Saturday, 23 July 2011

telangana kosam jailakkaina veltham

టీఆర్‌ఎస్ నేత రఘునందన్‌రావు
సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రజల పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారని టీఆర్‌ఎస్ మెదక్ జిల్లా కన్వీనర్ రఘునందన్‌రావు అన్నారు. తెలంగాణ కోసం, ప్రజల ఆకాంక్ష మేరకు జైళ్లకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న మోసపూరిత విధానాలతో కలత చెందిన యాదిడ్డి ఢిల్లీ వరకు వెళ్లి పార్లమెంట్ సాక్షిగా ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. యాదిడ్డి మృతదేహానికి పోస్టుమార్టం చేయించి రాష్ట్రానికి పంపించే బాధ్యతను తీసుకోవాల్సిన ఏపీభవన్ అధికారులు కనీసం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. యాదిడ్డి మృతదేహాన్ని పట్టించుకోకపోవడమే కాకుండా శవాన్ని నేరుగా శ్మశాన వాటికకు తీసుకు కాల్చివేయమని ఢిల్లీ పోలీసులకు లేఖ రాయడమేమిటని ప్రశ్నించారు.

ఈ విషయం తెలుసుకుని హరీశ్‌రావుతో పాటు తెలంగాణవాదులు ఏపీభవన్‌కు వెళ్లి ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానాలు చెప్పారని, ఈ క్రమంలో అనుకోని విధంగా హరీశ్‌రావు ఆవేశంతో చందర్‌రావు అనే ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన వివరించారు. ఎవరూ అడగకపోయినా జరిగిన సంఘటనపై ఉద్యోగికి హరీశ్‌రావు క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. ఢిల్లీలోని ఆంధ్ర భవన్‌లో పనిచేస్తున్న జయబాబు అనే అధికారిపై ఓసారి వి.హనుమంతరావు, 1986లో ఆనందరాఘవ అనే అధికారిపై కావూరి సాంబశివరావు, 1990లో మరో అధికారిపై వైఎస్ రాజశేఖరడ్డి దాడికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. అంతేకాకుండా 1991లో మల్లికార్జున్‌రావు అనే డిప్యూటీ కమిషనర్‌పై బాలరాజు అనే గ్రంథాలయ చైర్మన్, 1996లో గఫార్ అనే డిప్యూటీ కమిషనర్‌పై దానం నాగేందర్, 1998లో నాగేశ్వర్‌రావు అనే అధికారిపై ఓసారి రాజ్యసభ్యుడు కేఎం ఖాన్, మరోసారి మహ్మద్‌జానీ దాడిచేసి కొట్టారని ఆయన గుర్తుచేశారు. 2009లో ఏసీ కారు పంపలేదనే కోపంతో లింగరాజు అనే దళిత అధికారిపై మహ్మద్‌జానీ చెప్పుతో దాడిచేశారని రఘునందన్‌రావు తెలిపారు. 1996లో దానం నాగేందర్ దాడి చేసిన సమయంలో ఆంధ్ర భవన్ ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రభుత్వం వారిపై ఎస్మా ప్రయోగించిదన్నారు.

వీరంతా మంచి గది ఇవ్వలేదని, ఏసీ కారులు పంపలేదని వ్యక్తిగత కారణాల కోసం దాడులు చేసినప్పటికీ ఏ రోజు కూడా కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు. కానీ హరీశ్‌రావు భావోద్వేగంతో చేయిచేసుకున్నప్పటికీ వెంటనే క్షమాపణ చెప్పారని, అయినా ప్రభుత్వం, సీమాంవూధులు కేసులు నమోదు చేయించడం, సీమాంధ్ర మీడియా పనిగట్టుకుని ప్రచారం చేయడం ఏమిటని రఘునందన్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ వాదులకు కేసులు, జైళ్లు కొత్త కాదన్నారు.

No comments:

Post a Comment