Monday 25 July 2011

bonamethina bagyanagaram:telangana bonalu

మార్మోగిన తెలం‘గానం’
- బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న ప్రముఖులు
- అడ్డంకులు తొలగాలని ప్రజావూపతినిధుల ఆకాంక్ష
- లాల్‌దర్వాజలో ఆకర్షించిన ‘ప్రత్యేక’ బోనం


చంద్రాయణగుట్ట, జూలై 24 (టీ న్యూస్): భాగ్యనగరం ఆదివారం ‘ప్రత్యేక’ బోనమెత్తింది.. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను తన భుజాలకెత్తుకొని వినిపించింది.. తెలంగాణ ఏర్పాటుకు ఇదే మంచితరుణమని నినదించింది. బోనాల ఉత్సవాలు ప్రతి గల్లీలో ఘనంగా జరిగాయి. పచ్చని తోరణాలు.. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో అన్ని ప్రాంతాలు కొత్తశోభను అలుముకున్నాయి. పాతబస్తీలోని దేవాలయాలు, వీధులు వేలమంది భక్తులతో కిక్కిరిశాయి. గంటలపాటు మహిళలు క్యూలో నిలబడి అమ్మవారికి బోనాలు సమర్పించారు.

కుటుంబాలను చల్లగా చూడాలని, రాష్ట్రం ఏర్పడేలా వరమివ్వాలని వేడుకున్నారు. ఉత్సవాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీనటులు, నేతలు, వివిధరంగాలవారు తరలిరావడంతో పాతబస్తీ సందడిగా మారింది. ఆలయాల్లో పూజలు నిర్వహించి అభివూపాయాలను పంచుకున్నారు. తెలంగాణ ఆకాంక్షను వినిపించారు. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి మాతకు కొందరు మహిళలు ‘ప్రత్యేక’ బోనం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కావాలని రాసి అమ్మ వారిని వేడుకున్నారు. ఈ బోనం అందరినీ ఆకర్షించింది.

అందరికీ మంచి జరుగుతుంది: ఉప ముఖ్యమంత్రి
అమ్మవారి అనుక్షిగహం వల్లనే మానవాళికి అన్ని విధాలా మంచి జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రజలు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సంప్రదాయాన్ని, సంస్కృతిని ఇనుమడింపజేస్తున్నాయని పేర్కొన్నారు.

డిసెంబర్ ఞైపకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలి: గద్దర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ చేసిన రాజీనామాలు నిరసనలో భాగంగానే పరిగణించాలని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. రాజీనామాలు తిరస్కరణకు గురవుతాయన్న అంశం ముందుగా ఊహించిందేనని చెప్పారు. తెలంగాణపై డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కేంద్రవూపభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. సీమాంవూధపాలకుల బుద్ధి మార్చి తెలంగాణ వచ్చేలా దీవించాలని అమ్మవారిని గద్దర్ వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలపించిన పాటలు ఆలోచింపజేశాయి.

బోనం సమర్పించిన కవిత
రాంభక్షీబండలోని బంగారు మైసమ్మ దేవాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల బోనం సమర్పించారు. రాష్ట్రం వెంటనే ఏర్పడాలని, వచ్చేసారి తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్సవాలు జరిగేలా దీవించాలని ప్రార్థించారు.

తెలంగాణ వస్తే బంగారు బోనం సమర్పిస్తా: విజయశాంతి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని ఎంపీ విజయశాంతి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసగిస్తూనే ఉందని, ఆ పార్టీని నమ్మకుండా ప్రతిఒక్కరూ ఉద్యమంలో పాల్గొని రాష్ట్రం కలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అమ్మవారికి బంగారుబోనం సమర్పిస్తానని ప్రకటించారు.

అడ్డంకులు తొలగాలి:
కాంగ్రెస్ ఎంపీలు

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధు యాష్కిగౌడ్, సిరిసిల్ల రాజయ్య, వివేక్, మందా జగన్నాథంలు పాతబస్తీలోని పలు ఆలయాలను సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటుకు అవాంతరాలను తొలగించాలని, వ్యతిరేకుల మనసు మార్చాలని వేడుకున్నామని తెలిపారు. పాతబస్తీలో తెలంగాణ ఉద్యమం లేదని విర్రవీగుతున్న సీమాంధ్ర నాయకులు ఈ బోనాల ఉత్సవాలను చూసి తెలుసుకోవాలని కాంగ్రెస్ ఎంపీలు హితవుపలికారు.

ప్రముఖుల సందర్శన
మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్, వినోదిని దంపతులు, దేవాదాయశాఖ కమిషనర్ బలరామయ్య, జాయింట్ కమిషనర్ వి.కృష్ణారావు, అసిస్టెంట్ కమిషనర్ రమణమూర్తి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య, వేదకుమార్, పీసీసీచీఫ్ బొత్స, మంత్రులు ముఖేష్, దానం, ఎంపీ అంజన్ కుమార్‌యాదవ్, ఆలె నరేంద్ర, మాజీ మంత్రులు సి.కృష్ణాయాదవ్, శ్రీనివాస్‌యాదవ్, బీజేపీ నేతలు దత్తావూతేయ, వెంకట్‌డ్డి, డాక్టర్ లక్ష్మణ్, బద్దం బాల్‌డ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణాడ్డి, దేవి ఉపాసకులు దైవజ్ఞశర్మ, సినీనటుడు బాలు, డీజీపీ దినేష్‌డ్డి, డీసీపీ వినీత్‌వూబిజ్‌లాల్, టీఆర్‌ఎస్ నేతలు ఎంఎస్ రాంరెడ్డి, లలిత, యశ్వంత్‌కుమార్, ఎన్.కిరణ్‌డ్డి, పోసాని సదానంద్‌ముదిరాజ్, తిరుపతి శివకుమార్, ఉమ్మడిదేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు ఆలె భాస్కర్‌రాజు తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

No comments:

Post a Comment