Saturday 23 July 2011

sthambinchina telangana

అమరవీరుడికి అవమానంపై సర్వత్రా ఆగ్రహం
- ‘ఎస్మా’ చట్టంపై మండిపడ్డ తెలంగాణవాదులు
- స్వచ్ఛందంగా బంద్
- ఊరూరా రాస్తారోకో, ర్యాలీలు
- తెలంగాణ ద్రోహుల దిష్టిబొమ్మల దహనం
- కదలని ఆర్టీసీ బస్సులు
- విధులు బహిష్కరించిన న్యాయవాదులు
- కరీంనగర్‌లో కలెక్టర్, ఎస్పీలకు సమ్మె నోటీసిచ్చిన ఉద్యోగులు
- నల్లబ్యాడ్జీలతో సింగరేణి కార్మికుల నిరసన
- బోధన్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎదుట ధర్నా


తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన యాదిడ్డి భౌతికకాయాన్ని అవమానించడంతోపాటు ఉద్యోగులపై ఎస్మా చట్టం ప్రయోగిస్తామని చెప్పడాన్ని నిరసిస్తూ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతమైంది. శుక్రవారం తెలంగాణలోని పది జిల్లాల్లో వాణిజ్య, వ్యాపార, పాఠశాలల యాజమాన్యాలతోపాటు ఆర్టీసీ ఉద్యోగులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. న్యాయవాదులు విధులు బహిష్కరించగా, కరీంనగర్‌లో కలెక్టరేట్ ఉద్యోగులు విధులకు దూరంగా ఉన్నారు. ఊరూరా రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. ఎక్కడా ఒక్క బస్సు రోడ్డెక్కలేదు. పలు చోట్ల ఎమ్మెల్యేలు కూడా పాల్గొని నిరసన తెలిపారు. సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. రాజీనామా చేయని నేతలతోపాటు సీఎం, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించారు.

భారీగా తెలంగాణవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు.వరంగల్‌లో సీమాంధ్ర వ్యక్తికి చెందిన నాగార్జున ఫర్టిలైజర్స్ కంపెనీకి చెందిన ఒక దుకాణాన్ని తెలంగాణవాదులు బంద్ చేయించే క్రమంలో కొందరు ఆ దుకాణంపై రాళ్లురువ్వారు. ఈ కేసులో వరంగల్ తూర్పు నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకుడు అచ్చా విద్యాసాగర్ సహా 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా తెలంగాణవాదులను బంద్ సందర్భంగా ముందస్తుగా అరెస్టు చేశారు. న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఉద్యోగులు విధులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు చేశారు. న్యాయవాదులు జిల్లా వ్యాప్తంగా విధులు బహిష్కరించి రోడ్డెక్కారు. రాస్తారోకోలో చిక్కుకున్న వారికి తెలంగాణ వాదులు అక్కడే వంటలు చేసి భోజనాలు పెట్టించారు. జిల్లాలో పలు చోట్ల జగ్గాడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సోనియా, సీఎం కిరణ్‌కుమార్‌డ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. పటాన్‌చెరులో పరిక్షిశమలు మూసేసి సెలవు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో ఉద్యోగ సంఘాలు, రాజకీయ పక్షాలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్‌ను విజయవంతం చేశాయి.

తెలంగాణవాదులు రాస్తారోకోలు చేపట్టి, మానవహారాలుగా ఏర్పడ్డారు. ఖమ్మం, మధిరలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జిలు ధరించి విధులకు హాజరయ్యారు. పలు చోట్ల డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క దిష్టిబొమ్మను దహనం చేశారు. బంద్‌లో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, పొలిట్ బ్యూరో సభ్యులు రామారావు, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు, ఉద్యోగ జేఏసీ చైర్మన్ రంగరాజు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్షికసీ జిల్లా కార్యదర్శి రంగారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి హేమంతరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌డ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గుండా మల్లేశ్, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు బంద్‌లో పాల్గొన్నారు. పశ్చిమ ప్రాంతం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీహరిరావు, తూర్పు ప్రాంతం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు సతీశ్ సహా జిల్లా వ్యాప్తంగా 220 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో సీఎం కిరణ్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బొగ్గు బావుల్లో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

పలు చోట్ల విలేకరులు రాస్తారోకోలు నిర్వహించారు. శ్రీరాంపూర్‌లోని శిర్కేలో సింగరేణి మహిళా జేఏసీ ఆధ్వర్యంలో క్యాండీల్ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్‌లో టీజేఏసీ, టీఎన్‌జీఓలు కలెక్టర్ స్మితాసబర్వాల్‌కు, ఎస్పీ రవీందర్‌కు సమ్మెనోటీసు ఇచ్చారు. సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. జగిత్యాలలో టీఆర్‌ఎస్ నాయకులు మాక్ పార్లమెంట్ నిర్వహించారు. న్యాయవాదులు విధులు బహిష్కరించారు. మహబూబ్‌నగర్‌లో కౌలు రైతుల రుణ అర్హత కార్డుల పంపిణీ కార్యక్షికమం జరుగుతుండగా రెవెన్యూ ఉద్యోగులు వెళ్లి అడ్డుకున్నారు. వనపర్తిలో సీఎం కిరణ్‌కుమార్‌డ్డి, లగడపాటి, టీజీ వెంక పయ్యావుల కేశవ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. న్యాయవాదులు, టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో నల్ల బెలూన్లతో అమరులకు నివాళులు అర్పించారు.

జిల్లా కేంద్రంలో ఆర్టీసీ ఉద్యోగులు డిపో వద్ద వంటావార్పు చేశారు. పాలెంలో తెలంగాణవాదులు పాల శీతలీకరణ కేంద్రంపై దాడికి దిగారు. నల్లగొండ జిల్లాలో తెలంగాణవాదులంతా రోడ్లపై నిరసన తెలిపారు. నల్లగొండలో జేఏసీ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీ నిర్వహించారు. కోర్టు నుంచి గడియారం సెంటర్ వరకు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్థూపం వద్ద యాదిడ్డికి నివాళులర్పించారు. సూర్యాపేట డివిజన్‌లో వద్ద రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో సీమాంవూధులకు చెందిన చక్కెర ఫ్యాక్టరీ వద్ద పోలీసులు అతిగా ప్రవర్తించారు. ఎన్‌డీఎస్‌ఎఫ్ చక్కెర ఫ్యాక్టరీ ఉద్యోగులను బంద్‌లో పాల్గొననీయకుండా పనిచేయిస్తున్న సీమాంధ్ర కంపెనీ తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. ఫ్యాక్టరీ గేటులోని సెక్యూరిటీ పాయింట్‌పై తెలంగాణవాదులు దాడిచేశారు. జేఏసీ చైర్మన్ గోపాల్‌డ్డి, గంగాడ్డితోపాటు 15మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కామాడ్డిలో 50 మంది ఉద్యమకారులను అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌లో విద్యార్థి నాయకుడు ప్రదీప్, జేఏసీ నాయకుడు ప్రభాకర్‌ను అరెస్ట్ చేసి దురుసుగా వ్యవహరించారు.

హైదరాబాద్‌లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణిలో పోలీసుల రక్షణ వలయంలో కొన్ని ఆర్టీసీ బస్సులను నగరంలో తిప్పేందుకు ప్రయత్నించగా ఆగ్రహించిన తెలంగాణవాదులు 30 బస్సులను పాక్షికంగా ధ్వంసం చేశారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు. గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పద్మారావు ఆధ్వర్యంలో సికింవూదాబాద్ పరిధిలో దుకాణాలు మూసి వేయించి బంద్‌ను విజయవంతం చేశారు. మాజీ మంత్రి నాయిని నర్సింహాడ్డి కార్యకర్తలతో కలిసి తిరుగుతూ దుకాణాలను మూసి వేయించారు. రంగాడ్డి జిల్లాలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి రోడ్డెక్కారు. ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు. జిల్లా ఉద్యోగ జేఏసీ నేతలు రాజేందర్‌డ్డి, లక్ష్మాడ్డి, రామ్మోహన్, బాల్‌రాజ్ పాల్గొన్నారు. కడ్మూర్‌లో ఐదుగురు సెల్‌టవర్ ఎక్కి నినాదాలు చేశారు. మర్పల్లి మండలం బూచన్‌పల్లిలో టీఆర్‌ఎస్ నేతలు సీమాంధ్ర వ్యాపారి ఫాంహౌస్‌పై దాడికి దిగారు.

No comments:

Post a Comment