Tuesday, 30 August 2011

rajinamalu cheddam siddamena jhana reddy(రాజీనామాలు చేద్దం సిద్ధమా.. జానా!)

రాజీనామాలు చేద్దం సిద్ధమా.. జానా!

-పార్టీలు, జెండాలు వదిలి ఏకమై పోరాడుదాం

-అందరం కలిసి రాజ్యాంగ సంక్షోభం సృష్టిద్దాం

-ఉపఎన్నికలొస్తే ఉమ్మడి గుర్తుపై పోటీచేద్దాం లేదా తెలంగాణ వచ్చేదాకా ఎన్నికలు బహిష్కరిద్దాం

-తెలుగుదేశం పార్టీ టీ ఫోరం ప్రతిపాదనలు

-టీడీపీ సూచనలను తోసిపుచ్చిన జానా

-రాజ్యాంగ సంక్షోభానికి రాజీనామాలు చేయం

-ప్రజల ఆకాంక్ష మేరకే చేస్తాం, చర్చించి నిర్ణయం తీసుకుంటాం

-కోదండరాంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామన్న మోత్కుపల్లి

-మీడియాపై టీడీపీ టీ ఫోరం ఆగ్రహం




కోసం జెండాలు, ఎజెండాలు వదలిపెట్టి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టిద్దామని టీడీపీ టీ ఫోరం మంగళవారం టీ కాంగ్రెస్‌కు సూచించింది. ఈ మేరకు ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు మోత్కుపల్లి నర్సింహులు, మహేందర్‌డ్డి, జైపాల్‌యాదవ్, గంపగోవర్ధన్, హన్మంత్‌షిండే, వేనేపల్లి చందర్‌రావు తెలంగాణ కాంగ్రెస్ సారధ్య సంఘం కన్వీనర్ మంత్రి జానాడ్డిని ఆయన ఇంట్లో కలిసి చర్చించారు. చర్చల్లో మంత్రి జానాడ్డితోపాటు ఎంపీ బలరాంనాయక్ కూడా పాల్గొన్నారు. రాజ్యాంగ సంక్షోభం కోసం రాజీనామాలు చేద్దామని ఫోరం ఎమ్మెల్యేలు సూచించగా తాము రాజ్యాంగ సంక్షోభానికి వ్యతిరేకమని జానాడ్డి అన్నట్లు సమాచారం. తాము ప్రజల ఆకాంక్ష మేరకే రాజీనామాలు చేస్తామని, దీనిపై సారధ్యసంఘం సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలిసింది. రాజీనామాలపై మీరే చొరవ తీసుకోవాలని కూడా జానాడ్డిని టీ ఫోరం నేతలు మరోసారి కోరారు. మంత్రి జానాడ్డితో గంటసేపు సమావేశం కొనసాగింది. అనంతరం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోసం అన్ని పార్టీలు, సంస్థలు జెండాలు వదిలేసి తెలంగాణ ఒక్కటే ఏకైక ఎజెండాగా కలిసి రావాలని కోరారు.



రాజకీయ సంక్షోభం ద్వారానే తెలంగాణ సాధ్యమని స్పష్టం చేశారు. రాజ్యాంగసంక్షోభం సృష్టించి తద్వారా తెలంగాణ సాధించేందుకు 33మంది ఎమ్మెల్యేలమందరం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమ పార్టీవారు మాత్రమే రాజీనామాలు చేస్తే ఉపఎన్నికలు వస్తాయి కానీ తెలంగాణ రాదని అన్నారు. ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా లేమన్నారు. అందరం కలిసి రాజీనామాలు చేద్దామని, అప్పుడు ఉపఎన్నికలు వస్తే పార్టీలు వదలి ఉమ్మడి గుర్తుపై పోటీ చేద్దామన్నారు. లేదా తెలంగాణ వచ్చేవరకు ఎన్నికలు బహిష్కరిద్దామని తెలిపారు. తెలంగాణ విషయంలో దోబూచులాడుతున్న కేంద్రానికి బుద్ది రావాలంటే మూకుమ్మడి రాజీనామాలు చేయాల్సిందేనని ఎర్రబెల్లి అన్నారు. గత నెల 4వ తేదీన చేసిన రాజీనామాలతో కేంద్రం దిగివచ్చిందని, కేంద్రాన్ని ఒప్పించేందుకు తెలంగాణలోని ప్రజావూపతినిధులంతా మరోసారి రాజీనామాలు చేసి తెలంగాణను సాధించుకోవాలన్నారు.



తెలంగాణ ప్రజావూపతినిధులందరితో రౌండ్ సమావేశం నిర్వహించాలని జానాడ్డిని కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని ఎర్రబెల్లి తెలిపారు.



కోదండరాం... మాటలు జాగ్రత్త:మోత్కుపల్లి

తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు సభాహక్కుల ఉలంఘన కింద నోటీసు పంపనున్నట్లు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. నీవు అన్నా హజారే అంత గొప్పవాడివి కావని వ్యాఖ్యానించారు. హజారే బృందంలోనివారే పార్లమెంటు సభ్యులకు క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. ప్రొఫెసర్ కోదండరాం ప్రజావూపతినిధుల పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావూపతినిధుల గురించి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.



మీడియాపై అసహనం

మంత్రి జానాడ్డి నివాసంలో ఆయనతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ నేతలు విలేకరులు ప్రశ్నిస్తే మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేల ఫోరం చైర్మన్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొందరు ఎమ్మెల్యేలు ప్రశ్నలను జీర్ణించుకోలేక సరైన సమాధానం చెప్పలేక అసహనం వ్యక్తం చేశారు. మీ పార్టీ రెండు కళ్ల సిద్ధాంతంతో ఉన్నది కదా? మీకు క్లారిటీ ఎలా ఉంది? మీరు రాజీనామాలు చేయాలని ఎలా అడుగుతారు? మీరు రాజీనామాలు చేసి వచ్చి అడుగుతే బాగుంటుంది కదా? అన్న ప్రశ్నలు వారికి మింగుడుపడలేదు. సమాధానం చెప్పలేక అనవసర ప్రశ్నలు అడిగి ఇబ్బందులకు గురిచేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment