Tuesday, 19 July 2011

ఆజాద్‌పై t_congress aagraham

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అంశంలో ఏ నిర్ణయం చేస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంతా ప్రాంతాలకతీతంగా హర్షిస్తారు? అనే కోణంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కసరత్తులు చేస్తున్న ప్రస్తుత తరుణంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి, కేంద్ర మంత్రి గులాంనబీ అజాద్‌ తెలంగాణ సమస్యను మొదటికి తెచ్చే విధంగా వ్యవహ రించారని ఈ ప్రాంత కాంగ్రెస్‌ సీనియర్‌ నాయ కులు ఆగ్రహోదగ్రులవుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను అయిదు, లేక ఆరు పేజీలతో నోట్‌ను తయారుచేసి ఇవ్వాలని అజాద్‌ కోరడాన్ని పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు తప్పుబడుతున్నారు. అంతేగాక మంగళ వారంనాడు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలతో మాట్లాడిన అజాద్‌ సంధించిన ప్రశ్నలు, మాట్లాడిన వైనం పరిశీలిస్తే ఒక అడ్వొకేట్‌లా ప్రశ్నలను సంధిం చినట్లుగా ఉందని కొందరు సీనియర్‌ నాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలను సరిదిద్ది న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని, సోనియా మేడమ్‌ ముందు మాట్లాడేందుకు తనకు 'టాకింగ్‌ పాయింట్స్‌ కావాలి కదా! అని ఆజాద్‌ కోరడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. జరిగిన అన్యాయాలకు ప్రతి గా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరు తుండగా ఆజాద్‌ ఇలా జరిగిన తప్పులను సరిది ద్దుతానని ముందుకు రావడంతో అనేక అనుమా నాలు ఉత్పన్నమవుతున్నాయని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను 'ఫూల్స్‌ (తెలివి తక్కువ)ను చేసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకివ్వాలి?, తెలంగాణను ఇస్తే సీమాం ధ్రలో కాంగ్రెస్‌పార్టీ గల్లంతవుతుంది కదా!, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టి.ఆర్‌.ఎస్‌. అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు లబ్ది చేకూరుతుంది కదా! అని అజాద్‌ నిలదీసినట్లుగా అడగటం తమను కలచివే సిందని అంటున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల గురించి, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాల గురించి, తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌, టి.ఆర్‌.ఎస్‌.ఆవిర్భావం, కె.సి.ఆర్‌.తో అజాద్‌కున్న సంబంధాలు, 2009 డిసెంబర్‌ 9వ తేదీన చిదం బరం చేసిన ప్రకటన, ఆ తర్వాత జస్టీస్‌ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు, నివేదికను ఇవ్వడం, అంతకు ముందు ప్రణబ్‌ముఖర్జీ కమిటి, సి.ఎల్‌.పి.లో తీర్మానాలు జరిగినవైనం, సోనియాగాంధీ హామీలు, కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పొందుపరిచిన వైనం, యు.పి.ఎ.ప్రభుత్వంలో కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంలో తెలంగాణ అంశం, రాష్ట్రపతి ప్రసం గాల్లో తెలంగాణ సమస్యను ప్రస్తావించడం వంటి మొత్తం వ్యవహారంపై కూలంకషంగా, స్పష్టమైన అవగాహన ఉన్న అజాద్‌ ఇప్పుడు ఏమీ తెలియ నట్లుగా 1965 నుంచి ఇప్పటి వరకూ తెలంగాణకు జరిగిన అన్యాయాలపై ఒక నోట్‌ ఇవ్వాలని కోరడం బాధగా ఉందని పలువురు సీనియర్‌ నాయకులు తీవ్ర మనస్థాపం వ్యక్తంచేస్తున్నారు. పెద్ద మనుషుల ఒప్పందాల ఉల్లంఘన, 610 జీవోను అమలు చేయకపోవడం, ఉద్యోగ, విద్య, వైద్య, వ్యవ సాయం, విద్యుత్తు, ఇతర అనేక రంగాల్లో తెలం గాణ దగాకు గురయ్యిందనే అంశాలపై కాంగ్రెస్‌ అధిష్టానంలో ఏ నాయకుడిని కదిలించినా కనీసం పది పాయింట్లను స్పష్టంగా చెప్పగలరని అంటు న్నారు. అధిష్టానంలో కీలకమైన పాత్ర పోషిస్తూ, ఆంధ్రప్రదేశ్‌పైన, తెలంగాణపైన స్పష్టమైన అవగా హన ఉన్న నాయకుడిగా అధిష్టానం గుర్తించి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా వచ్చిన అజాద్‌ ఇలా మాట్లాడటం సబబుగాలేదని, ఆయన తీరును చూస్తుంటే తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రపూరి తంగా వ్యవహరిస్తున్నారేమోననే అనుమానం కలు గుతోందని అంటున్నారు.
ఒకవైపు తెలంగాణను ఇవ్వకుండా నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తే పార్టీకి పుట్టగతులుండవని, కాంగ్రెస్‌ నాయకులెవ్వరూ తెలంగాణ పల్లెల్లో తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయని అధిష్టానం లోని ప్రతి ఒక్క నేతకూ వివ రిస్తూ వచ్చామని చెప్పారు.అంతేగాక వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మూలంగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని, కనీసం తెలంగాణాలోనైనా కాంగ్రెస్‌ను బ్రతికించాలని అధినేత్రి సోనియాగాంధీకి ప్రత్య క్షంగా, పరోక్షంగా వివరిస్తూ వచ్చామని అంటు న్నారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, చివరకు ఎంపీలు కూడా ఎవ్వరి స్థాయిల్లో వారు తెలంగాణ కోసం ఉద్య మాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారని, ఇంత జరుగుతున్నా, రాజకీయంగా అంతులేని సంక్షోభ పరిస్థితులున్నప్పటికీ అజాద్‌ సాదాసీదాగా తెలం గాణపై నోట్‌ అడగటం,తెలంగాణకు జరిగిన అన్యా యాలను సరిదిద్దుతానని చెబుతుండటం విడ్డూ రంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అయినప్పటికీ అజాద్‌ను నొప్పించకుండా, తమలోని ఆవేదన, బాధను దిగమింగుకొని నోట్‌కు బదులుగా జరిగిన అన్యాయాల నివేదికలనే అందజేశామని వివరిం చారు.అయిదురాష్ట్రాల ఎన్నికలను సాకుగా చూపిం చి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ వేచి ఉండా లని ఆదేశించినందున తాముఎలాంటి ఉద్యమాలు చేయలేదని, ఈనెలాఖరుకు గానీ, జూన్‌ మొదటి వారంలో స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఉద్యమ కార్యాచరణలను ప్రకటిస్తామని కాంగ్రెస్‌ అధిష్టా నాన్ని, ముఖ్యంగా గులాంనబీఅజాద్‌ను తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment