తెలం గాణ రాష్ట్ర ఏర్పాటుకోసం మరో యువ కుడు దేశరాజధానిలో ఆత్మబలిదానం చేసుకున్నాడు. దేశరాజధానిలోని పార్ల మెంటు భవనం ముందు ఉరివేసుకుని తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఢిల్లీ పెద్ద లకు తెలియపరుస్తూ ఆత్మహత్య చేసు కున్నాడు. అతడు రంగారెడ్డి జిల్లాకు ఆ పేరు రావడానికి కారణమైన మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా రంగారెడ్డి స్వగ్రామం పెద్దమంగళారంకు చెందిన యువకుడు. కుటుంబసభ్యులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని పెద్దమంగళారం గ్రామానికి చెందిన మందాడి నర్సింహారెడ్డి, చంద్రకళల పెద్ద కుమారుడు యాదిరెడ్డి(30) గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో లంగర్‌హౌస్‌లో ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ ఒక సారికూడా అప్పటి నుండి ఇంటికి రాలేదు.
కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడేవాడు. 15 సంవత్సరాలక్రితం తండ్రి నర్సింహారెడ్డి మరణించాడు. యాదిరెడ్డికి తమ్ముడు ఓంరెడ్డి(27) చెల్లి మంగమ్మ(26) తల్లి చంద్రకళ(50) ఉన్నారు. మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన యాదిరెడ్డి పార్లమెంట్ భవనం ముందు ఉన్న పార్క్‌లో వేపచెట్టుకు ఉరి వేసుకున్నాడని ఢిల్లీ పోలీసులు అతని స్నేహితులకు ఉదయం 9: 30 గంటలకు సమాచారం అందించారు. యాదిరెడ్డి స్నేహితుల ద్వారా మరణ వార్త అందుకున్న తల్లి ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయింది. యాదిరెడ్డి బలిదానం వార్త విన్న గ్రామస్తులు స్నేహితులు ఇంటికి చేరుకుని వారి తల్లిని, కుటుంబసభ్యులను ఓదార్చి వారు యాదిరెడ్డితో గడపిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుని కన్నీరు మున్నీరయ్యారు.
No comments:
Post a Comment