Thursday 21 July 2011

telangana kosam ikyamga vudhyamistham

తెలంగాణ సాధన కోసం అన్ని ప్రజా సంఘాలు, సంస్థలతో కలసి ఐక్యం గా ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ దిలీప్‌ కుమార్‌, తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ విమలక్క అన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిని వారు బీజేపీ కార్యాలయంలో కలుసుకున్నారు. తెలంగాణ ఉద్యమ కార్యాచరణపై కిషన్‌రెడ్డితో వారు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం కేంద్రం వైఖరి చూస్తుంటే తెలంగాణ ఇచ్చేది లేదన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. ఫలితంగా రాష్ట్రం లోని పార్టీలు, పోరాట సంస్థల్లో చీలికలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందు కోసం ప్రస్తుత తెలంగాణ రాజకీయ జేఏసీని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రణబ్‌ ముఖర్జీ, గులాం నబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యల తో తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారని కిషన్‌ రెడ్డి అన్నారు. కేంద్రం వైఖరి చూస్తుంటే తెలంగాణ ఇవ్వటం కష్టమని స్పష్టమవుతున్నదన్నారు.

No comments:

Post a Comment