Tuesday 19 July 2011

rajinamala amotham eka lenatle

జిల్లాపరిషత్ ప్రాదేశిక సభ్యుల్లో కొందరి రాజీనామాలు ఆమోదం పొందే అవకాశం లేనట్టేనని తేలిపోయింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు రాజీనామా బాటను ఎంచుకున్నారు. తాము తెలంగాణకు ముందువరుసలో ఉన్నామని ప్రజలకు భ్రమ కల్పించారు. రాజీనామాలు ఆమో దించే రీతిలో (ఫార్మట్‌లో)కాకుండా ఇతర మార్గాలను అనుసరించి రాజీనామాలు చేసి ఆమోదం పొందేందుకు తిరకాసును ఎంచుకున్నారు. ఇటు ప్రజాగ్రహానికి గురికాకుండా, అటు రాజీనామా ఆమోదం పొందకుండా ద్వంద్వ నీతిని ప్రద ర్శించారు.

ఉత్తుత్త రాజీనామాలు చేసి తెలంగాణపై తమకున్న ఆకాంక్ష ఏ పాటిదో ప్రజలకు చాటి చెప్పుకున్నారు. నిబంధనల ప్రకారం వివిధ మార్గాల ద్వారా రాజీనామాలు సమర్పించిన జడ్పీటీసీలకు వ్యక్తిగతంగా వారి వివరణ కోరేందుకు కలెక్టర్ తేదీ నిర్ణయించి ముందుగా వారికి సమాచారం అందించాలి. సభ్యుల పదవీకాలం ఈ నెల 21తో ముగుస్తోంది.

అంటే ఈ లెక్కన రాజీనామాల ఆమోదం సాధ్యపడదనే విషయం స్పష్టమవుతోంది. జిల్లాలో 36 మంది జడ్పీటీసీలకు గాను 20 మంది రాజీనామాలు చేశారు. వీరిలో మొదట 8 మంది జడ్పీటీసీలు రాజీనామాలు ఆమోదించే విధంగా పంపించారు. అందరికంటే ముందు ఫ్యాక్స్ ద్వారా రాజీనామా చేసిన డిచ్‌పల్లి జడ్పీటీసీ దినేష్‌కుమార్ అనంతరం కలెక్టర్‌ను వ్యక్తిగతంగా కలిసి రాజీనామాను ఆమోదించుకున్నారు. ఇక మిగతా 19 మంది జడ్పీటీసీలు తమ రాజకీయ వక్రబుద్ధిని చాటుకున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment