‘‘పొరపాటున, ఏ కారణంచేతనైనా, పరిస్థితులు ఆగమై తెలంగాణ రాకుంటే సీమాంవూధులు బతకనిస్తారా? తెలంగాణకు ఒక్క చప్రాసి ఉద్యోగమైనా దక్కనిస్తారా? ఈ పరిస్థితిని ఊహించుకుం భరించలేకున్నాం. అటువంటి తెలంగాణ చూస్తూ నేనైతే గ్యారంటీగా బతికి ఉండను. విషం తాగి చనిపోవడం నయం. ఆరునూరైనా తెలంగాణను సాధించుకోవాలి. తెలంగాణ సాధించడం జీవిత లక్ష్యం కావాలి’’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం భారీ ఎత్తున ఉద్యమాలు కొనసాగుతున్న ఇలాంటి సమయంలోనే సమైక్య పాలకులు రకరకాల దురాగతాలకు పాల్పడుతున్నారని, ఒకవేళ పొరపాటున తెలంగాణ రాకుంటే పరిస్థితి ఊహించుకోలేమని ఆయన అన్నారు.
అందుకే యావత్ తెలంగాణ సమాజం ఇదే స్ఫూర్తితో ఐక్యం గా ఉండి తెలంగాణను సాధించుకునే వరకు విరామమెరుగకుం డా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర, జిల్లా కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన మండిపడ్డారు. 14ఎఫ్‌ను రద్దుచేసేవరకు ఎస్‌ఐ, డిగ్రీ లెక్చరర్ల పరీక్షలను వాయిదా వేయాలని ఆయన ముఖ్యమంవూతిని డిమాండ్ చేశా రు. పరీక్షలను రద్దుచేస్తే ఆయన కు వచ్చే నష్టం, కష్టం ఏముందని నిలదీశారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజావూపతినిధులు, కాంగ్రె స్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, యావత్ తెలంగాణ పరీక్షలను వాయిదా వేయాలంటుంటే ఆయన జులుం ఏంది? షరారత్ ఏంది? అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
14ఎఫ్‌ను రద్దు చేయాలని అసెంబ్లీ ఏకక్షిగీవంగా చేసిన తీర్మానాన్ని ఉల్లంఘిస్తావా? అది ప్రివిలేజ్ కిందికి రాదా? అని ప్రశ్నించారు. మొండిగా వ్యవహరించడం సీఎం మూర్ఖత్వానికి పరాకాష్ట అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఇదేం నిరంకుశత్వం? అని ప్రశ్నించారు. పోలీసు ఫోర్స్‌తో దొంగచాటున బీహెచ్‌ఈఎల్‌లో పరీక్షలు నిర్వహించడమేందని ఆయన ప్రశ్నించారు. ‘‘తెలంగాణ ఉద్యమాన్ని విరమించుకుంటే ఆస్తి అంతా రాసిస్తానని విజయవాడ ఎంపీ లగడపాటి ఆస్తి అంతా రాసిస్తానని విజయవాడ ఎంపీ లగడపాటి అంటున్నడు. ఇది విచివూతంగా ఉంది. లగడపాటి ఆస్తి ఎవరికి కావాలి. కాళ్లు మొక్కి ఇచ్చినా తీసుకోం.
తెలంగాణవాళ్లకు మందిసొమ్ము తినే అలవాటు లేదు’’ అని కేసీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ఆంధ్ర ఎంిపీ కావూరి వెకిలి మాటలు మాట్లాడుతున్నారని, అలా మాట్లాడినందుకు సిగ్గు పడాలన్నారు. అసలు మెడ మీద తలకాయ ఉండి మాట్లాడుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంవూధులు ఇంకా భ్రమల్లోనే ఉన్నారని, దోచుకొని తినడం అలవాటైంది కాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. సకల సమస్యలకు తెలంగాణ రాష్ట్ర సాధనే పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు. ముమ్మాటికీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే ఉంటారన్నారు. తెలంగాణ సర్కారులో తాను కాపలా కాస్తూ ఉంటానన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత పునర్నిర్మాణ పనులు ముఖ్యమని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తామని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమినివ్వడం, సంక్షేమ పథకాలను అమలు చేయడం, కుల, మతాల ప్రస్తావన లేకుండా అందరినీ ఒకే గొడుగు కింద రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఉన్నత చదువులు చదివించడం వంటి అనేక కార్యక్షికమాలను అమలు చేయాల్సి ఉంటుందన్నారు.
14ఎఫ్ రద్దు కోసం ఈ సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. విద్యార్థుల పోరాటాలకు అందరూ అండగా నిలవాలని కేసీఆర్ కోరారు. ఎస్‌ఐ, డిగ్రీ లెక్చరర్ల పరీక్షల రద్దు డిమాండ్‌తో సోమవారం తెలంగాణవ్యాప్తంగా భారీగా రాస్తారోకోలు నిర్వహించాలని, 2న తరగతులను బహిష్కరించి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని, 3న ముఖ్యమంత్రి, డీజీపీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని, 4న పరీక్షలను రద్దుచేసేందుకు సహకరించాల్సిందిగా పాలకులకు విజ్ఞప్తి చేయాలని, అప్పటికీ ప్రభుత్వం వినకుంటే 5న తెలంగాణ బంద్ నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా చీమ చిటుక్కుమనొద్దు అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వ్యవహారం చూస్తుంటే ‘నహీ మర్త, కుచ్ నహీ కర్త’ (చావడు, ఏమీ చేయడు) అన్న చందంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సకల జనుల సమ్మె సందర్భంగా జరిగే జాతీయ రహదారుల దిగ్బంధాన్ని సూపర్‌హిట్ చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రహదారుల దిగ్బంధాన్ని ఎక్కడికక్కడ పూర్తిగా రాకపోకలు లేకుండా సక్సెస్ చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చురుక్కుమనాలన్నారు. రాకపోకలు అసలు లేకుండా చేయాలని ఆయన కోరారు. ‘‘మేం బస్సుల అద్దాలను పగులగొట్టం. శాంతియుతంగానే ఉద్యమిస్తాం. అప్పటికీ వినకుంటే ముఖ్యమంవూతిది, ప్రభుత్వంది ఖర్మ, నేనేమీ చేయలేను’’ అని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్‌ఎస్వీ ఇంచార్జీ, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్‌ఎస్వీ సెక్రటరీ జనరల్స్ గాదరి కిషోర్‌కుమార్, రాకేష్, వాసుదేవడ్డి, శ్రీనివాస్, వేణు, ప్రముఖ తెలంగాణ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు కళ్లెం యాదగిరిడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆరు తీర్మానాల ఆమోదం
ఈ సమావేశంలో ఆరు తీర్మానాలను ఆమోదించినట్లు టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్ తెలిపారు. అవి: 1) తెలంగాణ సాధన గమ్యాన్ని చేరుకునేందుకు పోరాడాలి, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు. 2) ప్రజావూపతినిధులంతా మళ్లీ రాజీనామాలు చేయాలి. 3) 14ఎఫ్‌ను రద్దుచేసేవరకు ఎస్‌ఐ, డిగ్రీ లెక్చరర్ల పరీక్షలను వాయిదా వేయాలి. 4) సకల జనుల సమ్మెను విజయవంతం చేయాలి. 5) ఫీజు రీఎంబర్స్‌మెంట్ అర్హులందరికీ వర్తింపజేయాలి. 6) ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల రద్దు కుట్రను విరమించుకొని హాస్టళ్లకు మరమ్మతులు జరిపి నిధులు విడుదల చేయాలి.
No comments:
Post a Comment