Monday, 1 August 2011

delhi ki t_congress leaders payanam

పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతుండగా, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలతో రాజీనామాలు ఉపసంహరింపజేసేందుకు పార్టీ అధిష్ఠానం చివరి క్షణాల్లో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. శనివారం రాత్రి తెలంగాణ కాంగ్రెస్ ప్రజావూపతినిధుల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్లు కె.జానాడ్డి, కె.కేశవరావులతో మాట్లాడిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ ఆదివారం రెండు, మూడు సార్లు కేకేకు ఫోన్ చేసి రాజీనామాలపై ఒత్తిడి తీవ్రతరం చేశారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి చర్చలు కొనసాగిస్తున్నందున రాజీనామాలు ఉపసంహరించుకుంటున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో స్పీకర్‌కు లేఖలు ఇప్పించండని ఆజాద్ ఈ సందర్భంగా కోరినట్లు తెలిసింది.

అందుకు కేకే ససేమిరా అన్నారు. తెలంగాణపై సానుకూల ప్రకటన వచ్చేవరకు రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని, అలా చేస్తే ఆత్మహత్యగానే భావించాల్సి వస్తుందని కేకే స్పష్టం చేసినట్లు సమాచారం. రాజీనామాలు ఉపసంహరించుకోబోమని, తెలంగాణ సాధనే మా లక్ష్యమని కేకే తేల్చిచెప్పారు.
యాష్కీ నివాసంలో ఎంపీల భేటీ
ఆజాద్ నుంచి ఫోన్లు వచ్చిన నేపధ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ నివాసంలో సమావేశమై ఢిల్లీ పర్యటనలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించుకున్నారు. కేకేతో పాటు యాష్కీ, మందా జగన్నాథం, జి.వివేక్, పొన్నం ్ర పభాకర్, బలరాం నాయక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధిష్ఠానం నుంచి రాజీనామాలపై వస్తున్న ఒత్తిడి విషయంపై ప్రధానంగా చర్చించారు. సోమవారం ఆజాద్‌తో సమావేశమైనపుడు అనుసరించాల్సిన వ్యూహం, లోక్‌సభ స్పీకర్ వైఖరి వం ఆంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఈ భేటీ అనంతరం నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం మీడియాతో మాట్లాడుతూ, రాజీనామాలపై రాజీ లేదన్నారు. చిత్త శుద్ధితోనే తాము రాజీనామాలు చేశామని, ఎంపీలు అందరం ఒకే డిమాండ్‌తో, ఒకే లైన్‌తో ముందుకు పోతున్నామన్నారు.

తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వచ్చే దాకా తమ నిర్ణయంలో మార్పు ఉండదని తేల్చి చెప్పారు. లోక్‌సభ స్పీకర్ కూడా ఇప్పటి వరకు రాజీనామాలు చేసిన ఎంపీలతో సంప్రతింపులు జరుపలేదన్నారు. ఆజాద్‌తో కలిసిన తరువాతే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. రాష్ట్ర కాఁగ్రెస్ ఇన్‌చార్జీ ఆజాద్‌తో చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సోమవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. ఢిల్లీ వెళ్లగానే, కేకే నివాసంలో మరో దఫా ఎంపీలు భేటీ కానున్నారు. సోమవారం పార్లమెంటు తొలి రోజు కావడంతో లోక్‌సభ మధ్యాహ్నం లోగా వాయిదా పడనున్నది. ఆ తరువాత ఆజాద్‌తో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సమావేశం కానున్నారు. మూడు రోజుల క్రితం ఆజాద్ ఎంపీలకు ఫోన్ చేసి రాజీనామాల విషయం చర్చించేందుకు ఢిల్లీ రావాలని పిలిచారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం చర్చల ద్వారానే సాధ్యం. తెగేదాకా లాగితే ఫలితముండదు.రాజీనామాలు చేసిన మేము కేంద్రంతో సంప్రతింపులు జరుపుతూ సానుకూల నిర్ణయం రాబ కృషి చేస్తాం.

- జానారెడ్డి



కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు ఉపసంహరించుకుంటున్నట్లు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ ఇవ్వాలని గులాం నబీ ఆజాద్ నాకు రెండు మూడు సార్లు ఫోన్లు చేసి ఒత్తిడి చేశారు. రాజీనామాలపై మేం వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశాం.

- కేశవరావు



కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించేవరకు రాజీనామాలపై పునరాలోచించేది లేదు. రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా స్పందించనట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ మనుగడ కష్టసాధ్యం.

- గుత్తా సుఖేందర్ రెడ్డి

No comments:

Post a Comment