Thursday, 21 July 2011

Telangana employees strike

ప్రత్యేక తెలగాణ రాష్ట్రం ఏర్పాటును డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంతానికి చెందిన వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యా మ్నాయ చర్యలకు దిగింది. అందులో భాగంగా.. ఉద్యోగులను సమ్మె కు వెళ్లకుండా నియంత్రించేందుకు వారిపై ఎస్మా (అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం) ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ మేరకు సమ్మె వల్ల ఏర్పడనున్న ఇబ్బందులు, ప్రత్యా మ్నాయ ఏర్పాట్లపై ముఖ్యమంత్రికి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో భేటీ అయ్యారు. ఉద్యోగుల సమ్మె అనంతరం తలెత్తే పరిస్థితి వల్ల సామాన్యులు ఇబ్బంది పడకూడదని ఆదేశించారు.

ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్లే ముందే వారిపై ఎస్మా ప్రయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో 18 రోజుల పాటు చేసిన సమ్మె వల్ల వచ్చిన నష్టం, తలెత్తిన పరిపాలనపరమైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌ ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే సమ్మెపై ఎస్మా ప్రయోగించాలని సూచించినట్లు తెలిసింది. ఉద్యోగుల డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని, ప్రభుత్వ పరిథిలో లేని డిమాండ్లను తీర్చడం ఎలా సాధ్యమవుతుందని సీఎం అధికా రుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తెలంగాణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిథిలోనిదని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలుంటే దానిపై చర్చించడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

ఇదిలాఉండగా... తెలంగాణకు చెందిన టీచర్లు, ఆర్‌టిసీ, విద్యుత్‌, రెవిన్యూ, వాటర్‌వర్స్‌, మునిసిపల్‌ తదితర విభాగాల సిబ్బందితోపాటు ఈ పర్యాయం సింగరేణి కార్మికులు సైతం రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ఒక ప్రకటన చేయాలని. లేకపోతే.. ఆగస్టు తొలి వారం నుంచి ప్రత్యేక రాష్ట్రం కోరుతూ తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసా ్తమని ఇప్పటికే తెలంగాణ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందచేసిన సమ్మె నోటీసులో పేర్కొన్నాయి. మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ ఇప్పటికే ఈ ప్రాంత మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు తమ పదవులకు రాజీ నా మా చేశారు.

ఇదిలా ఉండగా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై ఇటు సీమాంధ్ర నాయకులతోపాటు.. అటు కాంగ్రెస్‌ అధిష్టానం కూడా అంత ఆసక్తి కనబరచకపోవడంతో.. తెలంగాణ ప్రాంత ఉద్యోగ సంఘాలు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాయి.ఈ పరిస్థితుల్లో ఆగస్టు తొలి వారం నుంచి రాష్ట్ర ప్ర భుత్వ ఉద్యోగులు, టీచర్లు, సింగరేణి, ఆర్‌టిసి ఉద్యోగులు, ఇతర పరిశ్రమల పనిచేసే కార్మిక సంఘాలు తమ పోరాటాలను ఉధృతం చేయడానికి నిర్ణయించుకున్నాయి. అప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు స్పందించకపోతే నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడబోమని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో పౌరుల అత్యవసర సేవలకు ఎటువంటి అసౌ కర్యం కలుగకూడదని ప్రజల భద్రత, రక్షణ పట్ల అత్యంత జాగ్ర త్తగా వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దీనిలో భాగంగా మున్పిపల్‌, శానిటేషన్‌, ప్రజా ఆరోగ్యం, గ్రామీణ, పట్టణ మంచి నీటి సరఫరా, పౌరసరఫరాల పంపిణీ, వైద్య ఆరోగ్య సేవలు, ప్రజా రవాణా, కమ్యూనికేషన్లు, విద్యుత్‌, బొగ్గు ఉత్పత్తి తదితర సేవల్లో ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం కటు ్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగా ముఖ్య మంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి బుధవారం అత్యవసర సేవలన్నీ యధా విధిగా రాష్ట్ర పౌరులకు చేరాలని ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికా రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

రెవెన్యూ వనరులపై ప్రత్యేక దృష్టి...
ఇటీవల జరిగిన ముంబై పేలుళ్లు, ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న బోనాలు, రంజాన్‌, గణేష్‌ చతుర్ధి వంటి పండుగల నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా తగిన భద్రతా చర్యలు చేపడుతున్నది. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె నోటీసుతో ఆగస్టు తొలి వారం నుంచి ప్రభుత్వ రెవిన్యూ ఆదాయం ఏమాత్రం తగ్గకుండా అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం వాణిజ్యం, ఎకై్సజ్‌, రవాణా, అటవీ, రిజిస్ట్రేషన్లు తదితర రెవిన్యూ శాఖల అధి కారులను ఆదేశించారు.

బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్‌, ముఖ్యమంత్రి ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జె సత్యనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జి సుధీర్‌, డిజిపి దినేశ్‌రెడ్డి, ఇంట ిలిజిన్స్‌ ఐజీ మహేందర్‌రెడ్డి, సిటీ పోలీసు కమిషనర్‌ ఏకె ఖాన్‌, జిహెచ్‌ఎమ్‌సి కమిషనర్‌ ఎం.టి కృష్ణబాబు, ఆర్‌టిసి ఎమ్‌డి బి ప్రసాదరావు, ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో ఎమ్‌డిలు అజైయ్‌ జైన్‌, విజ యానంద్‌, హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ వర్క్స్‌ ఎమ్‌డి జగదీశ్వర్‌ తది తర అధికారులు పాల్గొన్నారు.

ఉద్యోగులపై ఉక్కుపాదం ః దేవీ ప్రసాద్‌
అయితే, ప్రభుత్వ ప్రయత్నాలపై తెలంగాణ ఉద్యోగాల సం ఘాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఎస్మా ప్రయోగిస్తే పరిపాలన స్తంభిస్తుందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఆగస్టు తొలి వారం నుంచి సమ్మె నోటీసు జారీచేయడంతో.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులపై అనేక రకాలుగా భయబ్రాంతులకు గురి చేస్తున్నదని, పలు శాఖల్లో ఇప్పటికే ఎస్మాను తలపించే విధంగా తెలంగాణ ఉద్యోగులను అధికారులు ఇబ్బందులకు గురి చేస్తు న్నట్లు తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీ ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభు త్వంతో చర్చించి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు చేప ట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌కు మరో షాక్‌...
గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రంలో నెలకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 2010-11 పార్టనర్‌ షిప్‌ సమ్మిట్‌ చెన్నయ్‌కు తరిలిపోయింది. తాజాగా సెప్టెంబర్‌ 19,20 తేదీల్లో జరిగాల్సిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌ కూడా రద్దైంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని స్థానంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు, సీఐఐ సంయుక్తంగా 2012 పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ను నిర్వహించడానికి కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియచేసినట్లు సర్కార్‌ జారీచేసిన ఉత్తర్వులో పేర్కొన్నది.

ఇదిలా ఉండగా.. పరిశ్రమల అసోసియేషన్లు మాత్రం 2012 పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ షెడ్యూల్‌ ప్రకారం జరగకపోతే.. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికంగా కోలుకోలేని విధంగా నష్టపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌తో పోల్చుకుంటే.. 2012 పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ ద్వారా అదనపు ప్రయోజనాలుంటాయని, ఈ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌లో జాతీయ, అంతర్జాతీయ కంపెనీల సీఇఓలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2012 జనవరిలో పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ పేరుతో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించాలని చురుగ్గా పావులు కదుపుతున్నట్లు తెలిసింది.

No comments:

Post a Comment