Tuesday 19 July 2011

rastram renduga vunte thappenti

దేశంలో అనేక రాష్ట్రాలు రెండుగా మారిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ కూడా రెండుగా మారితే తప్పేంటని మాజీ మంత్రి, నాప్కాబ్‌ ఉపాధ్యక్షు డు, జై ఆంధ్రా ఉద్యమ నేత వసంత నాగేశ్వరరావు సమైక్యాంధ్ర వాదుల ను ప్రశ్నించారు. విజయవా డ ప్రెస్‌ క్లబ్‌లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా చేసి ప్రత్యేకాంధ్ర, తెలంగాణా లను ఇవ్వాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అధిష్టానాన్ని కోరాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రజలు వారి వారి రాజధానుల్లో పెట్టుబడులు పెట్టి సంతో షంగా జీవిస్తుంటే సీమాంధ్రవాసులు మాత్రం హైదరాబాద్‌లో ఉండకూడదని వేర్పాటువాదులు జాగో బాగో అంటుంటే ప్రజా ప్రతినిధులు, మంత్రులు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

నాడు ప్రత్యేకాంధ్ర కావాలని కోరుకున్న వారు నేడు సమైక్యమని ఎందుకు మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. సమైక్యాంధ్రలో తెలంగాణా భూములు అభివృద్ధి చెందితే ఆంధ్రా ప్రాంతంలో మాత్రం భూములు ధరలు పడిపోయాయన్నారు. విడిపోయి మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి పరచుకుందామన్నారు. సమైక్యాంధ్రా కోరుకునేవారు ఆంధ్రా అభివృద్ధిని అడ్డుకున్నట్టేనన్నారు. హైదారాబాద్‌లో ఇతర రాష్ట్రాలవారు ఉంటే తెలంగాణావాదులకు అభ్యంతరంలేదు గానీ సీమాంధ్రావారిపై మాత్రం దాడులు చేస్తున్నారని, దీని గురించి మంత్రులకు ముఖ్యమంత్రులకు పట్టడం లేదని విమర్శించారు.

No comments:

Post a Comment