Monday 25 July 2011

parties havent decided yet on resignations

తొందరపాటు వద్దంటున్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ఎంపీల రాజీనామాలపై తేలే దాకా ఆగాలని నిర్ణయుం!
ఇకపై రాజీనామా చేయబోమన్న ఇద్దరు ఎమ్మెల్యేలు
నేడు నిర్ణయిస్తామన్న టీడీపీ తెలంగాణ ఫోరం
‘వేచి చూస్తున్న’ టీఆర్‌ఎస్.. నేడే రాజీనామాలంటూ లీకులు
ఇకపై రాజీనామాలు చేయబోమన్న బీజేపీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరిస్తూ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తీసుకున్న నిర్ణయం అన్ని పార్టీలనూ అంతులేని అయోమయంలో పడేసింది! మళ్లీ రాజీనామా చేయడమా, మానడమా అన్నదానిపై అవి ఏ నిర్ణయూనికీ రాలేక సతమతమవుతున్నారుు. కాంగ్రెస్, టీడీపీ ఆదివారమంతా దీనిపై సుదీర్ఘంగా చర్చించినా ఎటూ తేల్చుకోలేకపోయాయి. ఇప్పటికే ఓసారి రాజీనామాలు చేయడం ద్వారా గీత దాటామన్న అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానానికి కలిగించినందున ఈసారి తొందర పడొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. తీరా తాము రాజీనామా చేశాక కాంగ్రెస్ చేయకుంటే ఏం చేయడమా అని టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. ఆ రెండు పార్టీల వైఖరి తేలందే తాను రాజీనామా చేసినా ఏ మేరకు ప్రభావముంటుందో తేలక టీఆర్‌ఎస్ మథనపడుతోంది!

పంచాయతీరాజ్ వుంత్రి జానారెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఎర్రబెల్లి దయూకర్‌రావు నాయకత్వంలో తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు ఆదివారం సవూవేశమై వుళ్లీ రాజీనామాలు చేసే విషయుమై చర్చించారు. సోమవారం కూడా ఢిల్లీలో సమావేశమైన అనంతరం నిర్ణయుం వెల్లడిస్తావుని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. అయితే ఈసారి తొందర పడొద్దని వారు దాదాపుగా నిర్ణయూనికి వచ్చినట్టు తెలిసింది. ‘‘అరుుందేదో అరుుంది. ఇకపై రాజీనామాల విషయుంలో ఆచితూచి వ్యవహరించాలి. రాష్ట్రం కోసం అధిష్టానం, కేంద్ర ప్రభుత్వాలపై మరింతగా పోరాడి, అప్పటికీ ఫలితం లేకపోతేనే మళ్లీ రాజీనావూలపై ఆలోచించాలి’’ అన్నది వారి అంతర్గత ఆలోచనగా చెపుతున్నారు. సోమవారం స్టీరింగ్ కమిటీ భేటీ తర్వాత నిర్ణయుం ప్రకటిస్తామని చెప్పినా, ఇప్పట్లో మళ్లీ రాజీనామాలు ఉండకపోవచ్చని పీసీసీ సీనియుర్ నేత ఒకరు వెల్లడించారు.సోమవారం నుంచి ఎటూ అధిష్టానంతో సంప్రదింపులున్నందున కొద్ది రోజులు రాజీనామాలకు దూరంగా ఉండటమే మేలని ఇతర సీనియుర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. జానా నివాసంలో భేటీలోనూ ఇదే అభిప్రాయుం వ్యక్తమైనట్టు సవూచారం.

తెలంగాణ రాజకీయ జేఏసీ ‘సకల జనుల సమ్మె’కు మద్దతిచ్చి, ఎంపీల రాజీనామాలపై ఏదోటి తేలేదాకా వేచి చూడాలన్నది నేతల అభిప్రాయుం! మరోవైపు, తామిక రాజీనామా చేయబోవుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నర్సారెడ్డి (గజ్వేల్), నందీశ్వర్‌గౌడ్ (పటాన్‌చెరు) ప్రకటించడం పార్టీలోని వారి సహచరులను మరింత సందిగ్ధంలో పడేసింది! నిజానికి రాజీనామాల కంటే అధిష్టానంపై ఒత్తిడి తేవడమే మేలనే ధోరణిలో చాలామంది ఎమ్మెల్యేలు కన్పిస్తున్నారు. పైగా వుంత్రులు కూడా మళ్లీ రాజీనామాలకు సుముఖంగా లేరంటున్నారు. వారితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్ ఇప్పటికే ఫోన్లో మాట్లాడినట్టు సవూచారం. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మళ్లీ రాజీనామాలపై కచ్చితమైన నిర్ణయమేదీ తీసుకోలేదు. అందరి కంటే వుుందు రాజీనామాలు చేయడం ద్వారా, తాము తెలంగాణకు సానుకూలవుంటూ ప్రజల్లో విశ్వాసం కల్పించగలిగామని భావిస్తున్న వారు, ఈసారీ అదే పంథా అనుసరిస్తే ఎలా ఉంటుందని ఆదివారం నాటి ఫోరం భేటీలో చర్చించారు. సోమవారం వుూకువ్ముడిగా రాజీనామాలు చేయూలన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అయితే, దీనిపై తొందరపడకుండా కాంగ్రెస్ నిర్ణయూన్ని బట్టి స్పందించడం మేలని వారు భావిస్తున్నారు. బయటికి మాత్రం, సోమవారం మరోసారి భేటీ అయ్యాక రాజీనామాలు సమర్పిస్తామని అంటున్నారు! ఇక టీఆర్‌ఎస్ కూడా కాంగ్రెస్, టీడీపీల పరిణామాలను జాగ్రత్తగా గవునించడం మినహా రాజీనామాలపై ఇంకా ఏ నిర్ణయానికీ రాలేదు. దీనిపై ఆ ఎమ్మెల్యేలు ఏమీ మాట్లాడకపోయినా, తమ ఎమ్మెల్యేలు సోమవారం రాజీనా మా చేస్తారని ఆ పార్టీ వుుఖ్యుడొకరన్నారు. అప్పుడే టీడీపీ, కాంగ్రెస్‌లపై ఒత్తిడి పెరుగుతుందని టీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. కానీ ఆ తర్వాత కూడా రాజీనామాలకు అవి వెనకడుగు వేస్తే తాము ఒంటరయ్యే ప్రమాదముందని కొందరు టీఆర్‌ఎస్ నేతలు శంకిస్తున్నారు. అప్పుడు ఒంటరిగానే ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని, తరచూ ఉప ఎన్నికలపై ప్రజల్లో నిరుత్సాహం ఏర్పడుతుందని అభిప్రాయపడుతున్నారు. రాజీనామాలపై మళ్లీ అంతా ఒకే తాటిపై నడిస్తేనే మేలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంటున్నారు! టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలైన నాగం జనార్దనరెడ్డి బృందం మాత్రం ఆదివారమే రాజీనా మాలు చేయుడం విశేషం! మరోవైపు బీజేపీ మాత్రం ఇకపై రాజీనామాలు చేయొద్దని నిర్ణయించినట్టు తెలిసింది.

No comments:

Post a Comment