజీనామాలను వెనక్కి తీసుకునేది లేదని చెప్పారు. చీలిపోతే కూలిపోతాం అని ఎంపీ సిరిసిల్ల రాజయ్య హెచ్చరించారు. తెలంగాణ ప్రజావూపతినిధులు పార్టీలకు అతీతంగా కలిసిఉంటే తెలంగాణ వస్తుందని, ఐక్యత లేకుంటే ఉద్యమం కూలిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభివూపాయాన్ని గౌరవించకపోతే పార్టీలు కనుమరుగు అవుతాయని వ్యాఖ్యానించారు. సీపీఎం పార్టీకూడా రాజీనామా చేయాలని చిరుమర్తి లింగయ్య అన్నారు.

సాయుధ పోరాటం చేశామని చెప్పుకుంటున్న సీపీఎం పార్టీకి 600మంది విద్యార్థుల మృతి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో కలిసి రావాలని కోరారు. అన్ని పార్టీల ప్రజావూపతినిధుల మాదిరిగా సీపీఎం ప్రజావూపతినిధులు కూడా రాజీనామా చేయాలన్నారు. జాతీయపార్టీగా ప్రజల అభివూపాయాన్ని గౌరవించాలని, లేనిపక్షంలో ప్రజలు ఈడ్చి కొడతారని వ్యాఖ్యానించారు. సీమాంవూధులది డబ్బుతో చేసే ఉద్యమమని శ్రీధర్ అన్నారు.

No comments:

Post a Comment