Friday, 29 July 2011

telangana ku anukulam ante a charcha kaina siddam:kothandaram

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ప్రకటిస్తే హైదరాబాద్ సహా ఏ విషయంపైనైనా చర్చించటానికి సిద్ధమని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించటానికి అవసరమైన మద్దతును అందచేస్తామని ఆయన విలేఖరులకు చెప్పారు. తెలంగాణను ఇవ్వటంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసిన తరువాతే ప్రభుత్వానికి సమస్య తీవ్రత అర్థమైందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం మొదలుపెట్టిన చర్చలు లక్ష్య సాధన దిశలో జరగటం లేదని ఆయన పేర్కొన్నారు. ఇక ఎట్టి జాప్యం చేయకుండా ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. ఆగస్టు ఒకటి లోపు తెలంగాణ గురించి స్పష్టమైన హామీ లభించకపోతే సకల జన సమ్మె తప్పదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకోసం తాము ప్రారంభించనున్న సకల జన సమ్మె గురించి జాతీయ పార్టీల నాయకులకు వివరించటానికే తమ ప్రతినిధివర్గం ఢిల్లీకి వచ్చిందని ఆయన చెప్పారు. తెలంగాణకు జాతీయ పార్టీల నాయకుల నుంచి పూర్తి మద్దతు లభించిందని ఆయన చెప్పారు.
సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత: డిజిపి
హైదరాబాద్, జూలై 28: పోలీసు శాఖలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటామని డిజిపి వి.దినేష్‌రెడ్డి చెప్పారు. అంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తరపున సభ్యులు డిజిపిని కలిశారు. ఈ సందర్భంగా సభ్యులు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను డిజిపి దృష్టికి తీసుకెళ్ళారు. సిబ్బందికి వెయిటేజ్ ఇంక్రీమెంట్, మహిళా పోలీసులకు సౌకర్యాలు వంటి అంశాలను వారు వివరించారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని డిజిపి హామీ ఇచ్చారు. డిజిపిని కలిసిన వారిలో అధ్యక్షుడు కెవి చలపతిరావు, ఉపాధ్యక్షుడు రవీంద్రకుమార్, గౌరవ అధ్యక్షుడు సి.రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.

october lo telangana:p shankar rao

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అక్టోబర్‌ మూడో వారంలో సానుకూల ప్రకటన రానున్నదని మంత్రి పి.శంకర్‌రావు పేర్కొన్నారు. నూటికి నూరుపాళ్లు తెలంగాణ వచ్చితీరుతుందని చెప్పారు. తాను చెప్పిన సమయానికంటే ముందే వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదన్నారు. గురువారం సిఎల్‌పిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావ ేశంలో ఎమ్మెల్యే ప్రసాద్‌, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి ఆయన మాట్లాడారు.

తెలంగాణ రావడం ఖాయం కనుక విద్యార్ధులెవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. అందరం కలసి తెలంగాణ కోసం పాటుపడాల్సి ఉందన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలిచ్చిన యాదిరెడ్డి కుటుంబానికి రూ.1లక్ష ఆర్ధిక సహాయం చేసినట్లు ఆయన వెల్లడించారు. యాదిరెడ్డి కుటుంబంలో ఒకరికి ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా ఉద్యోగం కల్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణాలిచ్చిన శ్రీకాంత్‌చారి కుటుంబానికి కూడా ఔట్‌ సోర్సింగ్‌ కింద ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకొంటామన్నారు. ఈ కుటుంబాలకు ప్రభుత్వ సహాయంతో ఇళ్లు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణ కోసం మళ్లీ రాజీనామాలు చేయాలని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించగా రాజీనామాలు గొప్పవా, త్యాగాలు(ప్రాణత్యాగం) గొప్పదా అన్నది ప్రజాభిప్రాయం కోరాల్సి ఉందని పొంతన లేని సమాధానం ఇచ్చారు.

telangana kosam athmabali thanaloddu

తెలంగాణ రాష్ర్టం ఏర్పాటుకు అనుకూల ప్రకటన అక్టోబర్‌ 3వ వారం లో వెలువడుతుందని మంత్రి శంకర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ర్టం కోసం ఢిల్లీ పార్లమెంటు ముందు ఆత్మ బలిదానం చేసుకున్న యాదిరెడ్డి కుటుంబాన్ని గురువారం మంత్రి శంకర్‌రావు, ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ కొత్త సంజీవరెడ్డి పరామర్శించారు. యాదిరెడ్డి తల్లి చంద్రమ్మకు, తమ్ముడు ఓంరెడ్డిలకు మనోధైర్యం చ ెప్పారు. ఈసందర్భంగా మంత్రి శంకర్‌రావు, ఏఐసీసీ కార్యదర్శి పీ. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కోసం వేగవంతంగా చర్యలు జరుగుతున్నాయి.

అక్టోబర్‌ 3 వ వారంలో తెలంగా ణకు అనుకూల ప్రకటన రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. యాదిరెడ్డి ఆశయం త్వర లో నెరవేరనుందన్నారు. సోనియాగాంధీ తెలంగాణ కు అనుకూలంగా ఉందని చెప్పారు. తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్‌ పార్టీ, తెచ్చేది తెలంగాణ అమరవీరులన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ గత 56 సంవత్సరాలుగా ఉందని తెలిపారు. రానురాను తెలంగాణ సెంటిమెంట్‌ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. 1956 లో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతా లు కలిసి ఆంధ్ర రాష్ర్టం ఏర్పడింది. తెలంగాణ అమా యక అమ్మాయి, సీమాంధ్ర పోకిరీ అబ్బాయితో బం ధం ఏర్పడుతుందని ఆనాడు పండిట్‌ జవ హర్‌లాల్‌ నెహ్రూ అన్నారు.

ఏకారణాల వల్లనైనా విడిపోవచ్చని నెహ్రూ నిజామాబాద్‌లో చెప్పారు. ఇరు ప్రాంతాలు ఒకటైనప్పుడు అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆఒప్పందాలను తుంగలో తొక్కారని అన్నారు. తెల ంగాణ ఉద్యమానికి ఉన్న చరిత్ర ప్రపంచంలో ఏ ఉద్యమానికి లేదని వివరించారు. ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలతో ఆత్మబలిదానం చేసుకో వద్దని పిలుపునిచ్చారు. పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందామన్నారు. వారి వెంట గ్రామ సర్పంచ్‌ చేగూరి రామకృష్ణగౌడ్‌, మాజీ ఎంపీటీసీ ఖండిక రమేశ్‌, నాయకులు శ్రీరాంసాగర్‌, కృష్ణారెడ్డి, ఓంరెడ్డి లు ఉన్నారు. యాదిరెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించిన మందడి యాదిరెడ్డి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఏదైనా ఓ శాఖలో ఉద్యోగం పెట్టిస్తామని మంత్రి శం కర్‌రావు, ఎమ్మెల్సీ పీ. సుధాకర్‌రెడ్డిలు చెప్పారు. అదే విధంగా వారి కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్థిక సహా యం అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వా రా వారికి ఇల్లు మంజూరు చేయడానికి కృషి చేస్తామ ని తెలిపారు. తెలంగాణ యువతీ-యువకులకు, తెలంగాణ ఉద్యమకారులకు అందిరికి ఆత్మబ లిదానాలు చేసుకోవద్దని ధైర్యంగా ముందుకు నడిచి తెలంగాణ సాధించుకోవాలని ఆయతతతన కోరారు.

poradi telangana sadhichukunda:nagam janardhan reddy

నిజామాబాద్ సాక్షిగా చెబుతున్నా..వాళ్లిచ్చేదేంది మనమంతా ఏకమై తెలంగాణ ను గుంజుకుందాం అని రాజీనామా చేసిన తాజా ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని నాయకులంతా ఏకం కావాలని ఐక్య పోరాటానికి తాము సిద్ధమన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట మందాడి యాదిరెడ్డి ప్రాంగణం లో జరిగిన తెలంగాణ ఐక్యతా దీక్షలో కూర్చున్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ లోని నాయకులంతా ఒకటి కావాలన్నదే ఐక్యతా దీక్ష ఉద్దేశమన్నారు. నాయ కులంతా ఒకటి కావాలని కానీ వారంతా తెలంగాణ ద్రోహులని అన్నారు.

తెలంగా ణ తెలుగు దేశం ఫోరం ఎమ్మెల్యేలు మొదట మేమే రాజీనామాలు చేశామని బస్సు యాత్ర జేసి చెపుకున్నా రాజీనామాల తిరస్కరించిన తర్వాత ఎందుకు రాజీనా మాలు చేయడం లేదని వాళ్లు ఇప్పుడెక్కడికి పోయిండ్రని నాగం ప్రశ్నించారు. వారికి కాగితం కలం దొరకడం లేదా? అని ఎద్దేవా చేశారు. నాటకాలు పక్కన బెట్టాలని వారికి హితవు పలికారు.

రాజీనామాల ఉచ్చులోంచి తిరస్కరించడంతో బయటపడ్డామని చంకలెగురుసుకుంటున్న దేశం,కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు మళ్ళీ రాజీనామాలు చేసేందుకు వెనుకాడుతున్నారని ఆరోపించారు.వారిని మళ్ళీ రాజీనామాలు చేయనివ్వకుండా సీమాంధ్ర పెట్టుబడిదారులు బేరసారాలు చేస్తున్నా రని ఆరోపించారు. ఇందుకు లొంగిపోయేందుకు కొందరు సిద్ధమై రాజీనామాలకు వెనుకడుగు వేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుందన్నారు.

ఖబడ్దార్ ..ఎట్టి పరిస్థితుల్లో 141 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మళ్లీ రాజీనామాలు చేయాల్సిందేనని ఆయన హెచ్చరించారు. రాజీనామాలు చేయని వారు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని,ఆంధ్రోళ్లుగా గుర్తించాల్సి వస్తుందన్నారు. భావోద్వేగం లో చేసిన రాజీనామాలంటూ స్పీకర్ ఆమోదించకుండా తిరస్కరించడా న్ని ఆయన తప్పు పట్టారు.ఏం స్పీకర్ తమాషా చేస్తున్నావా..నిన్ను నిర్బంధం చేసైనా మా రాజీనామాలను ఆమోదించుకుంటామని అన్నారు. కాశ్మీర్‌లో ఒక మాట చైనాలో మరో మాట చెబుతూ తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకు లకు మోసం చేస్తున్న అ‘జాదు’లు తెలంగాణలో నడవవని అన్నారు.

ఆజాద్‌ను గద్దర్, దోకేబాజ్‌గా తిట్టాలని ఉందంటూనే తిట్టారు. మళ్లీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చర్చల పేరిట ఢిల్లీకి వెళితే వారిని తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. మనకు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం నుంచి బయటపడ్డ మా నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలను నియమించే ప్రయత్నంలో ఉన్న చంద్రబాబు నాయుడుకు అసలు చార్జీ ఉందో లేదో తెలియని పరిస్థితి అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అంతర్భాగమే హైదరాబాద్ అని ఆయన స్పష్టం చేశారు.

మా చార్మినార్,ఉస్మానియా ఆసుపత్రి,ఉస్మానియా క్యాంపస్, అసెంబ్లీ, సెక్రటేరియేట్ మీరొచ్చాక కట్టిండ్రా?తమిళనాడుల మిమ్మల్ని తంతే గతి లేక మా తెలంగాణలో అచ్చి పడ్డరని సీమాంధ్ర ప్రాంత ప్రజలనుద్దేశించి అన్నారు. మా ప్రాంత వనరులను దోచిన మీరు హైదరాబాద్‌ను వదలమంటారా?ఖబడ్దార్ అని హెచ్చరించారు.

తెలంగాణ విడిచి పెట్టిపోతరా? ఇలాగే హైదరాబాద్‌ను పేచిగా పెట్టి మా చీమల దండును రెచ్చగొడ్తరా? తేల్చుకోవాల్సింది ఆంధ్రోళ్లేనన్నారు.ద మ్ముంటే నిజామాబాద్‌లో సీమాంధ్ర మీటింగు పెట్టుండ్రి..చూద్దాం అంటూ వారికి సవాల్ విసిరారు.శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సర్‌ప్లేస్ 10 కోట్ల నిధులను ఆంధ్ర పాల కులు మళ్లించుకున్నారని ఈ విషయాన్ని అప్పట్లో గౌతు లచ్చన్న, పుచ్చలపల్లి సుందరయ్య బయటపెట్టి పెద్ద ఎత్తున ఉద్యమించారన్నారు.

1956 నవంబర్ నుంచి ఇలా మన ప్రాంత వనరుల దోపిడీ ప్రారంభమైందన్నారు. ఇదే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు 14 ఎఫ్ తొలగిస్తున్నామని అసెంబ్లీలో చేసిన తీర్మానం పాస్ చేసి ఇప్పుడేమో 14 ఎఫ్‌తో సంబంధం లేకుండా ఎస్‌ఐ రాత పరీక్షలు జరుపుతామని ప్రకటించడంపై ధ్వజమెత్తారు.విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని కోరారు.యాదిరెడ్డి పార్లమెంటు సాక్షిగా ఆత్మబలిదానమిచ్చి ఇదే ఆఖరి చావు కావాలని యావత్తు తెలంగాణ విద్యార్థి లోకానికి చాటి చెప్పాడన్నారు.ఇక చావులొద్దు తెలంగాణ సాధించి యాదిరెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని నాగరం విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.

telangana pi ventane thelchali:cpm

ప్రజల ఆకాంక్షను గౌరవించి, కేంద్రం వెంటనే తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గురువారం ముదిగొండ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ భూములను పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టారని, కాని పేద ప్రజలు జానెడు జాగా అడిగితే కాల్చి చంపారని విమర్శించారు.

యూపీఏ ప్రభుత్వం కుంభకోణాల్లో ఇరుక్కొ ని , కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సీపీఎం పేదప్రజల పక్షాన ఉండి , ప్రజాపోరాటాల చేస్తూ అమరవీరుల ఆశయ సాధనకు కృషిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.

భట్టీ మట్టి కొట్టుకుపోతావ్: పొన్నం వెంకటేశ్వర్లు
మధిర నియోజక వర్గంలో సీపీఎంను అణచటానికి డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క కుయుక్తులు పన్నుతూ గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్నాడని, అధికారంతో అధికారులను బెదిరిస్తూ తన చెప్పుచేతల్లో ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి పొన్నం వెంకటేశ్వర్లు అమరవీరుల సంస్మరణ సభలో తీవ్రంగా విమర్శించారు. ముదిగొండ తహసీల్దార్‌తో పాటు కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని ఆయన ఆరోపించారు.

సీపీఎంపై కక్షసాధింపు ధోరణి అవలంభిస్తున్నాడని విమర్శించారు. ఈ ధోరణి విడనాడకుంటే ప్రజా కంటకులు అందరిలా మట్టి కొట్టుకుపోతాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ సభకు సీపీఎం మండల కార్యదర్శి కూరపాటి శ్రీనవాసరావు అధ్యక్షత వహించగా , సీపీయం నాయకులు బంకా మల్లయ్య . బండి రమేష్ , లింగాల కమల్రాజు , మచ్చా లక్ష్మి , బండారు రవికుమార్ , పీసీ వీరస్వామి, బండి పద్మ , వాసిరెడ్డి ప్రసాద్ , పాల్వాయి పాండు రంగారావు , భట్టు పురుషోత్తం పాల్గొన్నారు.

ఘనంగా నివాళి...
స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి అమరవీరుల స్మారక స్థూపం వరకు కార్యకర్తలు , నాయకులు , మృతవీరుల కుటుంబ సభ్యులు ప్రదర్శన నిర్వహించి స్మారక స్థూపం వద్ద అమరులకు ఘనంగా నివాళులర్పించారు. డప్పు బృందాలతో , ప్రజానాట్యమండలి కళాకారులు పాటలు నృత్యాలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. సభా వేదికపైన ప్రజానాట్యమండలి కళాకారులు అమరవీరుల త్యాగాల పాటలు విన్పించారు. మృత వీరుల కుటుంబాల సభ్యులను సీపీఎం నాయకులు బంకా మల్లయ్య వేదిక మీదకు పిలిచి సభికులకు పరిచయం చేశారు.

‘నమస్తే తెలంగాణ’కు అభినందనల వెల్లువ...
ఆనాటి ముదిగొండ కాల్పుల ఘటనను కళ్ళకు కట్టినట్లు చూపించిన నమస్తే తెలంగాణ దినపత్రికను ముదిగొండ అమరవీరుల కుటుంబాల వారు అభినందనలతో ముంచెత్తారు. ఏ పత్రికలో రాయని విధంగా ఆమరవీరుల కుటుంబాల బాధలు వర్ణించారని పేర్కొన్నారు . పేద ప్రజానీకానికి తెలంగాణ ముద్దుబిడ్దలకు అండగా నిలిచిన నమస్తే తెలంగాణ పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.

GOVERNMENT EMPLOYEES LO 90% SEEMANDRU LE

ప్రభుత్వ అధికారుల్లో 90శాతానికి పైగా వారే ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. పై స్థాయి సీమాంధ్ర అధికారులు కిందిస్థాయి తెలంగాణ ఉద్యోగులపై వివక్ష చూపుతూ నానా విధాలుగా వారిని హింసిస్తున్నారు. విటన్నీంటిని తిప్పి కొట్టాలం తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారానే సాధ్యమని గ్రహించి ఉద్యమిస్తున్నామంటు న్నారు టీఎన్జీఓ జేఏసీ జిల్లా ఛైర్మన్ రాజేందర్డ్డి. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీఓల పాత్ర గురించి..

2009లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ఉద్యమం చరిత్ర తిరగరాసింది. ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం డిసెబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రక్రియ మొదలైనట్లు ప్రకటన చేసి మళ్లీ 23న మాట మార్చింది. ఆ సమయంలోనే జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓలు సమావేశమై టీఎన్జీఓ అధ్యక్షుడిడు రాజేందర్డ్డిని ఉద్యోగ జేఏసీ ఛైర్మన్గా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటునారు. రాష్ట్ర పొలిటికల్, ఉద్యోగ జేఏసీల ఆదేశానుసారం ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకొని ఉద్యమంలో కొత్త పంథాలో పాలుపంచుకుంటున్నారు.

అందులో భాగంగానే ఒకటి జనవరి 2010న పాల్కొండనుంచి తెలంగాణ చౌరస్తా వరకు మోటార్సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జనవరి నాలుగు 2010న ఉద్యోగుల పెన్డౌన్, అదే నెల 28న జెడ్పీ స్టేడియంలో పాలమూరు ప్రజల ధర్మాక్షిగహం లక్ష్య మందితో సత్యాక్షిగహాలు అనే వినూత్న కార్యక్షికమాన్ని నిర్వహించారు. అలాగే 6 ఏప్రిల్ 2010న జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధూంధాం కావొచ్చు, 14 జూలై 2010న జిల్లాలో మౌన ప్రదర్శన, 14 ఆగస్టు 2010న ఉద్యమంలో అసువులు బాసిన 12మంది అమరవీరుల కుటుంబాలకు 30,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేసే కావొచ్చు అనేక రూపాల్లో కార్యక్షికమాలు చేపట్టారు.

ఆయా కార్యక్షికమాలకు టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కె.స్వామిగౌడ్, కార్యదర్శి దేవి ప్రసాద్లు, హరీష్రావు, లక్ష్మణ్, తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ, జేఏసీ ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య తదితర ముఖ్యనేతలు హాజరయ్యారు. 26 నవంబర్ 2010న టీఎన్జీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలమూరు ప్రజా యాత్రను పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ప్రారంభించారు.

అదే నెల 28న నాగర్కర్నూల్లో అమరవీరుల స్థూపం నిర్మాణానికి టీఎన్జీఓ అధ్యక్షుడు రాజేందర్డ్డి భూమి పూజ చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీ కృష్ణ కమిటీకి తెలంగాణ ఉద్యోగాల్లో సీమాంవూధులు ఎంత మంది ఉన్నది తెలియజేశారు. తెలంగాణ ఉద్యమానికి ఉద్యోగులను దూరం చేయాలనే కుట్రతో ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓను ఉపసంహరించుకునే వరకు నిరసనలు, రాస్తారోకోలు చేశారు. ఆగస్టులో నిర్వహించే సకల జనుల సమ్మెలో పాల్గొంటామంటున్నారు. ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తే సహించేది లేదని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.

raginamalu upasamharincuko:madhu yashki

రాజీనామాలు ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని ఎంపీ మధుయాష్కి ఆజాద్‌కు స్పష్టం చేశారు. తెలంగాణ ఎంపీలతో నేడు ఆజాద్ చర్చించారు. పార్లమెంటు సమావేశాలకు సహకరించాలని తెలంగాణ ఎంపీలను కోరారు. ఆగస్టు 6న సీమాంధ్ర నేతలతో చర్చలు జరుపుతామని ఆజాద్ వెల్లడించారు. తెలంగాణ అంశంపై ఎటువంటి హామీ లేకుండానే చర్చలు ముగిసాయి.

chanrababu telangana drohi:nagam janardan

రెండు కండ్ల సిద్ధాంతకర్త చంద్రబాబు పథకం ప్రకారమే యనమలతో సమైఖ్యనినాదాన్ని అనిపించాడని నాగం జనార్దన్‌రెడ్డి విమర్సించారు. రెండు ప్రాంతాలకు స్వేచ్ఛ యిచ్చానాని చెప్పడం తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడమేనన్నారు. డబ్బుల కోసం నీచమైన రాజకీయం చేస్తూన్నాడన్నారు. యనమల ప్రకటనకు మద్ధతుగా చంద్రబాబు నిస్సిగ్గుగా తెలంగాణపై నేను చెప్పిందే విధానమని చెప్పడం టీటీడీపీ ఫోరం నేతలు గ్రహించాలన్నారు. బస్సు యాత్రలపేరుతో తెలంగాణ టీడీపీ నేతలు చెప్పిన మాటలు గాలీ మాటలేనా? అని ప్రశ్నించారు.ఎంతసేపు రెండు ప్రాంతాలలో పార్టీనీ కాపాడుకోవలనేకుంటుండు కాని తెలంగాణ తేవాలనే ఏలాంటి ఆలోచన లేదని చంద్రబాబు స్పష్టంగా చేపుతున్నాడన్నారు. ఇకనైనా బాబు అడుగులకు మడుగులు వత్తకుండా టీటీడీపీ కన్వీనర్ యర్రబెల్లి దయాకర్‌రావు కండ్లు తెరవాలన్నారు.

Telangana Amara Veerulara Joharlu Mee Tyagam Vruda Kanivam

seemandhra leaders are terrorists:trs leader harish rao

యనమల వ్యాఖ్యలపై హరీష్‌రావు మండిపాటు
టీడీపీ ఫోరం నేతలు ఇప్పుడేమంటారని ప్రశ్న

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణకోసం యువకులు పిట్టల్లాగా రాలిపోతున్నా సీమాంధ్ర నేతలు కనీస మానవత్వం లేకుండా కసాయిల్లాగా, తీవ్రవాదుల్లాగా మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు మండిపడ్డారు. గురువారమిక్కడ తెలంగాణభవన్‌లో పార్టీ నేతలు ఎస్.నిరంజన్‌రెడ్డి, బి.సుమన్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘‘తెలంగాణకు అనుకూలమంటూ టీడీపీ 2008లో ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన తీర్మానానికి కాలం చెల్లిందని, 2011లో సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామంటూ ఆ పార్టీ సీనియర్ నేత యనుమల రామకృష్ణుడు మాట్లాడారు. చంద్రబాబుతో సమావేశమైన వెంటనే, పొలిట్‌బ్యూరో హాలులో మాట్లాడిన మాటలు టీడీపీ విధానాన్ని చెబుతున్నాయి. యనమల వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించకుంటే సమైక్యవాదమే టీడీపీ విధానమని ప్రజలు తేల్చుకుంటారు. తెలంగాణలో పీఆర్పీకి పట్టిన గతే టీడీపీకి పడుతుంది. టీడీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారు’ అని హెచ్చరించారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని, ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖను వాపస్ తీసుకోలేదని చెప్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ తెలంగాణ నేతలు ఇప్పుడు ఏమంటారని ప్రశ్నిం చారు. చంద్రబాబుతో తేల్చుకుంటారో, టీడీపీ నుండి బయటకొస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ తెలంగాణ నేతలు ఇంకా కళ్లు తెరువకుంటే ప్రజలు మూడోకన్ను తెరుస్తారన్నారు. టీడీపీ సమైక్యవాదానికి వెళ్లిందా.. తెలంగాణకు కట్టుబడి ఉందా అనేది చంద్రబాబుతో చెప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు టీడీపీ కట్టుబడి ఉంటే యనమల రామకృష్ణుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రవారు నాయకులు కాదని, ఖల్ నాయకులని విమర్శిం చారు. హైదరాబాద్‌లో రాజధాని పెట్టడం ద్వారా తెలంగాణ ప్రజలే త్యాగం చేశారన్నారు. విడిపోవడానికి ఏకాభిప్రాయం కావాలంటున్న వారికి కలిసి ఉండటానికి ఏకాభిప్రాయం అవసరంలేదా అని హరీష్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని సీమాంధ్ర నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.

telangana ku anukulam ga echina lekha ku kalam chellindi:yanamala

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం గతంలో నియమిం చిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి కాలం చెల్లిందనీ... అలాగే ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు అనుకూలమంటూ తాము ఆ కమిటీకిచ్చిన లేఖకూ కాలం చెల్లిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ప్రణబ్ కమిటీ తర్వాత.. రోశయ్య కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, డిసెంబరు 9న చిదంబరం ప్రకటన, ఆ ప్రకటనకు సవరణ, తాజాగా మరో కేంద్రమంత్రి ఆజాద్ కాంగ్రెస్ నేతలతో సంప్రదింపుల వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవరిస్తూ తాజాగా జారీ చేసిన జీవోనే అందరూ పరిగణనలోకి తీసుకుంటారని, తెలంగాణ విషయంలో తమ లేఖ పరిస్థితి కూడా అంతేనని వ్యాఖ్యానించారు. ఆ లేఖకు విలువ ఉందో లేదో వెల్లడించాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ విషయంలో కేంద్రం త్వరగా తేల్చాలని తాజాగా జరిగిన మహానాడులో తాము తీర్మానం చేశామని, అందులో అన్ని ప్రాంతాల వారు భాగస్వాములు అయినందున అదే అంతిమమని పేర్కొన్నారు. ఆ తీర్మానానికే తాము కట్టుబడి ఉంటామన్నారు. గురువారం ఎన్‌టీఆర్ భవన్‌లో యనమలతో పాటు మోత్కుపల్లి నర్సింహులు, కాలువ శ్రీనివాసులు, పి.చంద్రశేఖర్, ఎం.అరవిందకుమార్‌గౌడ్ , వేం నరేందర్‌రెడ్డి, పెద్దిరె డ్డి తదితరులు పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. అరవిందకుమార్‌గౌడ్, వేం నరేందర్‌రెడ్డి అక్కడ్నుంచి వెళ్లాక.. మిగిలిన నేతలు పొలిట్‌బ్యూరో సభ్యుల గదుల్లో ఉన్న సమయంలో యనమల మీడియాతో మాట్లాడారు. మే నెలలో జరిగిన మహానాడులో.. తెలంగాణపై తాము చెప్పాల్సింది అంతా చెప్పామని, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని తీర్మానించినట్లు గుర్తుచేశారు. ‘‘చిదంబరం, ఆజాద్ అడిగితేనో, వారు సమావేశాలు ఏర్పాటు చేస్తేనో వెళ్లాల్సిన అవసరం లేదు. మరోమారు అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామా లేదా అన్నది తర్వాత చెప్తాం. ఏ ప్రాంత నేతలు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఉద్యమాలు చేయటంతో పాటు ప్రజలు చేపట్టిన ఆందోళనల్లో భాగస్వాములు అవుతున్నారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన సీమాంధ్ర ప్రాంత నేతల సమావేశంలో కూడా సమైక్యాంధ్రకు కట్టుబడాలని తీర్మానించాం’’ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు రెండు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదన తమకు అంగీకారం కాదని, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లో భాగమని చెప్పారు. రెండు, మూడు రాజధానులు అంటూ ఆజాద్ ఆంధ్రప్రదేశ్‌ను మరో జమ్మూకాశ్మీర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ర్టం రావణకాష్టం కావటానికి, ప్రాంతాల మధ్య విభేదాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ప్రకారం కేంద్రమే నిర్ణయం తీసుకోవాలన్నారు. శ్రీకృష్ణ కమిటీకి చట్టబద్ధత లేదని, ఆ కమిటీ చేసిన ఖర్చును కాగ్ ప్రశ్నించే అవకాశం ఉందన్నారు. తమ పార్టీలోని సీమాంధ్ర, తెలంగాణ నేతలు కూర్చొని ఉమ్మడి అభిప్రాయానికి రావాలని చెప్తున్న చిదంబరం.. కాంగ్రెస్‌లో ఆ ప్రయత్నం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తమ పార్టీలోని అంతర్గత వివాదాలను పరిష్కరించుకునేందుకు కాంగ్రెస్.. తెలంగాణ సమస్యను అడ్డం పెట్టుకుంటోందని మండిపడ్డారు.

Wednesday, 27 July 2011

telangana rasta sadanaki dappula daruvu

తెలంగాణ గుండె చప్పుడు భాగ్య నగర వీధులలో డప్పుల దరువై మోగింది.. అణచివేతను ధిక్కరిస్తూ కళాకారుల గొంతులు ఒక్కటయ్యాయి.. దిక్కులు పిక్కటిల్లేలా పాటల ప్రవాహం సాగింది.. తెలంగాణ కళాకారులతో సీమాంధ్ర కళాకారులు జతకట్టారు.. కోయా, ధింసా, గోండు నృత్యాలు చేశారు.. డప్పులు దరువుకు అనుగుణంగా కళాకారులు చిందేశారు... డోలు దెబ్బ చిందాట లంబాడీల నృత్యంతో నగరవాసులు పరవశించారు. బతుకమ్మ, బోనాలతో తెలంగాణ సంస్కృతి చాటిచెప్పి.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి అరుణోదయ కళాకారులు నగారా మోగించారు.
తెలంగాణ సాధన కోసం కళాకారులు గర్జించారు. దిక్కుల పిక్కటిల్లేలా ‘జై తెలంగాణ’ నినాదాలు చేశారు. వారి డప్పుల దరువుతో భాగ్యనగరం దద్దరిల్లింది. తెలంగాణ అభిమానులను ఉత్తేజ పరిచింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కళాకారులు కూడా తెలంగాణ కోసం నినదించారు. సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమొక్రసి ఆధ్వర్యంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య మంగళవారం నిర్వహించిన తెలంగాణ డప్పుల దరువు, ఆట- పాటలో పాల్గొనడానికి వచ్చిన ఎర్రని దుస్తులతో కళాకారులతో ఇందిరాపార్కు ఎరుపు రంగు పులుముకుంది. ఉదయం 9 నుంచే తెలంగాణ జిల్లాల నుంచి వేలాది మంది కార్యకర్తలు ఇందిరాపార్కుకు తరలివచ్చారు.


వీరితో పాటు సీమాంధ్ర జిల్లాలైన కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కళాకారులు తరలివచ్చారు. వారంతా మధ్యాహ్నం వరకూ తమ తమ కళారూపాలను ప్రదర్శించారు. తెలంగాణలో కరెంటు కష్టాలను కళ్లకు కట్టినట్టుగా ఓ కళాకారుడు ప్రదర్శించాడు. హైదరాబాద్ కళాకారులు బోనాలు, బతుకమ్మతో ఇందిరాపార్కుకు తరలివచ్చారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రముఖ విద్యావేత్త, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య కళాకారుల ప్రదర్శనను ప్రారంభించారు. సీపీఐ(ఎంఎల్) న్యూ డెమొక్షికసీ, అరుణోదయ కళాకారులు, పీఓడబ్ల్యూ నాయకులు వేములపల్లి వెంకవూటామయ్య, నాగన్న, అరుణోదయ రామారావు, సూర్యం, గోవర్ధన్, సంధ్య, ఝాన్సీ ప్రదర్శనకు ముందు భాగాన నడువగా కళాకారులు వెంట నడిచారు.



పార్కు నుంచి డప్పు దరువులతో కిలోమీటర్ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీని భాగ్యనగరవాసులు ఆసక్తిగా తిలకించారు. మాజీ ఎమ్మెల్యే బోడ జనార్దన్, న్యాయవాదుల జేఏసీ కళాకారులకు సంఘీభావం ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటలకు సుందరయ్య పార్కుకు ఈ ర్యాలీ చేరుకుంది. అనంతరం కళాకారులు వేదికపై ప్రదర్శనలు ఇచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన కొండడ్లు, ఆదిలాబాద్‌కు చెందిన థింసా, గోండు, నిజామాబాద్‌కు చెందిన సింధు, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, హైదరాబాద్, మెదక్, రంగాడ్డి జిల్లాల డప్పు కళాకారులు వేదికపై ప్రదర్శనలు ఇచ్చారు. సీమాంధ్ర జిల్లాలైన కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కళాకారులు కూడా ‘జై తెలంగాణ’ అంటూ తమ కళారూపాలు ప్రదర్శించారు.

తెలంగాణ సాధించే వరకూ పోరాడుతామని కళాకారుల తరుపున అరుణోదయ రామారావు ప్రకటించారు. తెలంగాణ తల్లిని తాళ్లతో కట్టి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర హోంమంత్రి చిదంబరం, సీఎం కిరణ్‌కుమార్‌డ్డి, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, కేంద్ర బలగాలు, పోలీసులు ఆయుధాలు చేపట్టి బంధించిన దృశ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం తెలంగాణవాదులు తల్లిని చెరనుంచి విడిపించి, వారిని చితకబాదినట్టు ప్రదర్శించారు. ఈ ప్రదర్శన ఇచ్చిన కళాకారులు వేదిక దిగగానే పోలీసులు కళాకారుల చేతుల్లో ఉన్న బొమ్మ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ న్యాయవాదుల జేఏసీ కలుగజేసుకొని అవి బొమ్మ తుపాకులేనని వివరించడంతో పోలీసులు వాటిని తిరిగి ఇచ్చారు. కాగా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భారీగా బలగాలను, పోలీసులు దించింది. వీరికి తోడు ఇంటలిజెన్స్ వర్గాలు కళాకారుల మధ్య సంచరించాయి. ప్రదర్శన మొత్తాన్ని వీడియో తీశారు.

సమ్మెతో పాలన స్తంభించాలి: కోదండరాం, జేఏసీ చైర్మన్
తెలంగాణ వచ్చేదాక సకల జనుల సమ్మె చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. రాజీనామాల ఆమోదం విషయంలో స్పీకర్ వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. తెలంగాణ ఉద్యమాన్ని కవులు, కళాకారులు మరింత బలోపేతం చేయాలని కోరారు. ఆగస్టు 1 నుంచి చేపట్టే సకల జనుల సమ్మెలో అందరూ పాల్గొనాలని సూచించారు. సమ్మెతో రాష్ట్ర పరిపాలన స్తంభిస్తేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందన్నారు.

సుందరయ్య పార్కులో ‘తెలంగాణ కోసం డప్పు దరువు, ఆటా- పాట’ కార్యక్షికమంలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. తెలంగాణ కోసం సమ్మెకు దిగుతున్నామని 15 రోజుల క్రితమే ఉద్యోగులు నోటీసిస్తే తెలంగాణ అంశం నా చేతుల్లో లేదని, ఢిల్లీ చేతుల్లో ఉందన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, ఇప్పుడు సమ్మెను అణిచివేసేందుకు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న నాలుగన్నర కోట్ల ప్రజలను బంధించేందుకు జైళ్లు సరిపోవన్నారు.

తెలంగాణ ఉద్యమం పెద్ద కళారూపం: కె. శ్రీనివాస్
తెలంగాణ ఉద్యమంలో పాటే కీలకమని, ఈ ఉద్యమమే పెద్ద కళారూపమని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ అన్నారు. రాజకీయ నాయకుల కంటే ఉద్యమంలో కళాకారులే ముందున్నారని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమం, జనజీవనంలో పాట తెలంగాణ అస్తిత్వానికి పాట కొనసాగింపుగా మారిందన్నారు.

ఆంధ్రోన్నే.. తెలంగాణనే కోరుకుంటున్నా: నారాయణమూర్తి
తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన అడ్డంకిగా మారిందని, టీడీపీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని వీడి తెలంగాణకు మద్దతు ప్రకటించాలని నటుడు ఆర్. నారాయణమూర్తి కోరారు. తెలంగాణకు అనుకూలంగా సీపీఎం వ్యవహరించాలని కోరారు. నేనూ ఆంధ్రోన్నే అయినా తెలంగాణ ఏర్పాటు కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ‘‘ నేనూ ఆంధ్రోన్నే.. అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని కోరుకుంటున్నా.. మనిషన్న వాడు తెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని కోరుకుంటారు.

నేనూ.. మనిషినే. ’’ అని అన్నారు. సూర్యోదయం ఎంత సత్యమో.. తెలంగాణ ఏర్పాటు కావడం కూడా అంతే సత్యమని కళాకారుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. అనంతరం సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్షికసీ నాయకులు వేములపల్లి వెంకవూటామయ్య, ఆరుణోదయ రామారావు, సంధ్య, నాగన్న, సూర్యం, గోవర్ధన్ ప్రసంగించారు. సభ ప్రారంభానికి ముందు ప్రొఫెసర్ కోదండరామ్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, నటుడు ఆర్. నారాయణమూర్తి, సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్షికసీ నాయకులు వేములపల్లి వెంకవూటామయ్య, ఆరుణోదయ రామారావు, సంధ్య, నాగన్న, సూర్యం డప్పులు మెడలో వేసుకొని మోగించి సభికులను ఉత్సాహపరిచారు.

telangana vachethaka poru apoddu

గుత్ఫలే పట్టాలె ఎన్నీయల్లో
గుంజికొట్టాలింక ఎన్నీయల్లో
సమైక్యమంటోన్ని ఎన్నీయల్లో... సాగనంపాలింక ఎన్నీయల్లో
సీమాంధ్ర దొంగల్ని ఎన్నీయల్లో తరిమి ఎల్లాగొట్టే రోజొచ్చెనల్లో ॥ గుత్ఫలే॥
పొత్తు గలిపిన కాడ ఎన్నీయల్లో పొల్తి గలుగాలేదు ఎన్నీయల్లో
పోలు దిరిగిన కాడ ఎన్నీయల్లో పొలికేకా బుట్టింది ఎన్నీయల్లో
బందిపోటాంవూధోల్లు ఎన్నీయల్లో మనల బంధిజేసేనెన్నియల్లో
గయ్యి గయ్యిన లేసి ఎన్నీయల్లో గడప దాటొచ్చిండ్రు ఎన్నీయల్లో ॥ గుత్ఫలే॥
నీల్లు నిధులు అన్నీ ఎన్నీయల్లో ఆంధ్రకెల్లిపాయె నెన్నీయల్లో
వాటాల కొట్లాట ఎన్నీయల్లో తూటాలు పేలినా తీరలేదల్లో
న్యాయానికై నేను నడిచొస్తెనల్లో ఎన్నీయల్లో నక్సలైటంటారు ఏంజేదునల్లో
నాభాష నీభాష ఒక్క నా బతుకు నాభాధ వేరేనల్లో ॥ గుత్ఫలే॥
కయ్యాల కాపురమెన్నీయల్లో కలిసున్నదేడరా ఎన్నీయల్లో
ఆంధ్రవూపదేశంన ఎన్నీయల్లో అన్ని ఆంధ్రోళ్లపాలె ఎన్నీయల్లో
ఇన్నాళ్ళ నా బతుకు ఎన్నీయల్లో కన్నీటి పాలాయె ఎన్నీయల్లో
పాలించె రాజులు వాళ్ళాయెనయ్యో పంచాదిలో దిక్కు నా కెవ్వడయ్యో ॥
వాడెవ్వడయ్యా వీడెవ్వడయ్యా వలసాంధ్ర పాలకుడీడెందుకయ్యా
వొద్దు వొద్దని నాడు నెత్తిగొట్టుకున్నా గద్దలోలె వచ్చి వాలేనయ్యా
వొచ్చింది మొదలూ ఓ తిక్కలయ్య ఒక్కటొక్కటి వాల్లు వొడిపించెనయ్యా
తెలంగాణ తెర్లు తెర్లు జేసినోడు తేట తెలుగు మాటలల్లేనయ్యా
ప్రాంతానికో తీరు పాలించుకుంట ప్రజాస్వామ్యమంటూ బొంకేనయ్యా ॥ గుత్పలే॥
అమరులా త్యాగాలు ఎన్నీయల్లో ఆత్మబలిదానాలు ఎన్నీయల్లో
దీక్షలు బందులు ఎన్నీయల్లో దిక్కులన్నీ కదిలె ఎన్నీయల్లో
డిసెంబరు తొమ్మదెన్నీయల్లో తెలంగాణ తొలిపొద్దు వెలిగేనల్లో
ఓర్వలేనాంవూధోల్లు ఎన్నీయల్లో కుట్రపన్ని పప్పుగాసేనల్లో ॥ గుత్ఫలే॥
తెలంగాణ జైయ్యంటు సీమాంధ్ర దొరలు సంతకాలు గూడ జేసేనల్లో
తెలంగాణ పేరుతో ఎన్నీయల్లో ఓట్లుదండుకుండ్రూ ఎన్నీయల్లో
గెలిసి గద్దెనెక్కి ఎన్నీయల్లో తెలిసి మోసం జేసే ఎన్నీయల్లో
తెలంగాణ ప్రకటన ఎన్నీయల్లో వచ్చినంతనె సిచ్చులేపెనల్లో ॥ గుత్ఫలే॥
విప్లవాలు దెస్తె ఎన్నీయల్లో విద్రోహులన్నారు ఎన్నీయల్లో
ఉద్యమాలు జేస్తే ఎన్నీయల్లో ఉత్తదేనన్నారు ఎన్నీయల్లో
అరవయేండ్ల గోసా ఎన్నీయల్లో అణచేయ జూసిండ్రు ఎన్నీయల్లో
పొలిమెరలు దాటించ ఎన్నీయల్లో పొర్లిచ్చి కొట్టాలె ఎన్నీయల్లో ॥ గుత్ఫలే॥
వాడెవ్వడయ్యా వీడెవ్వడయ్యా వలసాంధ్ర పాలకుడీ డెందుకయ్యా
ఉస్మానియా కాకతీయ క్యాంపస్‌లో ఉచ్చుబెట్టి ముండ్లకంచె గట్టేనయ్యా
తెలంగాణ పదిజిల్లాల లోన పోలీసు బలగాల క్యాంపాయె నయ్యో
నాటి రజాకారు పాలననే మించే ప్రజాస్వామ్యమేడ బతికున్నదయ్యో
విద్యార్థి ఉద్యోగి మేధావి ఎవరైనా విద్రోహులన్నట్టు జూస్తున్నరయ్యో ॥ గుత్ఫలే॥
భారత చరితను ఎన్నీయల్లో బంగపరిచేటోల్లు ఎన్నీయల్లో
చట్టసభల నిండ ఎన్నీయల్లో బద్మాశులే ఉండ్రు ఎన్నీయల్లో
పార్లమెంటు మాట ఎన్నీయల్లో పక్కకే పెట్టిండ్రు ఎన్నీయల్లో
ఆడితప్పిన మాట ఎన్నియల్లో ఆగ్గిబెట్టినాది ఎన్నీయల్లో ॥ గుత్ఫలే॥
పద ముగ్గురాల్లుంటె ఎన్నీయల్లో పదిమంది మేమాయెనెన్నీయల్లో
ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళెక్కువల్లో ఏలెక్క జూసిన మేంతక్కువల్లో
పెండ్లి కొడుకులేమో వాళ్ళాయెనల్లో పెట్టి పోతలు మాకు తప్పలేదల్లో ॥ గుత్ఫలే॥

raginamalapi 30th na nirnayam:tdp forum

రాజీనామాలపై నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 30న తాము సమావేశం కానున్నామని టీడీపీ టీ ఫోరం వెల్లడించింది. ఆగస్ట్ 1 నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నందున తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ అదే రోజున ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేయనున్నట్లు ప్రకటించింది. మంగళవారం బంజరాహిల్స్‌లోని తాండూరు ఎమ్మెల్యే పట్నం మహేందర్‌డ్డి ఇంట్లో ఫోరం నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, కడియంశ్రీహరి, దేవేందర్‌గౌడ్, ఎమ్మెల్యేలు రావుల చంద్రశేఖర్‌డ్డి, గంగుల కమలాకర్, గంప గోవర్థన్, విజయ రమణారావు, దయాకర్‌డ్డి, ఉమా మాధవడ్డి, సీతక్క సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం మీడియాతో ఎర్రబెల్లి మాట్లాడారు. పరిస్థితులను పరిశీలించి రాజీనామాలపై నిర్ణయాలు తీసుకోవడానికి తిరిగి 30న సమావేశమౌతున్నామని తెలిపారు.

తెలంగాణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి చేయాలని కాంగ్రెస్ నేతలకు ఆయన సూచించారు. ఢిల్లీలో చర్చలకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను కేంద్రం మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. మోసపోయి తిరిగి రావద్దని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. ఇక్కడ స్పీకర్, సీఎం కూడా మోసం చేస్తున్నారని ఎర్రబెల్లి విమర్శించారు. ఆయన మోసాలకు బలి కాకూడదని, ముందుండి పోరాడాలని కాంగ్రెస్ నేతలను కోరారు. టీ కాంగ్రెస్ నేతలు ఒంటరి వాళ్లు కాదని అన్నారు. అందరం కలిసి ఉద్యమిద్దామని చెప్పారు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావాలని ఎర్రబెల్లి కోరారు.

తాము స్పీకర్ రాగానే రాజీనామాలు చేస్తామని ఆయన ప్రకటించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సెక్రటరీలు ఫోన్‌లో కూడా అందుబాటులో లేరని అన్నారు. తాము న్యాయ సలహా తీసుకుంటున్నామని తెలిపారు. తాము సంక్షోభం కోసమే రాజీనామాలు చేశామని అన్నారు. తాము రాజీనామాలు చేస్తే అవి తిరస్కరణకు గురి కాకూడదని అన్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్లి రాజీనామాలు ఆమోదింపజేసుకుంటామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

కేశవ్ చీడపురుగు
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యాపుల కేశవ్ తెలంగాణను అడ్డుకునే వ్యక్తి అని ఎర్రబెల్లి అన్నారు. ఇలాంటి వాళ్లు తెలంగాణకు చీడపురుగులని ఘాటుగా స్పందించారు. ఆయన రెచ్చగొట్టి సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ‘‘ఇలా చేస్తే తెలంగాణ ప్రజలకు శత్రువుగా మిగులుతావు. అలా మిగిలిపోద్దు..’’ అని ఆయన హితవు పలికారు. ‘‘రాజీనామాలతో తెలంగాణ రాదని అంటున్నావు. ఆప్పుడు సమైక్యాంధ్ర కోసం ఎందుకు రాజీనామాలు చేశావు?’’ అని కేశవ్‌ను ప్రశ్నించారు. ‘‘ఉద్యమాలు ఎలా చేయాలో మాకు నేర్పిస్తావా? ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఖబడ్దార్’’ అని కేశవ్‌ను హెచ్చరించారు.

‘‘మీ నిర్ణయాలలో తలదూరుస్తున్నామా? ప్రజల మనోభావాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉద్యమాలు చేస్తున్నా. మీరెందుకు కల్పించుకుంటారు? మీకేం అవసరమని అడిగారు? అని నిలదీశారు. 30న సమావేశమై పరిస్థితులను బట్టి రాజీనామాలపై మాట్లాడతామని మరోసారి అన్నారు. తమ రాజీనామాలు రాజ్యాంగ సంక్షోభానికి దారి తీయాలని అన్నారు. అందరూ క్యూ కట్టి రాజీనామాలు చేయాలని కోరారు. సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలకు సిద్ధమని అన్నారు. దయచేసి తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని కాంగ్రెస్ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ కుట్రలను తిప్పి కొడదామన్నారు. అందరం కలిసి ఒకే వేదికపైకి రావాలని కోరారు.

raginama pivenukaduthunna jaipal reddy

భయమో, భక్తో, పారీ ్ట అధిష్టానం పట్ల ఉన్న అనురాగమో కాని తెలంగాణపై బహిరంగంగా మాట్లాడేందుకు కేంద్ర మంత్రి జైపాల్‌డ్డి ఎంతమాత్రం ముందుకు రారు. నిజానికి ఆయన కేంద్రంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కేబినెట్ మంత్రి. సీనియర్ నేత. పార్టీ అధిష్ఠానంతో చాలా దగ్గరి సంబంధాలు కలిగి ఉన్న నాయకుడు. తెలంగాణ గడ్డమీద పుట్టి తెలంగాణ గురించి గట్టిగా మాట్లాడేందుకు జంకుతుంటారు. ఇందుకు ప్రతిసారి ఆయన భారత ప్రభుత్వంలో బాధ్యత గల హోదాను చూపించి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్ విషయంలో బహిరంగంగా మాట్లాడేందుకు ససేమిరా అంటారు.

మంత్రి పదవిలో ఉండి తాను ఒక ప్రాంతం కోసం మాట్లాడటం సమంజసం కాదంటుంటారు. తనపై తెలంగాణవాదుల నుంచి విమర్శలు వచ్చినప్పుడల్లా పదవికి రాజీనామా చేస్తే అధిష్టానం వద్ద, కేంద్ర సర్కార్‌లో తెలంగాణ గురించి మాట్లాడేవారు ఎవరూ ఉండరు, మంత్రిగా ఉంటూనే అంతర్గతంగా తెలంగాణ కోసం పోరాడుతాను, మీరు బహిర్గతంగా ఉద్యమించండి అని సలహాలు ఇస్తుంటారు.
గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడిగా పేరున్న జైపాల్‌డ్డికి సరికొత్త మంత్రికి ఉన్న సాహసం కూడా లేకపోవడం దురదృష్టకరమని చెప్పుకోవచ్చు. నిన్నగాక మొన్న కేంద్ర కేబినెట్‌లో సహచర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఆ హోదాతో సంబంధం లేకుండా తెలంగాణకు వ్యతిరేకంగా బహిరంగంగానే మాట్లాడారు.

అభివృద్ధిలో వెనుకబడిపోయారనే డిమాండ్‌తో తెలంగాణ అడగడం సమంజసం కాదని అన్నారు. ఇంతకంటే వెనుకబడ్డ గిరిజన ప్రాంతాలు కలిగిన ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయని, వాటితో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని రాజకీయ నేతలు ఇంతవరకు డిమాండ్ చేయలేదంటూ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ పేర్కొనడాన్ని చూసైనా జైపాల్‌కు తెలంగాణ గుర్తుకు రాలేదా అని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. తెలంగాణ గడ్డమీద పుట్టిన బిడ్డగా తెలంగాణ గురించి మాట్లాడేందుకు మీకు అంత భయమెందుకు, మీరు గట్టిగా మాట్లాడితే కేంద్రంలో కదలిక వస్తుందని వారంటున్నారు.

సీనియర్ మంత్రిగా, అధిష్ఠానం వద్ద పలుకుబడి కలిగిన నేతగా, ప్రభావం చూపించే స్థాయిలో ఉన్నప్పటికీ తెలంగాణ కోసం జైపాల్ బహిరంగంగా ఏనాడు కూడా నోరు విప్పి గట్టిగా మాట్లాడకపోగా బాధ్యత గల హోదాలో ఉన్నానంటూ తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణకు ద్రోహం చేయడమేనని టీ వాదులు నిప్పులు చెరుగుతున్నారు. నిన్న కేబినెట్‌లో చేరిన సీమాంధ్ర మంత్రి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే కనీసం ఆ స్థాయిలో కూడా స్పందించకపోవడం దురదృష్టకరమని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కిషోర్ చంద్రదేవ్ మాట అలా ఉంటే.. సీమాంవూధకు చెందిన కేంద్ర సహాయ మంత్రులు దగ్గుబాటి పురందేశ్వరి, పనబాక లక్ష్మి, మొన్నటివరకు మంత్రిగా పనిచేసిన సాయివూపతాప్ తదితరులు సమైక్యవాదం గళాన్ని ఢిల్లీలో గట్టిగా వినిపిస్తున్న నేతల బృందాల సమావేశాలకు వెళ్ళి సమైక్యవాదానికి మద్దతు పలికారు.

మరి వారు కేంద్ర మంత్రులు కాదా? జైపాల్‌డ్డి ఒక్కరికే ఆ హద్దులు ఉన్నాయా? అని తెలంగాణ ప్రాంత నేతలు కొందరు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జైపాల్ మంత్రి పదవి కారణంగా తెలంగాణ విషయంలో వెనకడుగు వేయకుండా మిగతా మంత్రుల తరహాలోనే తెలంగాణ గళాన్ని గట్టిగా వినిపించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

అది ఆత్మవంచనే అవుతుంది:
కేంద్ర మంత్రి అయిన జైపాల్‌డ్డి సుదీర్ఘ అనుభవమున్న రాజకీయ నాయకుడిగా తన అభివూపాయాన్ని వ్యక్తపర్చాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో మంత్రి అయినంత మాత్రాన తన అభివూపాయాలు చెప్పకపోవడం ఆత్మవంచనే. తెలంగాణకు సానుకూలంగా లేదా వ్యతిరేకంగా ఏదో ఒక అభివూపాయాన్ని వెల్లడించలేని దుస్థితిలో ఈ గొప్ప నాయకుడు ఉండటం దురదృష్టకరం.

- పీసీసీ అధికార ప్రతినిధి మృత్యుంజయం



జైపాల్ ఒత్తిడి తెస్తే ఆ లోటు ఉండదు:
జైపాల్‌డ్డి మౌనంతో తెలంగాణ ప్రజలకు మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే భావం కలుగుతున్నది. ఒక సీనియర్ నేత, మంత్రిగా తెలంగాణపై బహిరంగంగా మాట్లాడటం ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తే తెలంగాణ విషయంలో లోటు కనిపించదు. పురందేశ్వరి, పనబాక లక్ష్మి సమైక్యవాదంపై తమ అభివూపాయాలను బాహాటంగానే వ్యక్తం చేస్తున్నప్పుడు, జైపాల్‌డ్డి తెలంగాణపై మాట్లాడటానికి అభ్యంతరమెందుకు? యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ వద్దకు వెళ్ళి జైపాల్ గట్టిగా తెలంగాణ కోసం మాట్లాడితే ఫలితం ఉంటుంది. అంతర్గతంగా ఏది మాట్లాడినా ప్రజలు గుర్తించే పరిస్థితి లేదు. బహిరంగంగా ప్రజల మధ్యకు రావాలి.

- జి.నిరంజన్ (తెలంగాణ కాంగ్రెస్ సారధ్య బృందం)



కావాల్సింది తెలంగాణ.. జైపాల్‌రెడ్డి రాజీనామా
తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఏకైక కేబినేట్ మంత్రిగా ఉన్న జైపాల్‌డ్డి తక్షణం పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్రను పోషించాల్సిందే. జైపాల్‌డ్డి తనకు తానుగా ఆంక్షలు విధించుకోవడంలో అర్థం లేదు. కేంద్ర మంత్రి వైరిచర్ల కిషోర్‌చంవూదదేవ్ మన్యం సీమను అడుగుతున్నారు. మరో కేంద్ర మంత్రి జైపాల్‌డ్డి మాత్రం తెలంగాణపై మాట మాట్లాడటం లేదు. కేంద్రమంవూతిగా తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న జైపాల్‌డ్డి తెలంగాణపై స్పష్టమైన అవగాహనకు వచ్చి ఉద్యమంలో కలిసి రావాలి.

- ప్రొఫెసర్ కోదండరాం



చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి:
తెలంగాణపై కేంద్రమంత్రి జైపాల్‌డ్డి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 141 మంది ప్రజావూపతినిధులు పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేశారు. ఇటీవలే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషోర్‌చంవూదదేవ్ స్పష్టంగా మన్యసీమ కోరుతుండగా జైపాల్‌డ్డికి ఎందుకు పట్టడం లేదు? తెలంగాణ కోసం జైపాల్‌డ్డి రాజీనామా చేసి కేంద్రానికి బుద్ధి చెప్పాలి.

- టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్



బ్రహ్మానందడ్డి శిష్యుడి కథే:
కేంద్ర మంత్రి జైపాల్‌డ్డి తెలంగాణలో పుట్టి పెరిగి 17 ఏళ్లు ఎమ్మెల్యేగా, 20 ఏళ్లు ఎంపీగా ఉన్నాడు. కనీసం చివరి సమయంలో పుట్టిన గడ్డపై ప్రజల మనోభావాల కోరిక మేరకైనా ఆరాడపడటంలేదు. ఆయనకు తెలంగాణపై ప్రేమలేదు.1969లో సమైక్యవాది బ్రహ్మానందడ్డిశిష్యుడు. ఇప్పటికీ అదే ఒరవడి కొనసాగిస్తున్నాడు. ఆయన మొదట సమైక్యవాది.. ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకి. తరువాత అవకాశవాది. ఇప్పుడు సోనియా తరపున ఉన్నాడు. డిసెంబర్ 9 ప్రకటన ఒకసారి తాను చేయబట్టే వచ్చిందంటాడు. మరోసారి తనకు సంబంధం లేదంటాడు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన గిరిజన నేత కిషోర్ చంద్రదేవ్ కేంద్ర కేబినెట్‌లో ఉన్నా.. తన ప్రజల మనోభావాల మేరకు మాట్లాడుతున్నాడు. ఆ మేరకు కూడా జైపాల్‌డ్డి మాట్లాడటం లేదు. ఆయనకు తెలంగాణ రావాలని లేదు.

- టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్

congress samaveshala pine guri on telangana issue

తెలంగాణ అంశంపై పార్లమెంట్ సమావేశాలను వారంపాటు స్తంభింపచేయాలన్న ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నట్టు తెలిసింది. పార్లమెంటు సమావేశాలను స్తంభించటం ద్వారా తెలంగాణ అంశాన్ని కేంద్రం, హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచనతో వారున్నారు.
ఎమ్మెల్యేల రాజీనామాలను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించడంతో, ఎంపీల రాజీనామాలను కూడా లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించవచ్చని భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అనుకుంటున్నట్టుగా జూలై నెలాఖరులోగా తెలంగాణపై అధిష్ఠానం నుంచి సానుకూల ప్రకటన ఏదీ వచ్చే సూచనలు కనిపించడం లేదు. కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియను చేపట్టడం, వంద రోజుల్లో అధిష్ఠానం ఒక నిర్ణయాన్ని ప్రకటించనుందని చెప్పిన నేపథ్యంలో తెలంగాణపై అధిష్ఠానం ఇప్పట్లో ప్రకటించే అవకాశం లేదన్న అభిప్రాయానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వచ్చారు.
ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ తిరస్కరించడంతో మళ్ళీ రాజీనామాలు చేయాలన్న ఒత్తిడి వస్తోంది. పార్లమెంటు సభ్యుల రాజీనామాలను కూడా తిరస్కరించినట్టు ప్రకటించిన పక్షంలో రాజీనామాలు చేయాలంటూ తమపై కూడా మళ్ళీ ఒత్తిడి వస్తుందని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు అభిప్రాయపడుతున్నారు. నేరుగా స్పీకర్లకు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు ఇవ్వడం పట్ల అధిష్ఠానం ఆగ్రహంతో ఉంది. ఈ పరిస్థితిలో మళ్ళీ రాజీనామాలు స్పీకర్‌కు ఇచ్చినట్లయితే అధిష్ఠానం మరింత ఆగ్రహం చెందవచ్చని వారు అనుకుంటున్నారు.
తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. ఆగస్టు ఒకటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బహుశ ఈలోగానే లోక్‌సభ సభ్యుల రాజీనామాలపై స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చని అనుకుంటున్నారు. తమ రాజీనామాలను తిరస్కరించినట్టు ప్రకటించిన పక్షంలో, రాజీనామాలకై మళ్లీ ఒత్తిడి రాకముందే పార్లమెంటు సమావేశాలను స్తంభింప చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అనుకుంటున్నారు. ‘ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరించినట్టే పార్లమెంటు సభ్యుల రాజీనామాలనూ తిరస్కరించవచ్చు. అప్పుడు మేం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాం. తెలంగాణ అంశం మీద వారంపాటు పార్లమెంటు సమావేశాలు జరగకుండా అడ్డుకుంటాం. వారంపాటు పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడం చిన్న విషయం కాదు’ అని ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారధ్య సంఘ నాయకుడు ఒకరు ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు.
రాజీనామాలపై కాంగ్రెస్‌లో విముఖత?
మళ్ళీ రాజీనామాలు చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అంత సుముఖత వ్యక్తం కావడం లేదు. ఇంతకుముందు సామూహిక రాజీనామాలు చేసిన వారు సైతం ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు. మంత్రులు కూడా మళ్ళీ రాజీనామాలు చేసేందుకు ఇంత ఇష్టపడటం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మనోభావాలను తెలుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారధ్య సంఘం నేతలు కూడా వ్యూహాత్మకంగా మళ్ళీ రాజీనామాలు చేసే అంశంలో నిర్ణయాన్ని వాయిదా వేశారు. పార్లమెంటు సభ్యుల, ఎమ్మెల్సీల రాజీనామాల వ్యవహారం కూడా తేలిన తర్వాత మళ్ళీ రాజీనామాల అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని సారధ్య సంఘం నేతలు అభిప్రాయ పడ్డారు.
స్పీకర్‌కు మళ్లీ రాజీనామాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు విముఖంగా ఉండటంతో రాజీనామాలు అవసరమైన పక్షంలో ఈసారి హైకమాండ్‌కు ఇవ్వాలని అనుకుంటున్నారు. స్పీకర్‌కు ఇవ్వడానికి ఇష్టపడని ఎమ్మెల్యేలు అధిష్ఠానవర్గానికి ఇద్దామంటే అంగీకరించవచ్చని భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి యాభై ఐదుమంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో ఎనిమిది మంది మినహా పనె్నండు మంది మంత్రులతో సహా 47మంది తమ శాసన సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ రాజీనామాలు అన్నపక్షంలో వారిలో సగం మంది కూడా ముందుకు వచ్చే అవకాశం లేదని అంటున్నారు.

telangana teledi kadu

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఎంతమాత్రం సులభం కాదని కేంద్ర హోంమంత్రి పి చిదంబరం చెప్పకనే చెప్పారు. రాష్ట్ర ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తేనే సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు నిలువునా చీలిపోయాయని మంగళవారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పార్టీలు మొదట ఏకాభిప్రాయానికి రావాలని, అప్పుడే పరిష్కారాన్ని కనుగొనవచ్చని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రజలు, పార్టీలపై బలవంతంగా రుద్దటం జరగదని చిదంబరం ప్రకటించారు. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ తెలంగాణ సమస్యపై ఇరుపక్షాలతో విడివిడిగా చర్చలు జరుపుతున్న సమయంలో చిదంబరం ఈ ప్రకటన చేయటం గమనార్హం. చిదంబరం ప్రకటన మూలంగా ఇప్పటికే తెలంగాణలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. చిదంబరం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులు బుధవారం ఆజాద్‌తో రెండోదఫా చర్చలు జరుపుతారా? అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణా సమస్యకు ఒక పరిష్కారం కనుగొనేందుకు రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి తోడ్పడాలని చిదంబరం సూచించారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలపై తమ నిర్ణయాన్ని బలవంతంగా రుద్దటం జరగదన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ అంశంపై రెండుగా చీలిపోయాయి. సిపిఎం వాదన గురించి అందరికీ తెలిసిందేనని చిదంబరం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, బిజెపి పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉంటే, ఎంఐఎం తమ అభిప్రాయన్ని స్పష్టంగా వెల్లడించటం లేదని చిదంబరం చెప్పారు. కాంగ్రెస్‌కు సంబంధించినంత వరకూ తెలంగాణ అంశంపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను సమన్వయపర్చి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. పార్టీలో ఏకాభిప్రాయం సాధించటం ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునేందుకు గులాం నబీ ఆజాద్ ప్రయత్నిస్తున్నట్టు చిదంబరం వెల్లడించారు. కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టే తెలుగుదేశం తదితర పార్టీలు కూడా తెలంగాణపై తమ పార్టీల్లో ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేయాలని హోంమంత్రి హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తమ ప్రజాప్రతినిధులందరినీ సమైక్యపర్చి తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు కృషి చేయాలన్నారు. మీరు తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుగొనలేకపోయారని ఆరోపించటం ఎంతో సులభం, అయితే ఆరోపణలు చేసే వారుకూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం సూచించలేకపోతున్నారని చిదంబరం దుయ్యబట్టారు. తమను విమర్శించే వారి వద్ద కూడా తెలంగాణ సమస్యకు పరిష్కారం లేదుకదా? అని అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై మీరు మాట నిలబెట్టుకోలేదనే విమర్శ వస్తోందని అడుగగా, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని తాను ప్రభుత్వం తరపున 2009 డిసెంబర్ 9న ప్రకటన చేశానని చిదంబరం వివరించారు. డిసెంబర్ 9 ప్రకటన తరువాత సీమాంధ్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో కేంద్రం పరిస్థితిని సమీక్షించి తమ నిర్ణయాన్ని మార్చుకుని డిసెంబర్ 23న రెండో ప్రకటన చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపునే తాను డిసెంబర్ 9 ప్రకటన చేశానన్నారు. కేంద్ర హోంమంత్రి ఒక ముఖ్యమైన అంశంపై తనంతతాను ఒక ప్రకటన చేసి, తరువాత ఉపసంహరించుకుంటారని ఎవరైనా భావిస్తే అది వారి అమాయకత్వమే అవుతుందని చిదంబరం స్పష్టం చేశారు.

vudyagula vudhyama siren

తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఆగస్టు 1నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, అధికారుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆందోళనకు శ్రీకారం చుట్టనుంది. రెండువారాలపాటు వివిధ దశల్లో ఆందోళనను ఉధృతం చేసి, చివరగా ఆగస్టు 17నుంచి సార్వత్రిక సకల జన సమ్మెకు దిగాలని తెలంగాణ ఉద్యోగ ఐకాస నిర్ణయించింది. హైదరాబాద్ టిఎన్‌జివో భవన్‌లో మంగళవారం తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస చైర్మన్ కె స్వామిగౌడ్ అధ్యక్షతన ఉపాధ్యాయ, సిబ్బంది, కార్మిక, అధికారుల సంఘాల స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. వివిధ ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసు, ప్రభుత్వ స్పందన, తాజా రాజకీయ పరిస్థితులపై సమావేశంలో నాలుగు గంటల పాటు చర్చించారు. అనంతరం భవిష్యత్ ఆందోళన కార్యాచరణ రూపొందించారు. తెలంగాణ ఉద్యోగ ఐకాస నేతలు శ్రీనివాస్‌గౌడ్, దేవిప్రసాద్, విఠల్, కత్తి వెంకటస్వామి, మణిపాల్‌రెడ్డితో కలిసి స్వామిగౌడ్ తమ ఆందోళన కార్యాచరణను మీడియాకు వెల్లడించారు. 2009 డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి ఇచ్చిన ప్రకటనకు కట్టుబడి కేంద్రం వెంటనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ చేపట్టాలన్నారు. అలాగే గతంలో తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో ఆగస్టు 1నుంచి ఆందోళనకు దిగుతున్నట్టు చెప్పారు. ఆగస్టు 1న హైదరాబాద్‌లో అన్ని రాజకీయ పార్టీలతో తెలంగాణ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం, 2, 3 తేదీల్లో జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. 2నుంచి 6వరకు బస్సుయాత్రలు, 4నుంచి 6వరకు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద, జిల్లా, మండల కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేపడతారు. 8నుంచి 11వరకు వర్క్‌డౌన్ చేస్తామని పేర్కొన్నారు. అప్పటికీ తెలంగాణ అంశంపై కేంద్రం స్పందించి సానుకూల నిర్ణయం ప్రకటించకుంటే 17నుంచి సార్వత్రిక సకల జన సమ్మెకు దిగాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నిర్ణయించినట్టు స్వామిగౌడ్ వెల్లడించారు. ఈలోగా తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం ప్రకటన చేస్తే మెరపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. తమ ఆందోళనపై ప్రభుత్వం కక్షసాధింపుగా ఎస్మా ప్రయోగించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. సకల జన సమ్మెకు ఏడు లక్షల మంది ఉద్యోగులు సంఘీభావం ప్రకటించగా, 4.37లక్షల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొంటారన్నారు. తాము సమ్మె నోటీసు ఇచ్చి 14రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని, అలాంటప్పుడు చర్చలకు పిలిస్తే వెళ్లాల్సిన అవసరం లేదని వారు తెలిపారు.
ఆమోదించే వరకు రాజీనామాలు
తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన ప్రజాప్రతినిధుల రాజీనామాలను స్పీకర్ ఏక్షపక్షంగా తిరస్కరించడం పట్ల సమావేశం నిరసన తెలియజేసిందని స్వామిగౌడ్ తెలిపారు. ప్రజాప్రతినిధుల హక్కును కాలరాయటం ప్రజాస్వామ్యంలో తగదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కట్టుబడి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులంతా మళ్లీ మళ్లీ రాజీనామాలు చేయాల్సిందేనని ఆయన విజ్ఞప్తి చేశారు.
నేడు ఢిల్లీకి టిజెఎసి
తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస చేపట్టే ఆందోళనకు మద్దతు కోరుతూ, అలాగే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేసేందుకు ఎనిమిదిమంది ప్రతినిధుల బృందం బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు టిజెఎసి అధికార ప్రతినిధి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బుధవారం ఉదయం పది గంటలకు శరద్‌యాదవ్‌తో, 11 గంటలకు ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, మధ్యాహ్నం సిపిఐ ప్రధాన కార్యదర్శి బర్దన్‌తో భేటీకి అపాయింట్‌మెంట్ లభించిందన్నారు. గురువారం ఉదయం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, మంత్రుల బృందంతో ఢిల్లీలో భేటీ అవుతామన్నారు.

telangana kosam a parti thonaina kalustham:errabelli

ప్రత్యేక తెలంగాణ కోసం ఏ పార్టీతోనైనా కలవడానికి సిద్ధమని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్దమని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సాధిస్తే కాంగ్రెస్ ద్వారా వచ్చిందని చెబుతామని అన్నారు.

తెలంగాణ విషయమై ఇప్పటికే కమిటీలు వచ్చాయి, పోయాయని అన్నారు. ప్రణబ్‌ముఖక్జీ, శ్రీకృష్ణ కమిటీలు పోయాయని, ఇప్పుడు అజాద్ కమిటీ వచ్చిందని ఎర్రబెల్లి ఎద్దెవా చేశారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు రాజీనామాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

telangana evvanani congress thelchesindi:errabelli

తెలంగాణ రాష్ట్రం ఇవ్వనని కాంగ్రెస్ పార్టీ తేల్చేసిందని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు అభిప్రాయపడ్డారు. గత కొన్ని రోజులుగా కేంద్రంలో ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, గులాం నబీ ఆజాద్ తదితరులు చేస్తున్న ప్రకటనలు...మాట్లాడుతున్న మాటలు ఆ పార్టీ అభిప్రాయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 'ఇక రాజీనామాలు, పోరాటాలే శరణ్యం. ఎమ్మెల్యే పదవులకు తెలంగాణలోని టిడిపి ఎమ్మెల్యేలంతా సిద్ధంగా ఉన్నారు. అందులో వెనక్కు పోయే సమస్యే లేదు. ఫ్యాక్స్‌లో రాజీనామాలు పంపడం వంటి డ్రామాలు మేం చేయం.

స్పీకర్ వచ్చిన తర్వాత నేరుగా ఆయన చేతికే ఇస్తాం. దానికి ముందు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలనూ కలుస్తాం...అందరినీ ఒకచోటికి పిలుస్తాం. అందరం కలిసి రాజీనామాలు ఇద్దామని ప్రతిపాదిస్తాం. అందరినీ ముగ్గులోకి తీసుకువస్తాం. తెలంగాణ ఎట్ల రాదో చూస్తాం. మేం చిత్తశుద్దితో ఉన్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వెనక్కు పోవద్దని విజ్ఞప్తి' అని ఆయన అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డితో కలిసి బుధవారం ఆయన ఇక్కడ టిడిఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏకాభిప్రాయం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ కేంద్ర నేతలు ఎన్నికల ముందు ఎప్పుడైనా ఆ మాట అన్నారా అని ఆయన ప్రశ్నించారు. '2004 ఎన్నికలకు ముందు తమను గెలిపిస్తే తెలంగాణ ఇచ్చేస్తామని చెప్పారు.

ఏకాభిప్రాయం మాటే ఆ రోజు రాలేదు. 2009 ఎన్నికల ముందు మళ్ళీ తెలంగాణ ఇస్తామన్నారు. అప్పుడూ ఏకాభిప్రాయం గురించి మాట్లాడలేదు. ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఎక్కడా ఏకాభిప్రాయం ఊసే లేదు. ఇప్పుడు ఆ మాట మాట్లాడటం పచ్చిమోసం. కేంద్రం ఇవ్వదల్చుకొంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటులో బిల్లు పెట్టి ఇవ్వవచ్చు. ఆ పని చేయకుండా మోసం చేస్తున్నారు. ఇతర పార్టీల అభిప్రాయాలు కోరే ముందు కాంగ్రెస్ పార్టీ తన పార్టీలో ఏకాభిప్రాయం సాధించాలి' అని ఆయన డిమాండ్ చేశారు.

టిడిపిలో భిన్నాభిప్రాయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న కేంద్రం గతంలో తమ పార్టీ ఏకాభిప్రాయంతో తెలంగాణ కోసం లేఖ ఇచ్చినప్పుడు ఎందుకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. 'మేం లేఖ ఇచ్చినప్పుడు కిమ్మనలేదు. ఇప్పుడు భిన్నాభిప్రాయాల గురించి మాట్లాడుతున్నారు. కేంద్రం ఇవ్వదల్చుకొంటే మిగిలిన పార్టీల అభిప్రాయాలతో పనేలేదు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో 14 (ఎఫ్) తొలగించాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే తీసేశారా? మేం శాసనమండలి పెట్టవద్దంటే ఆగారా? విద్యార్ధులపై కేసులు ఎత్తివేయాలని కోరితే విన్నారా? మేం ఏం చెబితే కాంగ్రెస్ పార్టీ దానికి పూర్తి విరుద్ధంగా చేస్తుంది' అని ఆయన వ్యాఖ్యానించారు.

రాజీనామాలు చేసే ప్రజా ప్రతినిధులకు తెలంగాణలోని అన్ని పార్టీల ముఖ్య నేతలు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని దయాకరరావు పేర్కొన్నారు. ఈ విషయం తాను అనేకసార్లు చెప్పినా ఇతర పార్టీల నుంచి స్పందన రావడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 'నేను, కెసిఆర్, కోదండరాం, జానారెడ్డి, గద్దర్, విమలక్క...అందరూ కలిసి కూర్చుని హామీ ఇవ్వాలి. రాజీనామాలు చేసినవారిపై ఎవరూ పోటీ పెట్టవద్దని...తెలంగాణ వచ్చేవరకూ ఎవరం పోటీ చేయవద్దని చెప్పాలి. అన్ని పార్టీల నేతలు దగ్గర ఉండి రాజీనామాలు చేయించాలి. అప్పుడే ఐకమత్యం వస్తుంది' అని ఆయన అన్నారు.

తెలంగాణ రావడం కన్నా కూడా ఈ ప్రాంతంలో కాంగ్రెస్, టిడిపి పార్టీలను మూతవేసి తానొక్కడే ఉండాలన్న తహతహ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌లో అధికంగా కనిపిస్తోందని మహేందర్ రెడ్డి విమర్శించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఎన్నికల్లో వారికి మద్దతిస్తానని కెసిఆర్ ఇంతవరకూ తన నోరు తెరిచి అనలేదని, తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం కూడా ఆ మాట అనడం లేదని ఆయన ఆరోపించారు. డిసెంబర్ 9న చేసిన తన ప్రకటన నిలుపుకోవడానికి కాంగ్రెస్‌కు ఇతర పార్టీల లేఖలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.

si ratha parikshalu yadha thadam:cm

ఎస్.ఐ. రాత పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వాయిదా పడతాయని వచ్చిన వార్తలు అవాస్తమని, ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా ఆగస్టు 13, 14 తేదీల్లో జరుగుతాయని అన్నారు. ఎస్టీ, ఎస్సీ సంక్షేమ వసతి గృహాలను మూసివేయమని సీఎం స్పష్టం చేశారు.

బుధవారం గుంటూరు పర్యటనకు వచ్చిన ఆయన మేడు కొండూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ హాస్టళ్ల విలీనాంశంపై మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని అన్నారు. ప్రతి రెండు నెలలకు ఒ కొత్త పథకం అమలులోకి వస్తుందని సీఎం పేర్కొన్నారు. విద్యా, ఉపాధి రంగానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు.

కాగా గుంటూరు జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బుధవారం గుంటూరు జిల్లాలో జరగనున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటారనే అనుమానంతో పిడుగురాళ్ల ఔషదబాధితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. దీంతో పోలీసుల వైఖరిపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జిల్లా పర్యటన నేపథ్యంలో స్థానిక సంస్థలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. వరాల జల్లు కురిపించకపోయినా కనీసం ట్రెజరీ ఆంక్షలు ఎత్తివేస్తే అదే పది వేలన్న భావనలో ఉన్నాయి. ఇప్పటికే జిల్లాపరిషత్తు, మండలపరిషత్తు పాలకవర్గాల పదవీకాలం ముగిసి స్పెషలాఫీసర్ల పరిపాలన రావడం, మరో నెల లోపే పంచాయతీల పదవీకాలం కూడా ముగియనున్న నేపథ్యంలో ఆర్థికపరమైన వెసులుబాటు కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. నేడు జడ్పీలో జరగనున్న సీఎం సమీక్షలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని అధికారవర్గాలు యోచిస్తున్నాయి.

delhi ke cherina telangana ssue

గల్లీలోని తెలంగాణ ఉద్య మం మళ్లీ ఇప్పుడు ఢిల్లీకి చేరుకుంటోంది. ఉద్యమ సెగను ఢిల్లీకి తాకించాలని చెబుతూ వచ్చిన రాజకీయ పార్టీల నాయకులు, టీజేఏసీ నేతలు ఎవరికి వారే హస్తినలో లాబీయింగ్‌ ప్రక్రియ కోసం అర్రులు చాచడం విమర్శలకు తావిస్తోంది. ఉద్యమాన్ని గాలికొదిలిస్తే, లాబీయింగ్‌ ప్రక్రియ ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమేనా? అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చంశనీయంగా మారింది. ఢిల్లీకి చేరుకున్న టీ-కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్‌తో దశల వారీగా చర్చలు జరుపుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై సానుకూల ప్రకటన చేయా లని అధిష్టానంపై వారు ఒత్తిడిని తెస్తున్నారు. కానీ ఎటూ తెమలడం లేదు.

లాబీయింగ్‌ ద్వారా ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషి చేద్దాం అంటూ టీ-కాంగ్రెస్‌ నేతలు ఉద్యమాన్ని అటకెక్కించే ప్రయ త్నాలు ప్రారంభించారు. తెలంగాణ బీజేపీ నాయకులు సైతం అదే దారి పట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షు డు గఢ్కరి, ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌ లను కలుసుకుని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. టీజేఏసీతో కలిసి ఉద్యమించడం కంటే జాతీయ పార్టీ హోదాలో తాము ఢిల్లీతో సంబంధాలను నెరుపుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం లాబీయింగ్‌ చేయడమే సరైందని బీజేపీ నాయకులు భావిస్తు న్నారు. బుధవారం నాడు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యచరణ కమిటీ (టీజే ఏసీ) ప్రతినిధి బృందం ఢిల్లీకి బయల్దేరనుంది. టీజేఏసీ ప్రతినిధులు ఎన్డీఏ భాగ స్వామ్య పార్టీల అగ్రనాయకులను, సీపీఐ జాతీయ నాయకులను కలుసుకుని ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు కూడగట్టే ప్రయత్నాన్ని చేయాలని నిర్ణయించారు.

లాబీయింగ్‌ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధ్యమంటూ తొలి నాళ్లలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టిన విషయం తెలిసిందే. జాతీయస్థాయి పార్టీల అగ్ర నాయకులతో మంతనాలు చేసిన కేసీఆర్‌ ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని అడుగు కూడా ముందుకు కదిలించలేక పోయా రనే విమర్శలను ఎదుర్కొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు చేసిన ఉద్యమాలతో పాటు కేసీఆర్‌ చేసిన అమరణ నిరహారదీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి 2009 డిసెంబర్‌ తొమ్మిదవ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు హోంమంత్రి చిదంబరంచేత ప్రకటన చేయించిన విషయం విధితమే.

డిసెంబర్‌ తొమ్మిది ప్రకటన తరువాత రాష్ట్రం లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంది. లాబీయింగ్‌ ద్వారా గులాబీ దళపతి కేసీఆర్‌ ఏమి సాధించలేక తిరిగి ఉద్యమ బాట పట్టగా, ఉద్యమాన్ని గాలికి వదిలేసి రాజకీయ పార్టీల నాయకులు, జేఏసీ నేతలు లాబీయింగ్‌ కోసం ఢిల్లీ బాట పట్టడం విమర్శలకు తావిస్తోంది. రాజకీయ లాబీయింగ్‌ ద్వారా ప్రత్యేక రాష్ర్ట సాధన అంతా సులు వేమి కాదని తెలంగాణ వాదులు అంటున్నారు. టీ-కాంగ్రెస్‌, బీజేపీ నేతలు రా జకీయ లాబీయింగ్‌కు స్వస్తి చెప్పి ఉద్యమబాట పట్టాలని వారు కోరుతున్నారు.

14f tholaginchina tharvathane si ratha pariksalu nirvahinchali:kcr

రాష్ట్రపతి నిబంధనలోని 14 ఎఫ్ తొలగించిన తర్వాతే ఎస్.ఐ. రాత పరీక్షలు నిర్వహించాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు డిమాండ్ చేశారు. ఎస్ఐ రాత పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూర్ఖంగా మాట్లాడుతున్నారని, అలా అయితే రాష్ట్రంలో జరిగే పరిణామాలకు సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుదని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా బుధవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ తెలంగాణ ప్రజా ప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

కేంద్రం మెడపై కత్తి పెడితేనే ప్రత్యేక తెలంగాణ వస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ నేతల మధ్య ఈరోజు నెలకొన్న ఐక్యతను ఇలాగే నిలుపుకుందామని అన్నారు. రాజీనామాలు చేసిన నేతలు ఎక్కడ పోటీ చేసినా ప్రజలు గెలిపిస్తారని, రాజీనామలు చేయనివారిని ప్రజలు గెంటివేస్తారని అన్నారు. ప్రజాప్రతినిధులు చేసిన రాజీనామాలపై అనుమానం ఉంటే స్పీకర్ పిలిచి మాట్లాడాలి, అలా కాకుండా రాజీనామాలు భావోద్రేకంతో చేశారని, తిరస్కరిస్తూ, ఏక పక్ష నిర్ణయం తీసుకుని లండన్ పర్యటనకు వెళ్ళడం ఎంతవరకు సబబని కేసీఆర్ ప్రశ్నించారు.

రాజీనామాలు చేయడం ఎమ్మెల్యేల హక్కు, వాటిని కదనడం రాజ్యాంగ విరుద్ధమని కేసీఆర్ అన్నారు. రాజీనామాలు ఆమోదించకపోవడం వెనుక కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు.

kenramoi vothidi penchali:kothandaram

తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచాలని రాజకీయ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ నేతలను కోరారు. జెఎసి నేతలు ఈరోజు ఇక్కడికి వచ్చి పలువురు జాతీయ పార్టీ నేతలను కలిశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు మద్దతు కోరారు. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో జెఎసి నేతలు సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ అందరూ కలిసి వత్తిడి పెంచితేనే కేంద్రం కదులుతుందన్నారు. రాజీనామా చేసినవారి వెంట తాము ఉంటాంమని వారికి భరోసా ఇచ్చారు. రాజీనామా చేయనివారి వెంటపడతామని హెచ్చరించారు.

chandrababu comments on telangana issue

తెలంగాణపై మహానాడులో చేసిన తీర్మానానికే కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
చెప్పారు. శ్రీకృష్ణ కమిటీని వేసింది కేంద్రమేనని, దానికి పరిష్కారం కూడా కేంద్రమే చూపాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డితో తనకు వ్యక్తిగత అభిప్రాయబేదాలు లేవన్నారు. మాజీ కేంద్ర మంత్రి ఎ.రాజా చేసిన వ్యాఖ్యల ప్రకారం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలన్నారు

strike from 17th telangana sakalajanulasamme

వచ్చేనెల 17 నుంచి సమ్మెకు దిగాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నిర్ణయించింది. తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన సకల జనుల సమ్మెలో పాలుపంచుకోవాలని తీర్మానించింది. మంగళవారం టీఎన్జీవో భవన్‌లో జేఏసీ చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అనంతరం స్వామిగౌడ్, జేఏసీ కో చైర్మన్లు దేవీ ప్రసాద్, విఠల్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస గౌడ్ తదితరులు విలేకరులతో మాట్లాడారు. సకల జనుల సమ్మెలో ఆగస్టు 17 నుంచి పూర్తి స్థాయిలో పాల్గొనాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అప్పటి వరకు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక నిర్ణయించాన్నారు. వివిధ ప్రజా సంఘాలతో ఆగస్టు 1న హైదరాబాద్‌లో, 2, 3 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి సకల జనుల సమ్మెకు అందరినీ సమాయాత్తం చేస్తామని చెప్పారు. ఆగస్టు 2 నుంచి 6 వరకు తెలంగాణ జిల్లాల్లో ఉద్యమ యాత్ర పేరిట బస్సు యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. బస్సు యాత్రల కోసం 10 బృందాలు ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో బృందం ఒక్కో జిల్లాలో పర్యటిస్తుందన్నారు. ఉపాధ్యాయులు వచ్చేనెల 3న ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్షకు దిగనున్నారని, 4, 5, 6 తేదీల్లో వివిధ విభాగాల ఉద్యోగులు నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. బ్యాంకులు, ఎల్‌ఐసీ ఉద్యోగులతో పాటు స్థానిక జేఏసీలు మండల కేంద్రాల్లోనూ రిలే నిరాహార దీక్షలు చేపడతాయని చెప్పారు. 8, 9, 11 తేదీల్లో 4.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 3.5 లక్షల మంది వివిధ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు పెన్‌డౌన్, వర్క్‌డౌన్, టూల్‌డౌన్ నిర్వహిస్తారని, మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపడతారని వివరించారు. అనంతరం 17 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగం లాంటి బెదిరింపు చర్యలకు దిగితే.. అదే రోజు నుంచి పూర్తిస్థాయి సమ్మె చేస్తామని హెచ్చరించారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ రంగ సంస్థలు, సింగరేణి ఉద్యోగులు కూడా పాల్గొననున్నారని చెప్పారు. సింగరేణిలో సమ్మె జరిగితే రోజూ 1.4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతుందని, విద్యుదుత్పత్తి ప్రధాన సంస్థలతో పాటు సుమారు 4 వేల పరిశ్రమల మీద సమ్మె ప్రభావం ఉంటుందని వివరించారు. ఆగస్టు 1లోగా కాంగ్రెస్ నాయకులు మళ్లీ రాజీనామాలు చేసి ఉద్యమంలో కలిసిరాకపోతే... వారి మీద ఒత్తిడి తెచ్చే దిశగా ఆందోళన ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లడానికి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. సహాయ నిరాకరణ సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. 141 మంది ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేస్తేనే సీరియస్‌గా తీసుకోని సర్కారు... తమ సమ్మె నోటీసును సీరియస్‌గా తీసుకోకపోవడం ఆశ్చర్యమేమీ కాదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమ్మె అంటే మొత్తం బంద్ చేస్తామని అర్థం కాదని, పాలన స్థంబింపజేయడమే సమ్మె లక్ష్యమని వివరించారు. కేవలం ఉద్యోగుల సమ్మె వల్ల తెలంగాణ వస్తుందని తాము భావించడం లేదని, సకల జనుల సమ్మెకు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ బిడ్డలుగా సమ్మెకు వెళ్తున్నామన్నారు. విలేకరుల సమావేశంలో ఉపాధ్యాయుల జేఏసీ చైర్మన్ పూల రవీందర్, ఎన్‌ఎంయూ నాయకుడు అశ్వథ్థామరెడ్డి, బీహెచ్‌ఈఎల్ కార్మిక నాయకుడు ఎల్లయ్య, సింగరేణి జేఏసీ నాయకులు మల్లయ్య, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
జేఏసీ సమావేశంలో చేసిన తీర్మానాలు ఇవీ..

1. ఆగస్టు 1లోగా తెలంగాణ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు ఆమోదింపజేసుకొని సకల జనుల సమ్మెలో పాల్గొనాలి. రాజీనామాలు చేయని నేతలు వెంటనే చేయాలి.

2. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అవసరమైన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి.

3. ఆగస్టు 12న జేఏసీ విస్తృతస్థాయి సమావేశం ద్వారా సమ్మె సైరన్ మోగించాలి. పరిస్థితులను సమీక్షించి 17 నుంచి సమ్మెకు దిగాలి.

Tuesday, 26 July 2011

Monday, 25 July 2011

prarambamina lalu tharvaja bonalu

పాతబస్తీలోని లాల్‌ దర్వాజ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు తెల్లవారుజామునుంచే భక్తులతో అమ్మవారి ఆలయం కిటకిటలాడుతోంది. మూసీ వరదల సమయంలో నిజాం నవాబు సైతం ఈ ఆలయానికి బోనాలు సమర్పించారని చరిత్ర చెబుతోంది. ఈరోజు నగరంలో దాదాపు 500 ఆలయాల్లో బోనాల పండుగను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్టీ 25 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. లాల్‌దర్వాజ అమ్మవారిని ఈరోజు ఉదయమే టీడీపీ నేత దేవేందర్‌గౌడ్‌ దర్శనం చేసుకున్నారు. అమ్మవారి బోనాలతో హైదరాబాద్‌ సందడిగా మారింది. ఆయా ఆలయాల వద్ద పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. అమ్మవారి పాటలతో భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.

malli mothatikochina telangana

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. విస్త్రృతస్థాయి సంప్రదింపులు, చర్చల తర్వాతే కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఇప్పటికే జరిగిన సంప్రదింపులు, చర్చలను కేంద్రం గాలికొదిలెసింది. మళ్లీ తాజాగా సంప్రదింపులు, చర్చల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లేనట్లేనని కేంద్రం చెప్పకనే చెప్పింది. కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ శనివారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మరోసారి సంప్రదింపులు, చర్చల ప్రక్రియ అంశాన్ని లేవనెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై విస్త్రృతస్థాయి సంప్రదింపుల, చర్చలు తర్వాతే కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఇప్పటికే ఈ అంశంపై ఎన్నోసార్లు విస్త్రృతస్థాయిలో సంప్రదింపులు జరిగాయి. చర్చలు ముగిశాయి. అయినా కేంద్ర ప్రభుత్వానికి ఇవేమి సంతృప్తినివ్వలేదు. మళ్లీ తిరిగి సంప్రదింపులు, చర్చలను ప్రారంభించాలని నిర్ణయించింది. సంప్రదింపులు, చర్చల పేరిట కేంద్రం కాలయాపన చేసే మంత్రంగాన్ని రచిస్తోందని తెలంగాణ వాదులు ఆజాద్‌ చేసిన ప్రకటనపై విరుచుకుపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దశాబ్ధలుగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారి చర్చలు, సంప్రదింపుల పేరిట కేంద్రం దాటవేత ధోరణి తెలంగాణ ప్రజలను మోసగిస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009 డిసెంబర్‌ తొమ్మిదవ తేదీన ప్రకటించిన యుపిఏ సర్కారే తిరిగి మళ్లీ విస్త్రృతస్థాయి సంప్రదింపులు, చర్చలు చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.

అటువంటప్పుడు మరి డిసెంబర్‌తొమ్మిదవ తేదీ ప్రకటన ఎందుకు చేసిందని ప్రశ్నించారు. డి సెంబర్‌ తొమ్మిదవ తేదీ తరువాత రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి అన్ని వర్గాల వారితో, సంఘాలు, రాజకీయ పార్టీలతో విస్త్రృతస్థాయి సంప్రదింపులు జరిపి కేంద్రానికి నివేదిక అందజేసిందన్నారు. అంతకు మించి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎవ్వరితో సంప్రదింపులు జరుపుతుందని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల రాజీనామాల నేపథ్యంలో కేంద్రంపై పెరుగుతున్న ఒత్తిడితో తప్పనిసరిగా ఎదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల నుండి తప్పించుకునేందుకే కేంద్రం సంప్రదింపులు, చర్చల ప్రస్తావనను తెరమీదకు తీసుకువచ్చిందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు ఒత్తిడితోనే ఈ ప్రకటన చేసిందని తెలంగాణ వాదులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై మరికొంత కాలం సంప్రదింపులు, చర్చల పేరిట కాలయాపన చేస్తే ఉద్యమం నీరుగారిపోతుందని కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉండవచ్చునని రాజకీయ పరిశీలకులు అంచనావేస్తున్నారు.

కేంద్రం నిర్ణయం ద్వారా సమీప భవిష్యత్తులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభానికి నోచుకునే అవకాశాలు ఎంత మాత్రం లేవంటున్నారు. ఉద్యమాల వల్ల అభివృద్ధి కుంటుపడడం మినహా కేంద్రం ఏమాత్రం స్పందించినట్లుగా కనిపించడం లేదంటున్నారు. ప్రజాప్రతినిధుల రాజీనామాలు సైతం కేంద్రంపై పెద్దగా ప్రభావం చూపినట్లుగా కనిపించడం లేదంటున్నారు. దీనికంతటికి ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో రాజీనామాలు చేయకపోవ డమే కారణమని పేర్కొంటున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత టీ-కాంగ్రెస్‌ నేతల స్వరం మారిందన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువద్దామనే మాటను ప్రయోగించడానికి వారు ఎంత మాత్రం ఇష్టపడడం లేదన్నారు.

కాంగ్రెస్‌ అధిష్టానం ఒత్తిడితో టీ-కాంగ్రెస్‌ నేతలు మెత్తబడినట్లుగానే కనిపిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం మంత్రి గులాం నబీ ఆజాద్‌ ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ గుండుగుత్తగా టీ-ప్రజాప్రతినిధుల రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించడం వెనుక కేంద్ర ప్రభుత్వ నిర్ణయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంకాన్ని మరికొంతకాలం సంప్రదింపులు, చర్చల ప్రక్రియ ద్వారా సాగదీయాలని కేంద్రం యోచి స్తున్నట్లు తెలుస్తోందంటున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పట్లో తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు అంశం మళ్లీ ‘రెడ్డొచ్చె మొదలా యో’ అన్న చందంగా తయారయిందంటున్నారు.

telangana vachentha varuku vudyamam:sridhar babu

తెలంగాణ రాష్ట్రం సాధించడమే తమ లక్ష్యమని, ఇందుకోసం రాజీనామాలు చేసిన ఎంపీలు,ఎమ్మెల్యేలు, మంత్రులమంతా ఒకేవిధానంతో ముందుకు సాగుతున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేంద్రం తెలంగాణ విషయం తేల్చేంతవరకు, డిసెంబర్ 9 ప్రకటనపై స్పష్టత వచ్చేంతవరకు సంఘటితంగా ఉద్యమిస్తామన్నారు. తెలంగాణపై చర్చించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి తమకు ఆహ్వా నంవచ్చిందని, రేపు ఢిల్లీకి వెళ్లే బృందంలో తానూ ఉన్నానన్నారు.

speaker dhisti bomma dhahanam:jai telangana

స్పీకర్ దిష్టిబొమ్మల దహనం

ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమో దించనందుకు నిరసనగా టీఆర్ఎస్, ో పాల్గొన్న ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఎంపీ,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్ చేశారు. సమైక్యాం«ద్రులను తెలంగాణ నుంచి పంపించే సమయం ఆసన్నమైందన్నారు. ఉట్నూరు, ముథోల్, కుభీర్‌లలో స్పీకర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు.

ప్రజాప్రతినిధుల రాజీనామాలను ఆమోదించాలనీ, పార్లవె ంగాణ కోసం కాళేశ్వరంలో మహారుద్రాభిషేకం కాటారం: కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర-ముక్తీశ్వర క్షేత్రం లో సిద్ధిపేట బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ కోసం ఆదివారం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. సిద్దిపేట, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్‌నుంచి వచ్చిన 60మందిబ్రాహ్మణులు ఈకార్యకమ్రంలో పాల్గొన్నారు.

bonamettina telangana

హైదరాబాద్‌లోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం వద్ద భక్తుల సందడి. పోతరాజుల నృత్యాలు, విచిత్ర వేషధారణలు, డప్పు వాయిద్యాలు... బోనాల జాతరతో అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి

parties havent decided yet on resignations

తొందరపాటు వద్దంటున్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ఎంపీల రాజీనామాలపై తేలే దాకా ఆగాలని నిర్ణయుం!
ఇకపై రాజీనామా చేయబోమన్న ఇద్దరు ఎమ్మెల్యేలు
నేడు నిర్ణయిస్తామన్న టీడీపీ తెలంగాణ ఫోరం
‘వేచి చూస్తున్న’ టీఆర్‌ఎస్.. నేడే రాజీనామాలంటూ లీకులు
ఇకపై రాజీనామాలు చేయబోమన్న బీజేపీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరిస్తూ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తీసుకున్న నిర్ణయం అన్ని పార్టీలనూ అంతులేని అయోమయంలో పడేసింది! మళ్లీ రాజీనామా చేయడమా, మానడమా అన్నదానిపై అవి ఏ నిర్ణయూనికీ రాలేక సతమతమవుతున్నారుు. కాంగ్రెస్, టీడీపీ ఆదివారమంతా దీనిపై సుదీర్ఘంగా చర్చించినా ఎటూ తేల్చుకోలేకపోయాయి. ఇప్పటికే ఓసారి రాజీనామాలు చేయడం ద్వారా గీత దాటామన్న అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానానికి కలిగించినందున ఈసారి తొందర పడొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. తీరా తాము రాజీనామా చేశాక కాంగ్రెస్ చేయకుంటే ఏం చేయడమా అని టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. ఆ రెండు పార్టీల వైఖరి తేలందే తాను రాజీనామా చేసినా ఏ మేరకు ప్రభావముంటుందో తేలక టీఆర్‌ఎస్ మథనపడుతోంది!

పంచాయతీరాజ్ వుంత్రి జానారెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఎర్రబెల్లి దయూకర్‌రావు నాయకత్వంలో తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు ఆదివారం సవూవేశమై వుళ్లీ రాజీనామాలు చేసే విషయుమై చర్చించారు. సోమవారం కూడా ఢిల్లీలో సమావేశమైన అనంతరం నిర్ణయుం వెల్లడిస్తావుని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. అయితే ఈసారి తొందర పడొద్దని వారు దాదాపుగా నిర్ణయూనికి వచ్చినట్టు తెలిసింది. ‘‘అరుుందేదో అరుుంది. ఇకపై రాజీనామాల విషయుంలో ఆచితూచి వ్యవహరించాలి. రాష్ట్రం కోసం అధిష్టానం, కేంద్ర ప్రభుత్వాలపై మరింతగా పోరాడి, అప్పటికీ ఫలితం లేకపోతేనే మళ్లీ రాజీనావూలపై ఆలోచించాలి’’ అన్నది వారి అంతర్గత ఆలోచనగా చెపుతున్నారు. సోమవారం స్టీరింగ్ కమిటీ భేటీ తర్వాత నిర్ణయుం ప్రకటిస్తామని చెప్పినా, ఇప్పట్లో మళ్లీ రాజీనామాలు ఉండకపోవచ్చని పీసీసీ సీనియుర్ నేత ఒకరు వెల్లడించారు.సోమవారం నుంచి ఎటూ అధిష్టానంతో సంప్రదింపులున్నందున కొద్ది రోజులు రాజీనామాలకు దూరంగా ఉండటమే మేలని ఇతర సీనియుర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. జానా నివాసంలో భేటీలోనూ ఇదే అభిప్రాయుం వ్యక్తమైనట్టు సవూచారం.

తెలంగాణ రాజకీయ జేఏసీ ‘సకల జనుల సమ్మె’కు మద్దతిచ్చి, ఎంపీల రాజీనామాలపై ఏదోటి తేలేదాకా వేచి చూడాలన్నది నేతల అభిప్రాయుం! మరోవైపు, తామిక రాజీనామా చేయబోవుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నర్సారెడ్డి (గజ్వేల్), నందీశ్వర్‌గౌడ్ (పటాన్‌చెరు) ప్రకటించడం పార్టీలోని వారి సహచరులను మరింత సందిగ్ధంలో పడేసింది! నిజానికి రాజీనామాల కంటే అధిష్టానంపై ఒత్తిడి తేవడమే మేలనే ధోరణిలో చాలామంది ఎమ్మెల్యేలు కన్పిస్తున్నారు. పైగా వుంత్రులు కూడా మళ్లీ రాజీనామాలకు సుముఖంగా లేరంటున్నారు. వారితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్ ఇప్పటికే ఫోన్లో మాట్లాడినట్టు సవూచారం. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మళ్లీ రాజీనామాలపై కచ్చితమైన నిర్ణయమేదీ తీసుకోలేదు. అందరి కంటే వుుందు రాజీనామాలు చేయడం ద్వారా, తాము తెలంగాణకు సానుకూలవుంటూ ప్రజల్లో విశ్వాసం కల్పించగలిగామని భావిస్తున్న వారు, ఈసారీ అదే పంథా అనుసరిస్తే ఎలా ఉంటుందని ఆదివారం నాటి ఫోరం భేటీలో చర్చించారు. సోమవారం వుూకువ్ముడిగా రాజీనామాలు చేయూలన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అయితే, దీనిపై తొందరపడకుండా కాంగ్రెస్ నిర్ణయూన్ని బట్టి స్పందించడం మేలని వారు భావిస్తున్నారు. బయటికి మాత్రం, సోమవారం మరోసారి భేటీ అయ్యాక రాజీనామాలు సమర్పిస్తామని అంటున్నారు! ఇక టీఆర్‌ఎస్ కూడా కాంగ్రెస్, టీడీపీల పరిణామాలను జాగ్రత్తగా గవునించడం మినహా రాజీనామాలపై ఇంకా ఏ నిర్ణయానికీ రాలేదు. దీనిపై ఆ ఎమ్మెల్యేలు ఏమీ మాట్లాడకపోయినా, తమ ఎమ్మెల్యేలు సోమవారం రాజీనా మా చేస్తారని ఆ పార్టీ వుుఖ్యుడొకరన్నారు. అప్పుడే టీడీపీ, కాంగ్రెస్‌లపై ఒత్తిడి పెరుగుతుందని టీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. కానీ ఆ తర్వాత కూడా రాజీనామాలకు అవి వెనకడుగు వేస్తే తాము ఒంటరయ్యే ప్రమాదముందని కొందరు టీఆర్‌ఎస్ నేతలు శంకిస్తున్నారు. అప్పుడు ఒంటరిగానే ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని, తరచూ ఉప ఎన్నికలపై ప్రజల్లో నిరుత్సాహం ఏర్పడుతుందని అభిప్రాయపడుతున్నారు. రాజీనామాలపై మళ్లీ అంతా ఒకే తాటిపై నడిస్తేనే మేలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంటున్నారు! టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలైన నాగం జనార్దనరెడ్డి బృందం మాత్రం ఆదివారమే రాజీనా మాలు చేయుడం విశేషం! మరోవైపు బీజేపీ మాత్రం ఇకపై రాజీనామాలు చేయొద్దని నిర్ణయించినట్టు తెలిసింది.

T News Blasts TV9 Full Left & Right To Andhra Media

second time trs mla's resign

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రెండోసారి రాజీనామా చేశారు. ఫ్యాక్స్‌ద్వారా స్పీకర్‌కు రాజీనామా లేఖలను పంపారు. భావోద్వేగాలతో తీసుకున్న నిర్ణంగా పరిగణిస్తూ మొదటి సారి రాజీనామాలను స్పీకర్ నాదేండ్ల మనోహర్ తిరస్కరించారు.

bonamethina bagyanagaram:telangana bonalu

మార్మోగిన తెలం‘గానం’
- బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న ప్రముఖులు
- అడ్డంకులు తొలగాలని ప్రజావూపతినిధుల ఆకాంక్ష
- లాల్‌దర్వాజలో ఆకర్షించిన ‘ప్రత్యేక’ బోనం


చంద్రాయణగుట్ట, జూలై 24 (టీ న్యూస్): భాగ్యనగరం ఆదివారం ‘ప్రత్యేక’ బోనమెత్తింది.. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను తన భుజాలకెత్తుకొని వినిపించింది.. తెలంగాణ ఏర్పాటుకు ఇదే మంచితరుణమని నినదించింది. బోనాల ఉత్సవాలు ప్రతి గల్లీలో ఘనంగా జరిగాయి. పచ్చని తోరణాలు.. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో అన్ని ప్రాంతాలు కొత్తశోభను అలుముకున్నాయి. పాతబస్తీలోని దేవాలయాలు, వీధులు వేలమంది భక్తులతో కిక్కిరిశాయి. గంటలపాటు మహిళలు క్యూలో నిలబడి అమ్మవారికి బోనాలు సమర్పించారు.

కుటుంబాలను చల్లగా చూడాలని, రాష్ట్రం ఏర్పడేలా వరమివ్వాలని వేడుకున్నారు. ఉత్సవాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీనటులు, నేతలు, వివిధరంగాలవారు తరలిరావడంతో పాతబస్తీ సందడిగా మారింది. ఆలయాల్లో పూజలు నిర్వహించి అభివూపాయాలను పంచుకున్నారు. తెలంగాణ ఆకాంక్షను వినిపించారు. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి మాతకు కొందరు మహిళలు ‘ప్రత్యేక’ బోనం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కావాలని రాసి అమ్మ వారిని వేడుకున్నారు. ఈ బోనం అందరినీ ఆకర్షించింది.

అందరికీ మంచి జరుగుతుంది: ఉప ముఖ్యమంత్రి
అమ్మవారి అనుక్షిగహం వల్లనే మానవాళికి అన్ని విధాలా మంచి జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రజలు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సంప్రదాయాన్ని, సంస్కృతిని ఇనుమడింపజేస్తున్నాయని పేర్కొన్నారు.

డిసెంబర్ ఞైపకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలి: గద్దర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ చేసిన రాజీనామాలు నిరసనలో భాగంగానే పరిగణించాలని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. రాజీనామాలు తిరస్కరణకు గురవుతాయన్న అంశం ముందుగా ఊహించిందేనని చెప్పారు. తెలంగాణపై డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కేంద్రవూపభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. సీమాంవూధపాలకుల బుద్ధి మార్చి తెలంగాణ వచ్చేలా దీవించాలని అమ్మవారిని గద్దర్ వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలపించిన పాటలు ఆలోచింపజేశాయి.

బోనం సమర్పించిన కవిత
రాంభక్షీబండలోని బంగారు మైసమ్మ దేవాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల బోనం సమర్పించారు. రాష్ట్రం వెంటనే ఏర్పడాలని, వచ్చేసారి తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్సవాలు జరిగేలా దీవించాలని ప్రార్థించారు.

తెలంగాణ వస్తే బంగారు బోనం సమర్పిస్తా: విజయశాంతి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని ఎంపీ విజయశాంతి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసగిస్తూనే ఉందని, ఆ పార్టీని నమ్మకుండా ప్రతిఒక్కరూ ఉద్యమంలో పాల్గొని రాష్ట్రం కలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అమ్మవారికి బంగారుబోనం సమర్పిస్తానని ప్రకటించారు.

అడ్డంకులు తొలగాలి:
కాంగ్రెస్ ఎంపీలు

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధు యాష్కిగౌడ్, సిరిసిల్ల రాజయ్య, వివేక్, మందా జగన్నాథంలు పాతబస్తీలోని పలు ఆలయాలను సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటుకు అవాంతరాలను తొలగించాలని, వ్యతిరేకుల మనసు మార్చాలని వేడుకున్నామని తెలిపారు. పాతబస్తీలో తెలంగాణ ఉద్యమం లేదని విర్రవీగుతున్న సీమాంధ్ర నాయకులు ఈ బోనాల ఉత్సవాలను చూసి తెలుసుకోవాలని కాంగ్రెస్ ఎంపీలు హితవుపలికారు.

ప్రముఖుల సందర్శన
మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్, వినోదిని దంపతులు, దేవాదాయశాఖ కమిషనర్ బలరామయ్య, జాయింట్ కమిషనర్ వి.కృష్ణారావు, అసిస్టెంట్ కమిషనర్ రమణమూర్తి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య, వేదకుమార్, పీసీసీచీఫ్ బొత్స, మంత్రులు ముఖేష్, దానం, ఎంపీ అంజన్ కుమార్‌యాదవ్, ఆలె నరేంద్ర, మాజీ మంత్రులు సి.కృష్ణాయాదవ్, శ్రీనివాస్‌యాదవ్, బీజేపీ నేతలు దత్తావూతేయ, వెంకట్‌డ్డి, డాక్టర్ లక్ష్మణ్, బద్దం బాల్‌డ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణాడ్డి, దేవి ఉపాసకులు దైవజ్ఞశర్మ, సినీనటుడు బాలు, డీజీపీ దినేష్‌డ్డి, డీసీపీ వినీత్‌వూబిజ్‌లాల్, టీఆర్‌ఎస్ నేతలు ఎంఎస్ రాంరెడ్డి, లలిత, యశ్వంత్‌కుమార్, ఎన్.కిరణ్‌డ్డి, పోసాని సదానంద్‌ముదిరాజ్, తిరుపతి శివకుమార్, ఉమ్మడిదేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు ఆలె భాస్కర్‌రాజు తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.