Friday, 29 July 2011

poradi telangana sadhichukunda:nagam janardhan reddy

నిజామాబాద్ సాక్షిగా చెబుతున్నా..వాళ్లిచ్చేదేంది మనమంతా ఏకమై తెలంగాణ ను గుంజుకుందాం అని రాజీనామా చేసిన తాజా ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని నాయకులంతా ఏకం కావాలని ఐక్య పోరాటానికి తాము సిద్ధమన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట మందాడి యాదిరెడ్డి ప్రాంగణం లో జరిగిన తెలంగాణ ఐక్యతా దీక్షలో కూర్చున్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ లోని నాయకులంతా ఒకటి కావాలన్నదే ఐక్యతా దీక్ష ఉద్దేశమన్నారు. నాయ కులంతా ఒకటి కావాలని కానీ వారంతా తెలంగాణ ద్రోహులని అన్నారు.

తెలంగా ణ తెలుగు దేశం ఫోరం ఎమ్మెల్యేలు మొదట మేమే రాజీనామాలు చేశామని బస్సు యాత్ర జేసి చెపుకున్నా రాజీనామాల తిరస్కరించిన తర్వాత ఎందుకు రాజీనా మాలు చేయడం లేదని వాళ్లు ఇప్పుడెక్కడికి పోయిండ్రని నాగం ప్రశ్నించారు. వారికి కాగితం కలం దొరకడం లేదా? అని ఎద్దేవా చేశారు. నాటకాలు పక్కన బెట్టాలని వారికి హితవు పలికారు.

రాజీనామాల ఉచ్చులోంచి తిరస్కరించడంతో బయటపడ్డామని చంకలెగురుసుకుంటున్న దేశం,కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు మళ్ళీ రాజీనామాలు చేసేందుకు వెనుకాడుతున్నారని ఆరోపించారు.వారిని మళ్ళీ రాజీనామాలు చేయనివ్వకుండా సీమాంధ్ర పెట్టుబడిదారులు బేరసారాలు చేస్తున్నా రని ఆరోపించారు. ఇందుకు లొంగిపోయేందుకు కొందరు సిద్ధమై రాజీనామాలకు వెనుకడుగు వేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుందన్నారు.

ఖబడ్దార్ ..ఎట్టి పరిస్థితుల్లో 141 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మళ్లీ రాజీనామాలు చేయాల్సిందేనని ఆయన హెచ్చరించారు. రాజీనామాలు చేయని వారు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని,ఆంధ్రోళ్లుగా గుర్తించాల్సి వస్తుందన్నారు. భావోద్వేగం లో చేసిన రాజీనామాలంటూ స్పీకర్ ఆమోదించకుండా తిరస్కరించడా న్ని ఆయన తప్పు పట్టారు.ఏం స్పీకర్ తమాషా చేస్తున్నావా..నిన్ను నిర్బంధం చేసైనా మా రాజీనామాలను ఆమోదించుకుంటామని అన్నారు. కాశ్మీర్‌లో ఒక మాట చైనాలో మరో మాట చెబుతూ తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకు లకు మోసం చేస్తున్న అ‘జాదు’లు తెలంగాణలో నడవవని అన్నారు.

ఆజాద్‌ను గద్దర్, దోకేబాజ్‌గా తిట్టాలని ఉందంటూనే తిట్టారు. మళ్లీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చర్చల పేరిట ఢిల్లీకి వెళితే వారిని తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. మనకు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం నుంచి బయటపడ్డ మా నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలను నియమించే ప్రయత్నంలో ఉన్న చంద్రబాబు నాయుడుకు అసలు చార్జీ ఉందో లేదో తెలియని పరిస్థితి అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అంతర్భాగమే హైదరాబాద్ అని ఆయన స్పష్టం చేశారు.

మా చార్మినార్,ఉస్మానియా ఆసుపత్రి,ఉస్మానియా క్యాంపస్, అసెంబ్లీ, సెక్రటేరియేట్ మీరొచ్చాక కట్టిండ్రా?తమిళనాడుల మిమ్మల్ని తంతే గతి లేక మా తెలంగాణలో అచ్చి పడ్డరని సీమాంధ్ర ప్రాంత ప్రజలనుద్దేశించి అన్నారు. మా ప్రాంత వనరులను దోచిన మీరు హైదరాబాద్‌ను వదలమంటారా?ఖబడ్దార్ అని హెచ్చరించారు.

తెలంగాణ విడిచి పెట్టిపోతరా? ఇలాగే హైదరాబాద్‌ను పేచిగా పెట్టి మా చీమల దండును రెచ్చగొడ్తరా? తేల్చుకోవాల్సింది ఆంధ్రోళ్లేనన్నారు.ద మ్ముంటే నిజామాబాద్‌లో సీమాంధ్ర మీటింగు పెట్టుండ్రి..చూద్దాం అంటూ వారికి సవాల్ విసిరారు.శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సర్‌ప్లేస్ 10 కోట్ల నిధులను ఆంధ్ర పాల కులు మళ్లించుకున్నారని ఈ విషయాన్ని అప్పట్లో గౌతు లచ్చన్న, పుచ్చలపల్లి సుందరయ్య బయటపెట్టి పెద్ద ఎత్తున ఉద్యమించారన్నారు.

1956 నవంబర్ నుంచి ఇలా మన ప్రాంత వనరుల దోపిడీ ప్రారంభమైందన్నారు. ఇదే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు 14 ఎఫ్ తొలగిస్తున్నామని అసెంబ్లీలో చేసిన తీర్మానం పాస్ చేసి ఇప్పుడేమో 14 ఎఫ్‌తో సంబంధం లేకుండా ఎస్‌ఐ రాత పరీక్షలు జరుపుతామని ప్రకటించడంపై ధ్వజమెత్తారు.విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని కోరారు.యాదిరెడ్డి పార్లమెంటు సాక్షిగా ఆత్మబలిదానమిచ్చి ఇదే ఆఖరి చావు కావాలని యావత్తు తెలంగాణ విద్యార్థి లోకానికి చాటి చెప్పాడన్నారు.ఇక చావులొద్దు తెలంగాణ సాధించి యాదిరెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని నాగరం విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.

No comments:

Post a Comment