August 15, 1947 all India people were celebrating the Freedom of India. Andra People place in Madras State also got freedom and they were enjoying the celebration. But Telangana People were gone in to deep depretion feeling that they were not got the freedom. Andhra People not even think about the Telangana People.
After Freedom of India, Nizam ruling going very hard. Khasim Razwi razakars will harrasing the people, murdering, raping innocent women and robbing. Some people of Telangana migrated to Andhra. But their they have not get anything, even though they were robbed by the Andhra People also. But who migrated to other than andha place they were really got warm welcome and their people cooperation.
అగస్టు 15, 1947న దేశ ప్రజలంతా స్వాతంత్ర్య వేడుకల్లో మునిగిపోయారు. ఆంధ్రులు భాగంగా ఉన్న మద్రాసు రాష్ట్రానికి కూడా ఆంగ్లేయుల నుండి విముక్తి కలిగినందున వారు కూడా ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. కాని నిజాం నిరంకుశత్వం నుండి విముక్తి లభించనందున తెలంగాణ ప్రజలు మాత్రం నిరాశా నిస్పృహల్లో మునిగిపోయారు. స్వాతంత్ర్య సంబరాల్లో మునిగిపోయిన ఆంధ్రులు తెలంగాణ ప్రజల స్వేఛ్ఛా స్వాతంత్ర్యాల గురించి ఆలోచించలేదు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాకే నిజాం నిరంకుశత్వం మరింత పెరిగిపోయింది. తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య పోరాటాన్ని ఉక్కు పాదంతో అణిచివేయాలని నిర్ణయించడంతో ప్రజల కష్టాలు తారా స్థాయికి చేరుకున్నాయి. దానికి తోడు ఖాసి రజ్వీ నాయకత్వంలోని రజాకారులు దోపిడీలకు, హత్యాకాండలకు, అత్యాచారాలకు పాల్పడడంతో ప్రజలు దిక్కులేని పక్షులలాగా వలసవెళ్ళాల్సి వచ్చింది. ఆంధ్రా ప్రాంతాలకు వలసపోయిన తెలంగాణ ప్రజలకు కనీస మర్యాద దక్కకపోగా వారిని అందినకాడికి దోచుకోవడంలో ఆంధ్రులు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. నాగపూర్ లాంటి తెలుగేతర ప్రాంతాలకు వెళ్ళిన తెలంగాణ ప్రజలకు మాత్రం అపూర్వమైన ఆదరణ లభించింది.
No comments:
Post a Comment