గుత్ఫలే పట్టాలె ఎన్నీయల్లో
గుంజికొట్టాలింక ఎన్నీయల్లో
సమైక్యమంటోన్ని ఎన్నీయల్లో... సాగనంపాలింక ఎన్నీయల్లో
సీమాంధ్ర దొంగల్ని ఎన్నీయల్లో తరిమి ఎల్లాగొట్టే రోజొచ్చెనల్లో ॥ గుత్ఫలే॥
పొత్తు గలిపిన కాడ ఎన్నీయల్లో పొల్తి గలుగాలేదు ఎన్నీయల్లో
పోలు దిరిగిన కాడ ఎన్నీయల్లో పొలికేకా బుట్టింది ఎన్నీయల్లో
బందిపోటాంవూధోల్లు ఎన్నీయల్లో మనల బంధిజేసేనెన్నియల్లో
గయ్యి గయ్యిన లేసి ఎన్నీయల్లో గడప దాటొచ్చిండ్రు ఎన్నీయల్లో ॥ గుత్ఫలే॥
నీల్లు నిధులు అన్నీ ఎన్నీయల్లో ఆంధ్రకెల్లిపాయె నెన్నీయల్లో
వాటాల కొట్లాట ఎన్నీయల్లో తూటాలు పేలినా తీరలేదల్లో
న్యాయానికై నేను నడిచొస్తెనల్లో ఎన్నీయల్లో నక్సలైటంటారు ఏంజేదునల్లో
నాభాష నీభాష ఒక్క నా బతుకు నాభాధ వేరేనల్లో ॥ గుత్ఫలే॥
కయ్యాల కాపురమెన్నీయల్లో కలిసున్నదేడరా ఎన్నీయల్లో
ఆంధ్రవూపదేశంన ఎన్నీయల్లో అన్ని ఆంధ్రోళ్లపాలె ఎన్నీయల్లో
ఇన్నాళ్ళ నా బతుకు ఎన్నీయల్లో కన్నీటి పాలాయె ఎన్నీయల్లో
పాలించె రాజులు వాళ్ళాయెనయ్యో పంచాదిలో దిక్కు నా కెవ్వడయ్యో ॥
వాడెవ్వడయ్యా వీడెవ్వడయ్యా వలసాంధ్ర పాలకుడీడెందుకయ్యా
వొద్దు వొద్దని నాడు నెత్తిగొట్టుకున్నా గద్దలోలె వచ్చి వాలేనయ్యా
వొచ్చింది మొదలూ ఓ తిక్కలయ్య ఒక్కటొక్కటి వాల్లు వొడిపించెనయ్యా
తెలంగాణ తెర్లు తెర్లు జేసినోడు తేట తెలుగు మాటలల్లేనయ్యా
ప్రాంతానికో తీరు పాలించుకుంట ప్రజాస్వామ్యమంటూ బొంకేనయ్యా ॥ గుత్పలే॥
అమరులా త్యాగాలు ఎన్నీయల్లో ఆత్మబలిదానాలు ఎన్నీయల్లో
దీక్షలు బందులు ఎన్నీయల్లో దిక్కులన్నీ కదిలె ఎన్నీయల్లో
డిసెంబరు తొమ్మదెన్నీయల్లో తెలంగాణ తొలిపొద్దు వెలిగేనల్లో
ఓర్వలేనాంవూధోల్లు ఎన్నీయల్లో కుట్రపన్ని పప్పుగాసేనల్లో ॥ గుత్ఫలే॥
తెలంగాణ జైయ్యంటు సీమాంధ్ర దొరలు సంతకాలు గూడ జేసేనల్లో
తెలంగాణ పేరుతో ఎన్నీయల్లో ఓట్లుదండుకుండ్రూ ఎన్నీయల్లో
గెలిసి గద్దెనెక్కి ఎన్నీయల్లో తెలిసి మోసం జేసే ఎన్నీయల్లో
తెలంగాణ ప్రకటన ఎన్నీయల్లో వచ్చినంతనె సిచ్చులేపెనల్లో ॥ గుత్ఫలే॥
విప్లవాలు దెస్తె ఎన్నీయల్లో విద్రోహులన్నారు ఎన్నీయల్లో
ఉద్యమాలు జేస్తే ఎన్నీయల్లో ఉత్తదేనన్నారు ఎన్నీయల్లో
అరవయేండ్ల గోసా ఎన్నీయల్లో అణచేయ జూసిండ్రు ఎన్నీయల్లో
పొలిమెరలు దాటించ ఎన్నీయల్లో పొర్లిచ్చి కొట్టాలె ఎన్నీయల్లో ॥ గుత్ఫలే॥
వాడెవ్వడయ్యా వీడెవ్వడయ్యా వలసాంధ్ర పాలకుడీ డెందుకయ్యా
ఉస్మానియా కాకతీయ క్యాంపస్‌లో ఉచ్చుబెట్టి ముండ్లకంచె గట్టేనయ్యా
తెలంగాణ పదిజిల్లాల లోన పోలీసు బలగాల క్యాంపాయె నయ్యో
నాటి రజాకారు పాలననే మించే ప్రజాస్వామ్యమేడ బతికున్నదయ్యో
విద్యార్థి ఉద్యోగి మేధావి ఎవరైనా విద్రోహులన్నట్టు జూస్తున్నరయ్యో ॥ గుత్ఫలే॥
భారత చరితను ఎన్నీయల్లో బంగపరిచేటోల్లు ఎన్నీయల్లో
చట్టసభల నిండ ఎన్నీయల్లో బద్మాశులే ఉండ్రు ఎన్నీయల్లో
పార్లమెంటు మాట ఎన్నీయల్లో పక్కకే పెట్టిండ్రు ఎన్నీయల్లో
ఆడితప్పిన మాట ఎన్నియల్లో ఆగ్గిబెట్టినాది ఎన్నీయల్లో ॥ గుత్ఫలే॥
పద ముగ్గురాల్లుంటె ఎన్నీయల్లో పదిమంది మేమాయెనెన్నీయల్లో
ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళెక్కువల్లో ఏలెక్క జూసిన మేంతక్కువల్లో
పెండ్లి కొడుకులేమో వాళ్ళాయెనల్లో పెట్టి పోతలు మాకు తప్పలేదల్లో ॥ గుత్ఫలే॥
No comments:
Post a Comment