Saturday 23 July 2011

telangana kosam ninadinchina ou

తెలంగాణ కోసం నినదించిన ఓయూ

- బంద్ సంపూర్ణం
- కేంద్ర మంత్రి జైపాల్‌డ్డి దిష్టి బొమ్మ దహనం
- సమర భేరి పోస్టర్ విడుదల
యూనివర్సిటీలో శుక్రవారం బంద్ సంపూర్ణంగా జరిగింది. క్యాంపస్‌లోని అన్ని కళాశాలలు, కార్యాలయాలు, గ్రంథాలయాలు మూతపడ్డాయి. కొందరు విద్యార్థులు యాదిడ్డి అంత్యక్షికియల్లో పాల్గొనేందుకు వెళ్లారు. మరికొంత మంది ఓయూలో తెలంగాణ కోసం నిరసన కార్యక్షికమాలను చేపట్టారు. టీఎస్ జాక్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి జైపాల్‌డ్డి దిష్టిబొమ్మను ఆర్ట్స్ కళాశాల నుంచి శవయావూతగా తీసుకు పోలీస్‌స్టేషన్ ఎదుట దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తార్నాక వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్షికమంలో టీఎస్ జాక్ చైర్మన్ విజయ్, తెలంగాణ రీసర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్, టీఎస్ జాక్ నాయకులు మర్రి అనిల్, ఆజాద్, దుర్గం భాస్కర్ పాల్గొన్నారు. కాగా, తెలంగాణ కోసం ఈనెల 27న జరగనున్న ‘సమరభేరి సభ’ పోస్టర్లను ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏబీవీపీ నాయకులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్షికమంలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి కడియం రాజు, కార్యవర్గ సభ్యుడు టి.రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్యాణ్, వీరబాబు, ఓయూ నాయకులు ఎల్లస్వామి, రాజేంవూదవూపసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కోసం ఆగస్టు 1 నుంచి సమ్మె చేప ఉద్యోగులు సిద్ధమవగా ప్రభుత్వం వారిపై ఎస్మా ప్రయాగిస్తానని హెచ్చరించడాన్ని పీడీఎస్‌యూ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరును నిరసించారు. ఆర్ట్స్ కళాశాల ఎదుట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిషిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ తల్లి కేంద్ర ప్రభుత్వం, పోలీసు బలగాల చేతిలో ఎట్లా బందీ అయిందో ఈ సందర్భంగా విద్యార్థులు ఓ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్షికమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి గౌతమ్ ప్రసాద్, నగర అధ్యక్షురాలు సత్యవతి, ఓయూ అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment