-పార్టీలు, జెండాలు వదిలి ఏకమై పోరాడుదాం
-అందరం కలిసి రాజ్యాంగ సంక్షోభం సృష్టిద్దాం
-ఉపఎన్నికలొస్తే ఉమ్మడి గుర్తుపై పోటీచేద్దాం లేదా తెలంగాణ వచ్చేదాకా ఎన్నికలు బహిష్కరిద్దాం
-తెలుగుదేశం పార్టీ టీ ఫోరం ప్రతిపాదనలు
-టీడీపీ సూచనలను తోసిపుచ్చిన జానా
-రాజ్యాంగ సంక్షోభానికి రాజీనామాలు చేయం
-ప్రజల ఆకాంక్ష మేరకే చేస్తాం, చర్చించి నిర్ణయం తీసుకుంటాం
-కోదండరాంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామన్న మోత్కుపల్లి
-మీడియాపై టీడీపీ టీ ఫోరం ఆగ్రహం
కోసం జెండాలు, ఎజెండాలు వదలిపెట్టి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టిద్దామని టీడీపీ టీ ఫోరం మంగళవారం టీ కాంగ్రెస్‌కు సూచించింది. ఈ మేరకు ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు మోత్కుపల్లి నర్సింహులు, మహేందర్‌డ్డి, జైపాల్‌యాదవ్, గంపగోవర్ధన్, హన్మంత్‌షిండే, వేనేపల్లి చందర్‌రావు తెలంగాణ కాంగ్రెస్ సారధ్య సంఘం కన్వీనర్ మంత్రి జానాడ్డిని ఆయన ఇంట్లో కలిసి చర్చించారు. చర్చల్లో మంత్రి జానాడ్డితోపాటు ఎంపీ బలరాంనాయక్ కూడా పాల్గొన్నారు. రాజ్యాంగ సంక్షోభం కోసం రాజీనామాలు చేద్దామని ఫోరం ఎమ్మెల్యేలు సూచించగా తాము రాజ్యాంగ సంక్షోభానికి వ్యతిరేకమని జానాడ్డి అన్నట్లు సమాచారం. తాము ప్రజల ఆకాంక్ష మేరకే రాజీనామాలు చేస్తామని, దీనిపై సారధ్యసంఘం సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలిసింది. రాజీనామాలపై మీరే చొరవ తీసుకోవాలని కూడా జానాడ్డిని టీ ఫోరం నేతలు మరోసారి కోరారు. మంత్రి జానాడ్డితో గంటసేపు సమావేశం కొనసాగింది. అనంతరం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోసం అన్ని పార్టీలు, సంస్థలు జెండాలు వదిలేసి తెలంగాణ ఒక్కటే ఏకైక ఎజెండాగా కలిసి రావాలని కోరారు.
రాజకీయ సంక్షోభం ద్వారానే తెలంగాణ సాధ్యమని స్పష్టం చేశారు. రాజ్యాంగసంక్షోభం సృష్టించి తద్వారా తెలంగాణ సాధించేందుకు 33మంది ఎమ్మెల్యేలమందరం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమ పార్టీవారు మాత్రమే రాజీనామాలు చేస్తే ఉపఎన్నికలు వస్తాయి కానీ తెలంగాణ రాదని అన్నారు. ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా లేమన్నారు. అందరం కలిసి రాజీనామాలు చేద్దామని, అప్పుడు ఉపఎన్నికలు వస్తే పార్టీలు వదలి ఉమ్మడి గుర్తుపై పోటీ చేద్దామన్నారు. లేదా తెలంగాణ వచ్చేవరకు ఎన్నికలు బహిష్కరిద్దామని తెలిపారు. తెలంగాణ విషయంలో దోబూచులాడుతున్న కేంద్రానికి బుద్ది రావాలంటే మూకుమ్మడి రాజీనామాలు చేయాల్సిందేనని ఎర్రబెల్లి అన్నారు. గత నెల 4వ తేదీన చేసిన రాజీనామాలతో కేంద్రం దిగివచ్చిందని, కేంద్రాన్ని ఒప్పించేందుకు తెలంగాణలోని ప్రజావూపతినిధులంతా మరోసారి రాజీనామాలు చేసి తెలంగాణను సాధించుకోవాలన్నారు.
తెలంగాణ ప్రజావూపతినిధులందరితో రౌండ్ సమావేశం నిర్వహించాలని జానాడ్డిని కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని ఎర్రబెల్లి తెలిపారు.
కోదండరాం... మాటలు జాగ్రత్త:మోత్కుపల్లి
తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు సభాహక్కుల ఉలంఘన కింద నోటీసు పంపనున్నట్లు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. నీవు అన్నా హజారే అంత గొప్పవాడివి కావని వ్యాఖ్యానించారు. హజారే బృందంలోనివారే పార్లమెంటు సభ్యులకు క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. ప్రొఫెసర్ కోదండరాం ప్రజావూపతినిధుల పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావూపతినిధుల గురించి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మీడియాపై అసహనం
మంత్రి జానాడ్డి నివాసంలో ఆయనతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ నేతలు విలేకరులు ప్రశ్నిస్తే మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేల ఫోరం చైర్మన్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొందరు ఎమ్మెల్యేలు ప్రశ్నలను జీర్ణించుకోలేక సరైన సమాధానం చెప్పలేక అసహనం వ్యక్తం చేశారు. మీ పార్టీ రెండు కళ్ల సిద్ధాంతంతో ఉన్నది కదా? మీకు క్లారిటీ ఎలా ఉంది? మీరు రాజీనామాలు చేయాలని ఎలా అడుగుతారు? మీరు రాజీనామాలు చేసి వచ్చి అడుగుతే బాగుంటుంది కదా? అన్న ప్రశ్నలు వారికి మింగుడుపడలేదు. సమాధానం చెప్పలేక అనవసర ప్రశ్నలు అడిగి ఇబ్బందులకు గురిచేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tuesday, 30 August 2011
rajinamalu cheddam siddamena jhana reddy(రాజీనామాలు చేద్దం సిద్ధమా.. జానా!)
balithanaloddu bathiki sadiddam(బలిదానాలొద్దు..బతికి సాధిద్దాం!)
రంది పడాల్సిన సమయం కాదిది... రణం చేయాల్సిన తరుణం! తెలంగాణ సాధనకు చోదక శక్తి బేలతనపు చావు కాదు. ఎంతమావూతమూ ఆ అవసరం లేదు. కావలసింది తెగించి చేసే ధీరోదాత్త పోరాటమే! ఈ మహత్తర పోరాటంలో పరాక్షికమ సమరవీరులు మీరు! అగ్రగామి దళాలు మీరు! నెత్తురు మండే శక్తులు నిండే ముందు యుగం దూతలు మీరు! మీరు లేనిదే ఉద్యమం లేదు.. మీరు లేనిదే ఉద్యమం ఉండదు! మీరు లేనిదే తెలంగాణ పోరు లేదు! మీ పోరు లేనిదే ఉజ్వల భావి తెలంగాణ ఊహించనేలేము! తెలంగాణ కోసం ఈ పోరాటం. దగా పడిన తెలంగాణ యాచక స్థాయి నుంచి శాసక స్థాయికి ఎదిగేందుకే ఈ ఆరాటం! ‘ఎట్లొస్తది తెలంగాణ’ అన్నకాణ్నుంచి ‘ఎట్లెట్లరాదు తెలంగాణ’ అని బరిగీసి నిలిచే కాలం ఇది! నాలుగు కోట్ల ఆకాంక్షలు ఓ వైపు.. గుప్పెడు మంది స్వార్థపర శక్తులు మరోవైపు! వాళ్లూ దిక్కుతోచని స్థితికి రాక తప్పదు. అబద్ధాలు పటాపంచలవుతున్నాయి. తెలంగాణను అడ్డుకుంటున్న కపట సమైక్యవాదపు ఆర్థిక ప్రయోజన ముసుగులు తొలగిపోతున్నాయి. వారి వద్ద ఇప్పుడు పటిష్టమైన వాదనలు లేవు.. పేలవమైన అడ్డగోలు వాదనలే ఉన్నాయి.
గట్టి కారణాలులేవు.. ఓటి మోతలే వారి వద్ద మిగిలాయి. మొన్నటికి మొన్న లోక్‌సభలో మూగబోయిన సమైక్యవాదమే ఇందుకు సాక్షి. చెప్పేందుకు మాటల్లేక.. వాదనతో కాక.. బలవంతంగా నోరు మూయించేందుకు సీమాంవూధనేతలు తెగబడటమే ప్రతీక! అవును... శత్రువు ఓడిపోతున్న తరుణమిది! మహత్తర తెలంగాణ ఉద్యమ చైతన్యం ముందు క్రమక్షికమంగా మోకరిల్లుతున్న సమయమిది! వారిది ఆరిపోయే ముందటి వెలుగు! ఉదయమెంతో లేదు దూరము.. తొలగిపోవునంధకారము..!! కలత వద్దు.. విజయం మనదే! ఈ దశలో మరణం అస్త్రసన్యాసమే! ఈ దశలో అస్త్ర సన్యాసం ఓటమిని ఒప్పుకోవడమే! ఈ దశలో ఓటమిని ఒప్పుకోవడం తెలంగాణను ఒద్దనుకోవడమే! వద్దు.. ఓటమిని ఒప్పుకోవద్దు. పోరు దారి పూల బాట కాదు.. కష్టాల్ నష్టాల్ శాపాల్ రానీ.. ఎదుర్కొందాం. తిప్పి కొడదాం. నిజమే బలిదానం శంకించదగింది కాదు.
పైగా వెల లేనిదే! కానీ.. బతికుండి చేసే పోరాటం మరింత విలువైనది.. వ్యక్తిని శక్తిని చేసేది! బలిదాన స్ఫూర్తి తెలంగాణకు కొదవలేదు. 600 మందికి పైగా అమరవీరులు ఉద్యమాన్ని నిత్యజ్వలితం చేస్తున్నారు! ఆ సెగల పొగలు కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కానీ.. ఆత్మత్యాగం కానే కాదు మార్గం. వీధుల్లో పోరాటాలు నడుస్తున్నాయి. అదే మనదారి. ఇక చావులు వద్దు. ఎవరూ చావొద్దు. ఇప్పుడు ఉద్యమానికి కావాల్సింది ఆత్మహత్యలు కాదు.. ఆత్మబలంతో కొట్లాడే సైన్యం! మీరు చనిపోవడం కాదు.. తెలంగాణలో ఉద్యమం చనిపోకుండా చూడండి! ప్రాణాలు వదలొద్దు.. పోరాటం వదలొద్దు. భావితరం దూతలు. ప్రపంచాన్ని నవ యవ్వన తేజంతో వెలిగించే దివ్వెలు మీరే. తెలంగాణ మీ కోసమే. నెత్తురు మండే శక్తులు నిండే మీలాంటి వాళ్లకోసమే. తెలంగాణ మీది.
సాధించాల్సింది తెలంగాణను. కలెబడుదాం. కొట్లాడుదాం. మన వెంట న్యాయం ధర్మం, రాజ్యాంగ బలం ఉన్నాయి. నీతి నియమాలు, విలువలు తెలంగాణ ఉద్యమంతో ఉన్నాయి. అంతిమంగా న్యాయం గెలుస్తుంది. తెలంగాణ రాక తప్పదు. ప్రపంచంలో ఏ శక్తీ దాన్ని నిలువరించలేదు. పోరాడుదాం.. పోరాడుదాం.. తెలంగాణ వచ్చేదాకా.. బతికి సాధిద్దాం....
.... యావత్ తెలంగాణ యువ సైన్యానికి
నమస్తే తెలంగాణ చేతుపూత్తి చేస్తున్న విజ్ఞప్తి ఇది!
బలిదానాలు వద్దు. పోరాడి తెలంగాణ తెచ్చుకుందాం.
‘‘తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా నాకు సోదర సమానమైన యువతను నేను వేడుకొంటున్నా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చనిపోవద్దు. తెలంగాణ ఆకాంక్ష సాకారమయ్యేరోజును చూడటానికి బతికి ఉండండి. ఆత్మహత్యలు చేసుకోవడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి నష్టం చేయకండి. మరొక్క ఆత్మహత్య జరిగినా.. నేను తెలంగాణ ఉద్యమం నుంచి ఉపసంహరించుకుంటాను’’
- ట్విటర్‌లో సుష్మాస్వరాజ్ సందేశం
number 1(one)Villain (విలన్) rosaiah
-తెలంగాణకు అప్పుడు అడ్డం పొడుగూ రోశయ్యే
-తెలంగాణను అడ్డుకున్న కుటిల చాణక్యం
- చంద్రబాబుతో కలిసి కుట్ర రచన
- భూతద్దంలో సీమాంధ్ర కృత్రిమ ఉద్యమం
- కేంద్రానికి తప్పుడు నివేదికలు
- ఆర్టీఐ ద్వారా నమస్తే తెలంగాణకు కాపీలు
- బాబు డైరెక్షన్‌లో రాజీనామాల డ్రామా
- స్పీకర్ ఫార్మాట్‌కు భిన్నంగా లేఖల సమర్పణ
- ఆమోదం పొందే అవకాశమే లేదు
- అయినా గగ్గోపూత్తించిన రోశయ్య సర్కార్
- తీర్మానం కోసం కేంద్రం ఆదేశాలు బేఖాతర్
- నెగ్గే అవకాశాలు లేవంటూ విస్మరణ
- తెలంగాణ బలిదానాలు పట్టించుకోని కేంద్రం
- డిసెంబర్ 9 ప్రకటన నుంచి వెనుకడుగు
- అన్నింటా తానై నడిపిన కొణిజేటి
నెంబర్ వన్ విలన్ అప్పటి ముఖ్యమంత్రి.. కాబోయే తమిళనాడు గవర్నర్ రోశయ్యే! సీమాంధ్ర కపట సమైక్యవాదులతో కలిసి రోశయ్యే చేసిన అన్యాయమే తెలంగాణ రాష్ట్ర పాలిట శాపమైంది. డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం.. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా రాష్ట్రాన్ని ఆదేశించింది. ఆ ఆదేశాన్ని ముఖ్యమంవూతిగా ఉన్న రోశయ్య అప్పట్లో తిరస్కరించారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సభలో తీర్మానం నెగ్గే అవకాశాల్లేవన్న రోశయ్య.. అందుకే ప్రవేశపెట్టలేదని చెప్పారు. తెలంగాణ అంకురాన్ని అప్పుడే తుంచారు. ఉద్యమం వేర్లు కూడా పెరికేందుకు దాడిని మరింత ఉధృతం చేస్తూ.. కేంద్రానికి వరుస నివేదికలు పంపారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నామని కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించిన రోజునే రోశయ్య ఢిల్లీ విమానాక్షిశయంలోనే చంద్రబాబునాయుడుతో 45 నిమిషాలపాటు మాట్లాడారు. అప్పుడే తెలంగాణను అడ్డుకునే కుట్రకు బీజం పడింది. ఒకవైపు ముఖ్యమంవూతిగా ఉన్న రోశయ్య తన పదవిని అడ్డం పెట్టుకుని సీమాంధ్ర ప్రాంతాల్లో జరిగిన కృత్రిమ ఉద్యమాన్ని మహోద్యమంగా చిత్రీకరిస్తూ కేంద్రానికి నివేదికలు పంపితే... మరోవైపు చంద్రబాబునాయుడు తన పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులతో రాజీనామా డ్రామాలు మొదలుపెట్టించారు. అప్పట్లో సీమాంధ్ర ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలకు సంబంధించి మీడియాలో ప్రసారమైన సన్నివేశాల్ని చూస్తేనే అవి కృత్రిమంగా నడిచిన కార్యక్షికమాలని స్పష్టమవుతుంది.
రాజీనామాల పేరిట సీమాంధ్ర ప్రజావూపతినిధులు ఒట్టి డ్రామానే చేశారన్నదానికి సరైన ఫార్మాట్‌లో వాళ్లు రాజీనామాలు చేయకపోవటమే నిలు నిదర్శనం. అయినా, కేంద్ర ప్రభుత్వం రోశయ్య తప్పుడు నివేదికలకు, చంద్రబాబు డైరెక్షన్‌లో సీమాంధ్ర నేతలు ఆడిన రాజీనామాల డ్రామాలకు తలొగ్గింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టామన్న ప్రకటన నుంచి చిదంబరం యూ టర్న్ తీసుకున్నారు.
అఖిలపక్షం ఓకే అన్నా..: డిసెంబర్ 9 ప్రకటనకు ముందు రోజు రాష్ట్ర రాజధానిలో అఖిలపక్ష సమావేశం జరిగింది. సీపీఎం మినహా అన్ని పార్టీలూ తెలంగాణకు సై అన్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై అసెంబ్లీలో తీర్మానం పెడితే మద్దతు ఇస్తామని దాదాపు అన్ని పార్టీలూ హామీ ఇచ్చాయి.
మజ్లిస్ తటస్థ వైఖరిని తీసుకుంది. ఓవైపు రాష్ట్ర సాధన కోసం దీక్ష చేస్తున్న కేసీఆర్ ఆరోగ్యం విషమిస్తుండటం.. మరోవైపు అన్ని పార్టీల సమావేశంలో ఏకాభివూపాయం వ్యక్తం కావడంతో డిసెంబరు 9న రాత్రి 11.35గంటలకు కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ఢిల్లీలో ప్రకటించారు. తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. కానీ.. రోశయ్య మాత్రం తన సీమాంధ్ర కుటిలనీతిని ప్రదర్శించారు. సమైక్య విద్రోహాన్ని అమలు చేశారు. అదే రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రోశయ్యను విమానాక్షిశయంలో మీడియా ప్రతినిధులు చిదంబరం ప్రకటన గురించి అడిగారు. దానికి రోశయ్య కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన గురించి తనకేమాత్రం తెలియదని చెప్పారు. అప్పటి నుంచే తెలంగాణను అడ్డుకోవటానికి పావులు కదలపటం మొదలుపెట్టారు. కేంద్రం ఆదేశాలను ఖాతరు చేయకుండా.. తీర్మానం పెడితే నెగ్గదన్న వాదన తీసుకొచ్చి.. అసలా ఊసే లేకుండా చేశారు.
కేంద్రానికి తప్పుడు నివేదికలు మొదలు..
డిసెంబరు 19న రోశయ్య కేంద్ర హోంమంత్రి చిదంబరానికి రాష్ట్రంలోని పరిణామాల నివేదికను పంపించారు. స్వప్రయోజనాల కోసం లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావులాంటి కొందరు సృష్టించిన కృత్రిమ ఉద్యమాన్ని భూతద్దంలో పెట్టి చూపించారు. తెలంగాణపై కేంద్ర మంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు నిరసనగా 2009 డిసెంబరు 18, 19 తేదీల్లో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగిందని నివేదికలో పేర్కొన్నారు.
వాస్తవానికి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జరిగిన రాస్తారోకోలు, ధర్నాలు, ఇతర ఆందోళన కార్యక్షికమాల్లో పట్టుమని యాభైమంది కూడా లేకున్నా.. 2.25 లక్షలమంది నిరసనల్లో పాల్గొన్నారంటూ (అంత కచ్చితంగా ఎలా లెక్కపెట్టారో ఆ రోశయ్యకే తెలియాలి) నివేదికలో వివరించారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 1,141 ఆందోళన కార్యక్షికమాలు జరిగాయని, వీటిలో ర్యాలీలు, ధర్నాలు, ఆమరణ నిరాహారదీక్షలు, రైల్‌రోకోలు, రాస్తారోకో తదితర కార్యక్షికమాలు ఉన్నాయని నివేదించారు. ముప్పయిచోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయని, వీటిల్లో ప్రభుత్వ, ప్రజా ఆస్తుల విధ్వంసం జరిగిందంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో రెండు రోజులపాటు బంద్ జరిగిందని, తూర్పుగోదావరి జిల్లాతోపాటు చిత్తూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 19న బంద్ జరిగిందని నివేదికలో తెలిపారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన సీమాంవూధలో అల్లకల్లోలం సృష్టించిందని సీన్ క్రియేట్ చేశారు.
దుష్టచతుష్టయం
అధికారపక్షంతో విపక్షం కుమ్మక్కయింది! చంద్రబాబు నాయుడు.. లగడపాటి రాజగోపాల్.. కావూరి సాంబశివరావు.. రాయపాటి సాంబశివరావు.. సకల తెలంగాణ వ్యతిరేకులంతా పొడిచిన పొద్దును.. చిదిమేసేందుకు వంచన పంచన చేరారు! ముందు రోజు అసెంబ్లీలో చేసిన తీర్మానాలు గాలికి కొట్టుకుపోయాయి. దొంగ రాజీనామాల డ్రామాలకు తెర లేచింది. రాష్ట్రం రాజకీయ సంక్షోభంలోకి వెళ్లిపోయిందంటూ సీమాంధ్ర చానళ్లు గగ్గోలు పెట్టాయి! మరుసటి రోజు నుంచే సీమాంధ్రలో కృత్రిమ ఆందోళనలు మొదలయ్యాయి! ప్రేరేపిత ఉద్యమాలకు ప్రాణం వచ్చింది! అక్కడి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రల అధ్యాయం పుటలు తెరుచుకుంది!!
లగడపాటి నిరాహారదీక్ష డ్రామా గురించి...
ఇక, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తోపాటు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కొందరు నాయకులు ఆమరణ నిరాహారదీక్షలు కూడా మొదలుపెట్టారని రోశయ్య కేంద్రానికి పంపిన త నివేదికలో తెలిపారు. లగడపాటి రాజగోపాల్, దేవినేని ఉమామహేశ్వరరావు, వై.ఎస్.వివేకానందడ్డిలను ఆస్పవూతులకు తరలించామని వివరించారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఆమరణ నిరాహారదీక్ష అంటూ డిసెంబరు 14న విజయవాడలో హల్‌చల్ చేసిన లగడపాటి రాజగోపాల్ దీక్ష మూడో రోజు కూడా చేరకముందే అనారోగ్యం పేరుతో ఆస్పవూతిలో చేరారు. ఆ తరువాత డిసెంబరు 20న రాత్రి 10గంటలకు హాస్పిటల్ నుంచి తప్పించుకుని నాటకీయఫక్కీలో హైదరాబాద్ చేరుకున్నారు.
నిమ్స్ ఆస్పత్రి లోపలికి పరుగులు తీస్తూ మీడియా కంట చిక్కారు. ఆమరణ నిరాహారదీక్ష చేసి అనారోగ్యానికి గురైన లగడపాటి రాజగోపాల్ ట్రాక్‌సూట్‌లో అథ్లెట్‌లా పరుగెత్తిన దృశ్యాలు చూసి అసలు విషయం అందరికీ అవగతమైంది. తాను నిరాహార దీక్ష ఎప్పుడో విరమించానని స్వయంగా రాజగోపాలే చెప్పుకున్నారు. మరో వింతేమిటంటే దేవినేని ఉమామహేశ్వరరావు, వై.ఎస్.వివేకానందడ్డిలు చికిత్స తీసుకోవటానికి నిరాకరించారని... ఆస్పవూతుల్లో దీక్షలు కొనసాగించారని రోశయ్య తన నివేదికలో పేర్కొన్నారు. కడప జిల్లాల్లో 48గంటలపాటు బంద్ జరిగిందని, చిత్తూరులో 24గంటలపాటు బంద్ జరిగిందని వివరిస్తూ నిరసనకారులు బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్‌ఛేంజ్, తహసీల్దార్ కార్యాలయం, ఆర్‌అండ్‌బీ అతిథిగృహం, ఓ ప్రభుత్వ జీపును వివేకానందడ్డి అనుచరులు ధ్వంసం చేశారని నివేదికలో వివరించారు. డిసెంబరు 19న కడప జిల్లాలో రైల్‌రోకోలు జరిగాయని, కృష్ణా జిల్లాలో రాస్తారోకోలు జరిగాయని పేర్కొన్నారు.
పోటీగా...
తెలంగాణపై కేంద్ర సానుకూలంగా ప్రకటన చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవటంతోపాటు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు డిసెంబరు 20న సభను నిర్వహించాలని నిర్ణయించారని, దీనికి రెండులక్షల జనాన్ని సమీకరించే ఏర్పాట్లు చేస్తున్నారని రోశయ్య తన నివేదికలో తెలిపారు. దీనికి పోటీగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు డిసెంబరు 21, 22 తేదీల్లో తమ తమ పదవులకు రాజీనామాలు ఇచ్చే విషయమై చర్చించేందుకు సమావేశం పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. ఇక, డిసెంబరు 20నే టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ భవన్‌లో 21వ తేదీ నుంచి ప్రారంభించాలనుకున్న బస్సు యాత్ర గురించి పొలిట్‌బ్యూరో మీటింగ్‌ను పెట్టుకున్నట్టుగా తెలిపారు.
డిసెంబరు 20నాటి...
ఇక, డిసెంబరు 20నాటి పరిణామాలపై రోశయ్య మరో నివేదికను చిదంబరానికి పంపిస్తూ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తెలంగాణపై వచ్చిన ప్రకటనకు వ్యతిరేకంగా నిరసనలు, హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 670 నిరసన కార్యక్షికమాలు జరిగాయని, వీటిల్లో ర్యాలీలు, ధర్నాలు, ఆమరణ నిరాహారదీక్షలు, రైల్‌రోకోలు, రాస్తారోకోలు ఉన్నాయన్నారు. ఈ ఆందోళనల్లో 86వేలమంది (మరోసారి ఇంత కచ్చితంగా నిరసనకారులను ఎలా లెక్కబెట్టారో?) పాల్గొన్నారని వివరించారు.
ఒక్క కడప జిల్లాలోనే 22 హింసాత్మక సంఘటనలు జరిగాయని తెలిపారు. నిరసనకారులు పులి నాలుగు లారీలు, రెండు జీపులకు నిప్పు పెట్టారని, కడప జిల్లాలోని లింగాల ప్రాంతంలో ఎయిర్‌టెల్, టాటా ఇండికాం, బీఎస్‌ఎన్‌ఎల్ సెల్‌టవర్లను కూడా దహనం చేశారని పేర్కొన్నారు. ఇదంతా వై.ఎస్.వివేకానందడ్డిని ఆస్పవూతికి తరలించటం వల్ల జరిగిందని, ఈ సంఘటనల్లో 7కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగిందని వివరించారు. దాంతోపాటు కడప, చిత్తూరు జిల్లాల్లో 72గంటలపాటు బంద్ జరిగిందని తెలిపారు. కృష్ణ, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా బంద్ జరిగిందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మందా జగన్నాథం, మధుయాష్కి, వీ హనుమంతరావు, కే రాజగోపాల్‌డ్డి, నంది ఎల్లయ్య, గుత్తా సుఖేందర్‌డ్డి, రాజయ్య, పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్‌లు సమావేశమయ్యారని తెలిపారు.
పన్నులు చెల్లించవద్దంటూ...
ఇక, కృష్ణా జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ సమైక్యాంధ్ర డిమాండ్‌తో టోల్‌టాక్స్ చెల్లించవద్దంటూ పిలుపునిచ్చిందని రోశయ్య నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు నిజామాబాద్‌లోని తెలంగాణ వర్సిటీ విద్యార్థి జేఏసీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు పన్నులు చెల్లించవద్దంటూ పిలుపునిచ్చారని తెలిపారు. ఈ నివేదికలు డిసెంబర్ 19 - 21తేదీల మధ్య చిదంబరానికి అందాయి. ఆ తర్వాత రెండు రోజులకే కేంద్రం తెలంగాణ ఏర్పాటుపై ఇచ్చిన ప్రకటనను వెనక్కు తీసుకుంది. మళ్లీ డిసెంబర్ 23వ తేదీన రాత్రిపూట విలేకరుల ముందుకొచ్చిన చిదంబరం.. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారాయని, దీనిపై రాజకీయ పార్టీల మధ్య తీవ్ర భేదాభివూపాయాలు వచ్చాయని సెలవిచ్చారు. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలతో విస్తృత స్థాయి చర్చలు ప్రారంభిస్తామంటూ నీళ్లు చల్లారు. తెలంగాణను అడ్డుకున్న సూత్రధారి రోశయ్య... అనంతరం కాలంలో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. కేంద్రం పట్ల అతి విధేయత కనబరుస్తూ ఇప్పుడు తమిళనాడు రాజ్‌భవన్‌లో విశ్రాంతికి వెళుతున్నారు!!
Tuesday, 16 August 2011
telangana Pictures, telangana Wallpapers,telangana Pics, Photos
telangana Pictures, telangana Wallpapers,telangana Pics, Photos1
telangana Pictures, telangana Wallpapers,telangana Pics, Photos2
telangana Images, News, Photographs, Cartoons, Illustrations
telangana Images, News, Photographs, Cartoons, Illustrations1
Saturday, 6 August 2011
pratheyaka telangana ni chandrababu naidu addukunnadu(ప్రత్యేక తెలంగాణను చంద్రబాబు అడ్డుకున్నారు):survey
ఆనాడే తెలంగాణ ఇచ్చి ఉంటే ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలపటం అభినందనీయమన్నారు. యూపీఏ సర్కారు ద్వారా కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. కేంద్రం నుంచి తప్పుడు ప్రకటనలు రావటం వల్లే ఆత్మబలిదానాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ‘‘తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఒక వేళ నేను కూడా రాజీనామా ఇస్తే.. నాసోదరుడు (పక్కనే ఉన్న అంజన్‌కుమార్ యాదవ్‌ను చూపిస్తూ) కూడా రాజీనామా చేస్తే తెలంగాణపై పార్లమెంటులో మాట్లాడేందుకు ఎవరూ ఉండరు’’ అంటూ తను రాజీనామా చేయకపోవటానికి కారణం చెప్పారు.
స్వరాజ్యం నా జన్మహక్కు అని చాటిచెప్పిన బాలగంగాధర్‌తిలక్ స్ఫూర్తిగా ముందుకు వెళ్తానని సర్వే చెప్పారు. ‘‘తెలంగాణ వాలే జాగో.. ఆంధ్రా వాలే భాగో’ అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీది ‘భాగో’ నినాదం కాదు. ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఉండవచ్చు. ఆత్మగౌరవం, స్వయంపాలన కోసం ప్రత్యేక తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని వివరించారు. యూపీ కాంగ్రెస్ కమిటీ చేసిన రెండో ఎస్సార్సీ తీర్మానాన్ని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు ఆపాదించారని సర్వే ఆరోపించారు. రెండో ఎస్సార్సీ వేస్తారని, ఇక తెలంగాణ రాదని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ప్రచారం చేశారని విమర్శించారు.
telangana pi billu pedithe maddatistham( హోం > న్యూస్ హోం > జాతీయం click here బిల్లు పెడితే మద్దతిస్తాం)
అయినా విపక్ష బాధ్యతగా దాన్ని ప్రస్తావిస్తున్నా
శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంపై గోప్యతెందుకు?
‘డిసెంబర్ 9’ ప్రకటనకు కేంద్రం కట్టుబడాల్సిందే
యాదిరెడ్డి ఆత్మహత్యను ప్రస్తావించి..
సూసైడ్ నోట్‌ను లోక్‌సభలో చదివిన సుష్మ
తెలంగాణ కోసం బలిదానాలొద్దంటూ తెలుగులో విజ్ఞప్తి
పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే బీజేపీ మద్దతిస్తుందని లోక్‌సభలో విపక్ష నేత సుష్మా స్వరాజ్ పునరుద్ఘాటించారు. ‘‘ఈ విషయంలో సంప్రదింపులు చాలా అయ్యాయి. ఇకనైనా బిల్లుపెట్టాలి. మూడింట రెండొంతుల మద్దతు లభించేలా చూస్తాం’’ అన్నారు. ‘డిసెంబర్ 9’ ప్రకటనకు కట్టుబడాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లోక్‌సభలో, రాష్ట్ర అసెంబ్లీలో తగ్గుతున్న తెలంగాణ గొంతుకను గట్టిగా విన్పించేందుకే సావధాన తీర్మానం పెట్టామని శుక్రవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. తెలంగాణలో ఆత్మహత్యలు ఆగాలంటూ సభ పిలుపునివ్వాలని కోరారు. ‘‘తెలంగాణ చరిత్ర ఉద్యమాలు, విశ్వాస ఘాతుకాలతో నిండిపోయింది. వారిప్పటికీ స్వాతంత్య్ర సంబరాలు చేసుకోలేకపోతున్నారు. వారి నెత్తిన కత్తి వేలాడుతోంది’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం బలిదానాలొద్దని, రాష్ట్రాన్ని చూసేందుకు బతకాలని తెలుగులో విజ్ఞప్తి చేయడం విశేషం!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తన ‘ప్రియమైన అంశం’గా సుష్మ అభివర్ణించారు. తెలంగాణపై తాము తొలిసారిగా మాట్లాడడం లేదని, ఆ ప్రాంతం నుంచి బీజేపీకి ఒక్క ఎంపీ కూడా లేకపోయినా విపక్ష బాధ్యతగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నామని చెప్పారు. ‘‘తెలంగాణ ప్రజలు వ్యతిరేకించినా విలీనం జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ముల్కీ నిబంధన, రాష్ట్రపతి ఉత్తర్వులు, ఫార్ములా నంబర్ 6, 610 జీవో, గిర్‌గ్లానీ కమిషన్ వంటివెన్ని చేసినా ఆచరణలో విఫలమయ్యాయి. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ సమయంలో కరీంనగర్ సభలో ఇచ్చిన హామీని విశ్వసించి ప్రజలు ఓట్లేశారు.
తర్వాత ప్రభుత్వంలోనూ టీఆర్‌ఎస్ భాగస్వామి అయింది. సరైన సమయంలో, సంప్రదింపులు, ఏకాభిప్రాయంతో తెలంగాణ ఏర్పాటు చేస్తామని యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమంలోనూ చెప్పారు. 2009 కూడా వెళ్లిపోయింది గానీ తెలంగాణ ఏర్పాటుకు మాత్రం సరైన సమయం రాలేదు’’ అంటూ పదునైన విమర్శలు చేశారు. యూపీఏ-2 పాలనలో రాష్ట్రపతి ప్రసంగంలో ఏకాభిప్రాయం అంశాన్నీ ఎత్తేశారని ధ్వజమెత్తారు. 2009లో తెలంగాణ నుంచి 12 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచినా రాష్ట్రం ఏర్పాటులో ఏ పురోగతీ లేదన్నారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష అంశాన్ని 2009 డిసెంబర్ 7న మేం సభలో లేవనెత్తాం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందని డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటనను సోనియా జన్మదిన కానుకగా భావించి అక్కడి వారంతా సంబరాలు చేసుకున్నారు. ఆ ప్రకటన తెలంగాణ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందనుకున్నారు. కానీ 14 రోజుల్లోనే చిదంబరం మాట మార్చారు. సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయంతోనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమంటూ డిసెంబర్ 23న ప్రకటన చేశారు’’ అని దుయ్యబట్టారు.
శ్రీకృష్ణ కమిటీ కూడా తెలంగాణకు అన్యాయమే చేసిందని సుష్మ అనడంతో, ఇది సావధాన తీర్మానమంటూ స్పీకర్ జోక్యం చేసుకున్నారు. ముఖ్యమైన విషయాలు చెప్పదలచానంటూ సుష్మ కొనసాగించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారని చిదంబరాన్ని ప్రశ్నించారు. మీడియా, పొలిటికల్ మేనేజ్‌మెంట్ ఎలా చేయొచ్చో అందులో సూచించారని సభ దృష్టికి తెచ్చారు. తెలంగాణపై అనేక మోసాలు జరుగుతుండడంతో 600 మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇటీవల ఢిల్లీలో యాదిరెడ్డి ఆత్మబలిదానాన్ని ప్రస్తావించారు.
ఆయన ఆత్మహత్య లేఖలోని ముఖ్యాంశాలను చదివి విన్పించారు. తెలంగాణ ఏర్పాటులో జాప్యానికి కారణాలు, పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను సభకు తెలపాలని చిదంబరాన్ని కోరారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు, నివేదిక, ఆరు సిఫార్సులు, వాటిపై పార్టీలతో అఖిలపక్ష భేటీ తదితరాలను ఆయన వివరించారు. సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 14 (ఎఫ్)పై తాజా పరిస్థితులను వివరించారు.
తెలంగాణ కోసం ఆ ప్రాంత ఎంపీలు రాజీనామా చేశారని సుష్మ చెబుతుండగా, ‘‘అంతా రాజీనామా చేశారని ఎలా చెబుతారు? కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, ఎంపీలు అంజన్‌కుమార్, సర్వే సత్యనారాయణ చేయలేదు’’ అంటూ కావూరి అభ్యంతర పెట్టారు. దాంతో నలుగురు రాజీనామా చేయలేదంటూ ఆమె సవరించుకున్నారు. ‘‘17 మంది తెలంగాణ ఎంపీల్లో 13 మంది; 119 మంది ఎమ్మెల్యేల్లో 103 మంది ఆవేదనలతో రాజీనామా చేశారు. అల్లరి పిల్లవానికి అమాయకపు అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తున్నామని, కలిసుండలేకపోతే విడిపోవాలనిఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసేప్పుడే తొలి ప్రధాని నెహ్రూ అన్నారు’’ అని పేర్కొన్నారు.
సీమాంధ్ర ఎంపీలు అభ్యంతరం తెలపడంతో సర్వే సత్యనారాయణకు, వారికి వాగ్వాదం జరిగింది. వారికీ మాట్లాడేందుకు సమయమిస్తానంటూ స్పీకర్ సముదాయించారు. ‘‘నేనేమీ ఏ బీజేపీ నేతో చేసిన వ్యాఖ్యలను చెప్పడం లేదు. నెహ్రూ వ్యాఖ్యలనే ప్రస్తావిస్తున్నా. మీరెందుకు అంత బాధపడుతున్నారు? అవి 1956, మార్చి 6న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో ప్రచురితమయ్యాయి’’ అని సుష్మ వివరించారు. ‘‘సోదర సోదరీమణులారా..! తెలంగాణ కోసం ఆత్మబలిదానం వద్దు. తెలంగాణ చూడటానికి బతకాలి’’ అంటూ ఆమె ప్రసంగాన్ని తెలుగులో ముగించారు!
telangana issue meere thelchukovali chidambaram(మీరే తేల్చుకోవాలి చిదంబరం)
చేతులు దులుపుకున్న చిదంబరం
ఆ పరిష్కారాన్ని అమలు చేయటం మాత్రమే కేంద్రం, పార్లమెంటు చేయగలవు
రాష్ట్ర ప్రజలను చీల్చింది నేను కానీ, కేంద్రం కానీ కాదు.. వారే చీలిపోయారు
హైదరాబాద్ అఖిలపక్ష సమావేశం మినిట్స్ ఆధారంగానే ‘డిసెంబర్ 9’ ప్రకటన
ఆ ప్రకటన తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితి మారిపోయింది.. కేంద్రం దానిని గుర్తించింది
ఆ నేపథ్యంలోనే శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైంది.. నివేదికలో ఏం రాయాలో మేం చెప్పలేదు
రాష్ట్రంలో 8 గుర్తింపు పొందిన పార్టీల్లో.. 4 పార్టీలు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు
అన్ని పార్టీలూ ఒక స్పష్టమైన నిర్ణయంతో వస్తేనే.. మళ్లీ అఖిలపక్ష సమావేశం సాధ్యం
లోక్‌సభలో బీజేపీ సావధాన తీర్మానానికి కేంద్ర హోంమంత్రి జవాబు
ప్రత్యేక తెలంగాణ - సమైక్యాంధ్ర ఉద్యమాలతో రగులుతున్న రాష్ట్ర సమస్యకు పరిష్కారం ఏమిటో.. తెలుగు ప్రజలే చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. శుక్రవారం లోక్‌సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్ తెలంగాణపై ప్రవేశపెట్టిన సావధాన తీర్మానానికి కేంద్ర హోంమంత్రి చిదంబరం సమాధానం ఇస్తూ.. ఈ సమస్యను తెలుగు ప్రజలు పరిష్కరించుకుంటే కేంద్ర ప్రభుత్వం దానిని అమలు చేస్తుందని చెప్పారు. ఈ అంశంపై రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలతో సహా నాలుగు పార్టీలు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదన్నారు. అవి కూడా ఒక అభిప్రాయంతో ముందుకు వస్తేనే అఖిలపక్ష సమావేశం ఉంటుందన్నారు. అంతకుముందు.. సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. కేంద్రం 2009 డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే.. మూడింట రెండు వంతుల మద్దతు లభించేలా చూస్తామన్నారు. మరోవైపు.. తీర్మానం నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల మధ్య సభలో తీవ్ర వాగ్వాదం తలెత్తింది. వీరందరినీ నియంత్రించేందుకు స్పీకర్‌తో పాటు.. కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రయాస పడాల్సి వచ్చింది.
ఒకే రాష్ట్రంగా కలిసి ఉండటమో, విడిపోవటమో అన్న సమస్యను తెలుగు ప్రజలే తేల్చుకోవాలని చెప్తూ.. కేంద్ర ప్రభుత్వం భారమంతా రాష్ట్ర ప్రజలపైకి నెట్టేసింది. ‘‘తెలంగాణ డిమాండ్ ఒకవైపు, సమైక్యాంధ్రప్రదేశ్‌నే కొనసాగించాలన్న డిమాండ్ మరోవైపు ఉండటంతో తలెత్తిన సమస్యకు పరిష్కారం.. తప్పనిసరిగా తెలుగు మాట్లాడే ప్రజల నుంచే రావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచే (పరిష్కారం) రావాలి. కేంద్రం ఆ పరిష్కారాన్ని అమలు చేయగలదంతే’’ అని కేంద్ర హోంమంత్రి చిదంబరం.. బంతిని రాష్ట్ర ప్రజల కోర్టులోకి నెట్టేసి చేతులు దులుపుకున్నారు. సంక్లిష్టమైన ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం కృషిచేస్తోందని ఇన్నాళ్లుగా చెప్తూ వచ్చిన ఆయన.. ఇప్పుడీ సమస్యతో తనకు కానీ, కేంద్రానికీ కానీ సంబంధం లేదని పార్లమెంటు వేదికగా పేర్కొన్నారు. వివాదాన్ని తెలుగు ప్రజలే శాంతియుతంగా పరిష్కరించుకోవాలంటూ.. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను చీల్చింది తానో, కేంద్ర ప్రభుత్వమో కాదని.. రాష్ట్రంలో తలెత్తిన ప్రస్తుత పరిస్థితులకు తమ బాధ్యత ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ‘‘చీలిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు.. అక్కడి పార్టీలు.. దీనితో మాకే సంబంధమూ లేదు’’ అని నిండు సభలో వక్కాణించారు. రాష్ట్రంలోని 8 గుర్తింపు పొందిన పార్టీల్లో.. అధికార, ప్రతిపక్షాలతో సహా 4 పార్టీలు తెలంగాణపై నిర్ణయానికి రాలేదని చెప్పారు. ఆ పార్టీలు నిర్ణయానికి వస్తే అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు.
శుక్రవారం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ఇచ్చిన సావధాన తీర్మానంపై.. పలువురు నాయకులు ఉద్వేగభరితంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వాల హామీలను ప్రస్తావిస్తూ సుష్మ సుదీర్ఘంగా మాట్లాడాక.. కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు సర్వే సత్యనారాయణ, కావూరి సాంబశివరావులు ఆవేశంగా మాట్లాడారు. ఒక సందర్భంలో వారిద్దరి ఆరోపణలు, ప్రత్యారోపణలు.. ఇరు ప్రాంతాల సభ్యులు వారికి మద్దతుగా కేకలు వేయటంతో పరిస్థితి తీవ్ర గందరగోళానికి దారితీసింది. వీరిని శాంతింపచేయటానికి.. ప్రభుత్వ పెద్దలు చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. వారు శాంతించాక చిదంబరం.. తీర్మానానికి సమాధానం చెప్పారు. ‘‘నేను చాలా విచారంతో మాట్లాడుతున్నా. నేను భయపడ్డట్లే ఈ సావధాన తీర్మానం.. సభలో చీలికతెచ్చే చర్చగా మారింది. దయచేసి.. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు చీలిపోయి ఉన్నారన్న విషయాన్ని అర్థంచేసుకోండి. అక్కడ ఉద్వేగాలను రెచ్చగొట్టే విధంగా పార్లమెంటులో ఎలాంటి వ్యాఖ్యలు కానీ, పని కానీ చేయకూడదు’’ అని పేర్కొన్నారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
‘‘ఈ సమస్యకు పరిష్కారం తెలుగు మాట్లాడే ప్రజల నుంచే రావాలని ఆంధ్రప్రదేశ్ నాయకులకు చెప్పేందుకు నేను ఆది నుంచీ ప్రయత్నిస్తున్నాను. నిజానికి 2010 జనవరి 5వ తేదీన, 2011 జనవరి 6వ తేదీన జరిగిన అఖిలపక్ష సమావేశాలకు హాజరైన వారికి తెలుసు.. నేను ఈ విషయాన్ని పదేపదే చెప్పా.. పరిష్కారం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచే రావాలి. పార్లమెంటు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఆ పరిష్కారాన్ని అమలు మాత్రమే చేయగలవు. తెలంగాణ ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉందన్న సుష్వాస్వరాజ్ మాటలతో నేను ఏకీభవిస్తున్నా. అయితే.. దీనికి సంబంధించి ఇటీవలి చరిత్రను కూడా విస్మరించకూడదు. ఆ సంఘటనలను పరిగణనలోకి తీసుకోకపోతే.. కేంద్ర ప్రభుత్వం ఎందుకింత ఎక్కువ జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరిస్తోందో అర్థంచేసుకోవటం కష్టమవుతుంది.
ఆ ప్రకటన తర్వాత అంతా మారిపోయింది..
2009 డిసెంబర్ 7న హైదరాబాద్‌లో బీఏసీ సమావేశం, ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం జరిగాయి. ఆ సమావేశాల మినిట్స్ ఆధారంగానే.. కేంద్ర ప్రభుత్వం నా ద్వారా డిసెంబర్ 9 ప్రకటన చేసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా, ప్రభుత్వ నేతలు నిర్ణయం తీసుకోకుండా.. కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఆ ప్రకటన చేయగలరని నమ్మేంత అమాయకులెవరూ లేరని నేను నిజంగా ఆశిస్తున్నా. కానీ.. డిసెంబర్ 9న ఆ ప్రకటన చేసిన అనతికాలంలోనే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మారిపోయింది. అది నిరాకరించలేని సత్యం. ఆంధ్రప్రదేశ్‌లో పాలక పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చీలిపోయాయి. నేను వాటిని చీల్చలేదు. ఈ సభలోని ఏ ఒక్కరూ అవి చీలిపోవాలని కోరుకోరు. కానీ అవి చీలిపోయాయన్నది నిజం. అవి చీలిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ వాస్తవాన్ని గుర్తించక తప్పని పరిస్థితి వచ్చింది. మారిన పరిస్థితిని గుర్తించి.. మేం డిసెంబర్ 23న ప్రకటన చేశాం. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ ప్రతి ఒక్కరినీ సంప్రదించింది. కేంద్ర ఆర్థిక మంత్రిని, నన్నూ సంప్రదించింది. కానీ.. కమిటీ నివేదికలో ఏం రాయాలో మేం చెప్పలేదు. ఇలా చేయి, అలా చేయి.. ఇది రాయి, అది రాయి అని చెప్పటం ప్రభుత్వంలోని మంత్రుల పని కాదు. కమిటీ ఒక నివేదిక రాస్తే.. దాని రచయితలు వారే. అందులో వారు రాసిన దానికి వారే బాధ్యత తీసుకుంటారు. జస్టిస్ శ్రీకృష్ణ వంటి న్యాయమూర్తిని ఎవరూ తప్పుపట్టకూడదు. ఆయన మార్గదర్శక సూత్రాలకు కట్టుబడ్డారు. ఆయన తన నివేదికలో 8వ చాప్టర్‌ను రహస్యంగా ఉంచాలని ఎందుకు చెప్పారో నేనెలా చెప్పగలను? ఆ చాప్టర్ విషయమై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ చాప్టర్‌ను బహిర్గతం చేయలేను.’’
పార్టీలు తరచూ వైఖరి మార్చుకుంటుంటాయి
రాజకీయ పార్టీలు తరచూ తమ వైఖరిని మార్చుకుంటుంటాయని చిదంబరం అన్నారు. ‘బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నపుడు తెలంగాణ విషయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయటం కుదరదని, ప్రాంతీయ వెనుకబాటుతనానికి అభివృద్ధే పరిష్కారమని అప్పటి హోంమంత్రి అద్వానీ 2002 ఏప్రిల్ ఒకటో తేదీన స్పష్టంచేశారు. ఇప్పుడు ఆ పార్టీ వైఖరి మారింది. దానిని నేను తప్పుపట్టటం లేదు. రాష్ట్రంలో 8 గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. వాటిలో పీఆర్‌పీ.. తను కాంగ్రెస్‌లో విలీనం అవుతున్నట్లు ప్రకటించింది. పార్టీల సంఖ్య 7కు తగ్గింది. అయితే.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అనే మరో కొత్త పార్టీ వచ్చింది. అంటే రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీల సంఖ్య 8 గానే ఉంది. ఈ 8 పార్టీల వైఖరి ఏమిటి? బీజేపీ, టీఆర్‌ఎస్, సీపీఐ.. మూడు పార్టీలు స్పష్టంగా తెలంగాణ ఏర్పాటును కోరుతున్నాయి. ఒక పార్టీ.. సీపీఎం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తోంది. మరో మూడు పార్టీలు.. బహుశా ఎనిమిదో పార్టీ కూడా.. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. తాము ఇంకా తుది నిర్ణయానికి రాలేదని కాంగ్రెస్ చెప్పింది. వారు ఇంకా సంప్రదింపుల ప్రక్రియలోనే ఉన్నారు. టీడీపీ చీలిపోయి ఉంది. ఒక పార్టీగా తాము తుది నిర్ణయం తీసుకోలేదని వారు నాతో చెప్పారు.
ఇక ఎంఐఎం.. తాము నిర్ణయం తీసుకునే ముందు.. కాంగ్రెస్, టీడీపీల నిర్ణయాలు ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు నాతో చెప్పారు. కొత్త పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్.. తుది నిర్ణయం తీసుకోవటం గురించి నాతో ఏమీ చెప్పలేదు. నాకు అందిన నివేదికల ప్రకారం.. నెల కిందట వారు నిర్వహించిన సదస్సులో.. తుది నిర్ణయం తీసుకోలేదు. ఇంకా 4 పార్టీలు స్పష్టమైన వైఖరి తీసుకోనందున నేను చేయగలిగిందీ ఏమీ లేదు. మేం ఆ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం.. దయచేసి మీ సంప్రదింపుల ప్రక్రియను పూర్తిచేయండి. అన్ని పార్టీలూ స్పష్టమైన అభిప్రాయంతో ముందుకు వస్తేనే.. తదుపరి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు సాధ్యమవుతుంది. ఇందుకు రెండు మూడు వారాలు పట్టొచ్చు.. రెండు మూడు నెలలూ పట్టొచ్చు. ఈ ప్రక్రియ పూర్తవటానికి వీలుకలిగేలా తెలుగు ప్రజలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని అన్నారు.
ఎవరూ చనిపోకూడదు..
ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఒక యువకుడు ఢిల్లీకి వచ్చి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని కేంద్ర హోంమంత్రి చిదంబరం అన్నారు. ‘‘అది ఆత్మహత్యా కాదా, మృతుడు రాసినట్లు చెప్తున్న సూసైడ్ నోట్ వాస్తవమైనదా కాదా అన్న అంశాలపై దర్యాప్తు జరుగుతోంది. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి మరణం మనల్ని చాలా బాధపెడుతుంది. మన యువకుల్లో ఒకరు.. కారణమేదైనా, ఏ కారణంతో, ఏ ఉద్వేగంతో, ఏ నిరాశతో, ఏ ఆగ్రహంతో ప్రేరేపితమైనా.. అతడు ఆత్మహత్య చేసుకుంటే.. అది మనలో ప్రతి ఒక్కరినీ బాధపెడుతుంది. మేం చర్చిస్తూ ఉండగా.. దయచేసి ఇలాంటి తీవ్ర చర్యలకు పాల్పడవద్దని మనమందరం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేయాలన్నది నా వినతి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మా సొంత పిల్లల వంటివారు. ఈ సమయంలో ఏ ఒక్కరూ లాఠీచార్జిల్లో గాయపడకూడదు. ఎవరూ చనిపోకూడదు. మేం ఒక నిర్ణయానికి వచ్చే వరకూ.. 12 కోట్ల మంది తెలుగు ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలు శాంతిసహనాలతో ఉండాలి’’ అని విజ్ఞప్తి చేశారు.
telangana esthamani appu cheppaledu(తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పలేదు):kavuri
రాష్ర్టంలోని వాస్తవాలను సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకొస్తున్నా. 2004 ఎన్నికల ప్రణాళికలోగానీ, సీఎంపీలోగానీ, రాష్ర్టపతి ప్రసంగంలోగానీ ఎక్కడా తెలంగాణను ఏర్పరుస్తామని కాంగ్రెస్ ప్రకటించలేదు. (ఈ చర్చలో కావూరికి ఎలా అవకాశం ఇచ్చారని బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, చర్చలో పాల్గొనాల్సి ఉన్న మరో ఇద్దరు సభ్యులు విరమించుకోవటంతో తన విశేషాధికారం ఉపయోగించి ఆయనకు అవకాశం ఇచ్చినట్లు స్పీకర్ పేర్కొన్నారు.)
కాకినాడలో బీజేపీ తీసుకున్న ఒక ఓటు - రెండు రాష్ట్రాల హామీ నుంచి వెనక్కు తగ్గటానికి బాధ్యుపూవరు? రాష్ర్టం నుంచి ఒక్క ఎంపీ లేని బీజేపీ మాట్లాడటం కడు దయనీయం. రాష్ర్టంలో రెండు శాతం ఓటు బ్యాంకు లేని పార్టీకి తెలంగాణ కోసం మాట్లాడే నైతిక హక్కు లేదు. రాష్ర్టంలోని అన్ని పార్టీల ఆమోదంతోనే శ్రీ కృష్ణ కమిటీ ఏర్పడింది. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి బుర్గుల రామకృష్ణారావు కోరిక మేరకే విశాలాంధ్ర ఏర్పడింది. పసంగం ముగించాల్సిందిగా స్పీకర్, చిదంబరం, ఆజాద్ పదే పదే కోరినా కావూరి ఆగలేదు. మైక్ కట్ చేసిన అనంతరం కూడా నిలబడి ఏదో మాట్లాడుతున్న ఆయనపై చిదంబరం అసంతృప్తిని వ్యక్త పరిచారు.)
loksabha lo Garginchina Sushma Swaraj
తెలంగాణకు అడుగడుగునా జరిగిన అన్యాయాలను సవివరంగా ప్రస్తావించిన సుష్మ.. వివిధ ఒప్పందాలు ఉల్లంఘనకు గురైన తీరును ఎండగట్టారు. తాజా శ్రీకృష్ణ కమిటీ బండారాన్ని బయటపెట్టారు. నిక్కచ్చిగా.. ముక్కుసూటిగా సుష్మ చేసిన ప్రసంగంతో కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకి కావూరి సాంబశివరావు బిత్తర పోయారు. హోం మంత్రి చిదంబరం సమాధానాలు వెతుక్కునే పనిలో పడిపోయారు. చివరికి కొత్తగా ఏమీ చెప్పలేకపోయారు. పాత పాటలనే వల్లెవేశారు. ఓ దశలో సుష్మ ప్రసంగంతో కంగుతిన్న చిదంబరం.. తమ చేతిలో ఏమీ లేదని, తేల్చుకోవాల్సింది ఆంధ్రవూపదేశ్‌లోని రాజకీయ పార్టీలేనని పాత మాటలనే పునరుద్ఘాటించారు. తమ పార్టీలోనూ ఏకాభివూపాయం లేదని ఒప్పుకున్నారు.
సుష్మ మాట్లాడుతుంటే కావూరి సాంబశివరావు ఆమెకు అడుగడుగునా అడ్డుపడి అడ్డదిడ్డమైన వాదన చేశారు. కానీ.. ఆయన కొత్తగా చెప్పింది ఏమీ లేదు. రాష్ట్రం నుంచి ఒక్క ఎంపీ కూడా లేని బీజేపీ తెలంగాణ గురించి మాట్లాడటమేంటన్న కావూరి వాదనను సుష్మ దీటుగా తిప్పి కొట్టారు. కేంద్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మాట్లాడుతున్నామని చెప్పారు. గతంలోనూ తెలంగాణ కోసం మాట్లాడింది తామేనని చెప్పారు. కావూరికి బాసటగా మరో కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకి లగడపాటి నిలిచినా.. సుష్మ వాగ్ధాటితో మిన్నకుండిపోయారు. అర్థవంతమైన చర్చ జరగలేదని చిదంబరం తేల్చినా.. తెలంగాణపై కాంగ్రెస్ కచ్చితమైన నిర్ణయానికి రాలేదన్న వాస్తవం బయటపడింది. దీంతో ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన నేతలు.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలన్న ఒత్తిడి రావచ్చునన్న వాదన వినిపిస్తున్నది. పార్టీకి విధేయతతో ఉంటూనే తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములమవుతామంటే ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉండదని పలువురు తెలంగాణవాదులు అంటున్నారు.
మొత్తం మీద మూడు నెలల్లో చర్చల ప్రక్రియను ముగిస్తామని చిదంబరం ప్రకటించడంతో సావధాన తీర్మానం లక్ష్యం కొంతలో కొంత నెరవేరిందనే చెప్పొచ్చు. చిదంబరం ప్రకటన నేపథ్యంలో మరో మూడు నెలల్లోగా తెలంగాణపై ఒక నిర్ణయం వెలువడుతుందనే ఆశ ప్రజాస్వామ్యవాదుల్లో, తెలంగాణ ప్రజల్లో నెలకొంది. అటు తెలంగాణపై పార్లమెంటులో గంటన్నర పాటు సాగిన చర్చ దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపనుండటంతో అధికార పార్టీ కొంత ఆత్మ రక్షణలో పడింది. తెలంగాణపై నిర్ణయం వెలువరించే ముందు రాష్ట్రంలో జరిగే లాభ నష్టాలను మాత్రం బేరీజు వేసుకుంటున్న అధికార పార్టీ, తాజా విస్తృత చర్చ అనంతరం తన పరిధిని విస్తరించుకోవచ్చన అభివూపాయం వినిపించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. రాజకీయ అవసరాల కోసం వాటిని తుంగలో తొక్కిందనే వాస్తవం చర్చ ద్వారా బహిరంగమవడంతో దేశ వ్యాప్తంగా ఆ పార్టీపై విశ్వసనీయత సన్నగిల్లే ప్రమాదం లేకపోలేదు. పైగా ఇకపై కాంగ్రెస్ చేసే వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉండబోదు.
ఆ దిశలోనే బీజేపీ చేసిన కృషి ఫలించిందని నిపుణులు అంటున్నారు. లోక్‌పాల్, ధరల పెరుగుదల, అవినీతిపై ప్రభుత్వాన్ని పెద్దగా ఇరుకున పెట్టలేక పోయిన బీజేపీ, తెలంగాణపై జరిగిన చర్చలో మాత్రం పై చేయి సాధించింది. అన్ని విషయాల్లో ప్రతిపక్షాల్లో చీలిక తెచ్చే అధికార పార్టీ తెలంగాణ విషయంలో మాత్రం పార్లమెంటు సాక్షిగా తానే చీలిపోయింది. సొంత పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులను కట్టడి చేయలేక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్, హోం మంత్రి చిదంబరం తలపట్టుకున్నారు. పార్లమెంటు గత సమావేశాల్లో నిరసన తెలిపిన టీ ఎంపీలను బెదిరించి బయటకు పంపిచినవూపణబ్ ఇప్పుడు మాత్రం సీమాంధ్ర నాయకుల పట్ల ఉదాసీనత ప్రదర్శించారు. సీమాంధ్ర ఎంపీలు కావూరి, లగడపాటి, ఆనంత, రాయపాటి, సబ్బం హరి తదితరులు చర్చకు ఆడుగడుగునా అడ్డుతగిలారు.
సావధాన తీర్మానంపై చర్చకు అనుమతిస్తున్నానని స్పీకర్ ప్రకటించిన వెను వెంటనే కావూరి లేచి నిలబడి ‘‘రాష్ట్రం గురించి వాస్తవాలు, గణాంకాలు తెలియని సుష్మ.. రాజకీయ కారణాలతోనే తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు’’ అని ప్రతిపక్ష నాయకురాలిని అవమాన పరిచే విధంగా వ్యవహరించారు. తామంతా చర్చకు అనుమతివ్వాలని ఎన్నిసార్లు కోరినా నిరాకరించి, బీజేపీకి అవకాశం ఎలా ఇస్తారని స్పీకర్ అధికారాన్నే ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అడ్డు తగలొద్దని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా ప్రశాంతంగా చర్చ జరగకుండా సీమాంధ్ర ఎంపీలు తీవ్రంగా ప్రయత్నించారు. రాష్ట్రం నుండి ఒక్క ఎంపీలేని బీజేపీ తెలంగాణ గురించి మాట్లాడటం దయనీయం.... రాష్ట్రంలో రెండు శాతం ఓటు బ్యాంకు లేని పార్టీకి తెలంగాణ కోసం మాట్లాడే నైతిక హక్కు లేదు.. అంటూ సుష్మ ప్రసంగిస్తుండగానే రన్నింగ్ కామెంటరీలకు దిగారు.
మాట్లాడటానికి అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పినా.. తెలంగాణ విషయంలో తమ వైఖరి తప్ప మరో వైఖరి వినిపడకూడదనే తీరుగా ప్రవర్తించారు. అమరుడైన యాదిడ్డి ఆత్మహత్య లేఖలోని అంశాలను సభ దృష్టికి తేవాలని సుష్మాస్వరాజ్ ప్రయత్నిస్తుంటే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి లేఖ ఆయన వ్యక్తిగతమని, దాన్ని మీరెలా చదువుతారని కావూరి అభ్యంతరం పెట్టారు. యాదిడ్డి రాసిన లేఖ ఆయన రాసిందేనా? అన్న విషయం తేలాల్సి ఉందని అమరులను చులకన చేసి మాట్లాడారు. ఇక తమ పార్టీ ఎంపీ సర్వే సత్యనారాయణ మాట్లాడుతుండగా తెలంగాణ కోసం అందరూ రాజీనామాలు చేస్తే నువ్వేందుకు సభకొచ్చావంటూ వెటకారాన్ని ప్రదర్శించారు. ‘తెలంగాణ కోసం పార్లమెంటులో ఆత్మహత్య చేసుకుంటానన్నావు కదా’ అంటూ తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆత్మహత్యలే శరణ్యం అన్న విధంగా వ్యవహరించారు.
తెలంగాణకు మద్దతిస్తున్నా... ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలను గౌరవిస్తున్నానని గురుదాస్ దాస్ గుప్తా చెప్పినపుడు వీరావేశంతో బల్లలు చరిచిన సీమాంధ్ర ఎంపీలు ఆంధ్రా ప్రాంతం మొత్తం ఆగం కావొద్దనే అర్థంతోనే ఆయా ప్రాంతాను గౌరవిస్తున్నానని గురుదాస్ పేర్కొనడంతో చిన్నబుచ్చుకున్నారు. తమ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకే సమైక్య రాష్ట్రం కోసం పాటు పడుతున్నామని అసత్యాలు పలికే సీమాంధ్ర నాయకులు, అక్కడి ప్రజలు బాగుండాలని ఎవరైనా కోరుకుంటే మాత్రం బల్లలు చరచలేని దైన్యంలో పడిపోయారు. చివరిలో మాట్లాడిన చిదంబరం.. తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. బంతిని రాష్ట్ర పార్టీల కోర్టుల్లోకి నెట్టారు. తెలంగాణ అంశంలో ముందుగా నిర్ణయం తీసుకోవాల్సింది ఆయా పార్టీలేనని తేల్చారు.
రాష్ట్రంలోని మొత్తం ఎనిమిది ప్రధాన పార్టీల్లో నాలుగుకుపైగా పార్టీలు తెలంగాణపై తమ వైఖరిని ఇంత వరకూ ఖరారు చేసుకోలేదని చెప్పారు. ‘‘ఈ సమస్యకు పరిష్కారం తెలుగు మాట్లాడేవారి నుంచి, ఆంధ్రవూపదేశ్ ప్రజల నుంచి రావాలి. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రక్రియను ముందుకు తీసుపోవటమే చేయగలదు. పార్లమెంటు కూడా ఆ ప్రక్రియను ముందుకు తీసుకుపోవడమే చేయగలదు’’ అని చిదంబరం చేతుపూత్తేశారు. బీజేపీ సభ్యులు గోపీనాథ్ ముండే, రమేష్ కూడా చర్చలో పాల్గొనాల్సి ఉన్నా వారు ఉపసంహరించుకున్నారు.
Sushma Swaraj telugu matalu in loksabha
తెలంగాణ కోసం బలిదానాలొద్దు.. తెలంగాణ చూడటానికి
బతికుండాలి.. బతికుండాలి..
బతికుండాలి..
- సుష్మాస్వరాజ్ తెలుగు మాటలు
telangana na janmahakku:survey(తెలంగాణ నా జన్మహక్కు)
నాకు రాజకీయ జన్మనిచ్చిన సోనియాగాంధీ ఇక్కడ ఉంటే తెలంగాణ ఇచ్చి ఉండేవారు. అనారోగ్యంతో ఉన్న ఆమె త్వరగా కోలుకోవాలని తెలంగాణ ప్రజల తరుపున దేవున్ని ప్రార్థిస్తున్నా. సుష్మాస్వరాజ్ అన్నట్లుగా తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగానే గాక ప్రత్యేక దేశంగా ఉండేది. తెలంగాణను భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుమీద మద్రాసు నుంచి విడిపోయిన సీమాంవూధతో కలిపారు. అప్పుడు మద్రాసు గురించి మాట్లాడిన సీమాంవూధులు ఇప్పుడు హైదారాబాద్ గురించి మాట్లాడుతున్నారు. నెహ్రూ మాటకు అనుగుణంగానే అవసరం అనుకున్నప్పుడు సీమాంవూధతో విడాకులు తీసుకుంటాం. కాంగ్రెస్ నాయకురాలు సోనియా తెలంగాణపై కొనసాగుతున్న వివక్షను అర్థం చేసుకున్నందునే తెలంగాణ ఇస్తుందనే విషయం తెలుసు. తెలంగాణ ఇవ్వాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ అందరూ నివసించవచ్చు. కేసీఆర్ అన్నట్లుగా ఆంధ్రావాలా భాగో అనే నైజం మాది కాదు. చిన్న రాష్ట్రాలే వేగవంతంగా ప్రగతిని సాధిస్తాయి. (తెలంగాణ కోసం పార్లమెంటులో ఆత్మహత్య చేసుకుంటానన్నావు అని సీమాంధ్ర నాయకులు కామెంట్ చేయగా..) యాదిడ్డిలాంటి పిల్లలు బలిదానాలు చేసుకోవద్దనే తెలంగాణకోసం కాంగ్రెస్ సభ్యులుగా ఆత్మహత్య చేసుకుంటామన్నాం. మా ప్రజలను చావనియ్యం. బాలగాంగాధర్ తిలక్ స్ఫూర్తిగా తెలంగాణ మా జన్మహక్కు. రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించండి. పసంగాన్ని తొందరగా ముగించాలని స్పీకర్ కోరగా) తెలంగాణ ప్రజలు చస్తున్నారు.. సుష్మాలాగా సీనియర్ కాకపోయినా తోటి సహచరులు రాజీనామా చేసినందున మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి.
ఉద్యోగుల సమ్మె, టీ మంత్రుల రాజీనామాలతో రాష్ర్టంలో పాలన అస్తవ్యస్థమైంది. (మరి మీరు రాజీనామా చేయలేదేం అన్న మాటలపై) నేను, అంజన్‌కుమార్ యాదవ్ రాజీనామాచేస్తే తెలంగాణ గురించి ఎవరు మాట్లాడుతారని రాజీనామా చేయలేదు. నాయకురాలిని ధిక్కరించను. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన (తెలంగాణ) కానుకను వెనక్కు తీసుకోరు. కొందరు ఆటంకాలు కల్పించి తెలంగాణను అడ్డుకున్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని అంటున్నారు. అది ఎవ్వరి జాగీరు కాదు. హైదరాబాద్ తెలంగాణకు తల లాంటిది. మొండెం నుంచి తలను వేరు చేయొద్దు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వాలి. విభజన, సమైక్యత అన్న రెండే రెండు అంశాల మీద నివేదించాల్సిన శ్రీ కృష్ణ కమిటీ ఇదంతా చెప్పడం అనవసరం.
అది రాజకీయ రిపోర్టు. ప్యాకేజీలు, అభివృద్ధి మండళ్లతో తెలంగాణకు న్యాయం జరగదు.. తెలంగాణ ఏర్పాటుతోనే ఆ ప్రాంత అభివృద్ధి సాధ్యమవతుంది. నిర్దిష్ట కాలపరిమితి లేకుండా చర్చలు చేయడం అనవసరం. తెలంగాణ విషయాన్ని పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. యూపీని విభజించడానికి రెండో ఎస్సార్సీ అని అధిష్టానం అంటుంటే సీమాంవూధులు తెలంగాణకు కూడా అదే సూత్రంతో లింకు పెడుతున్నారు. ఇప్పటికే ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డా సీమాంవూధులు అడ్డుకోవటంవల్లే తెలంగాణ రాలేదు. తెలంగాణను తాత్సారం చేస్తున్నందునే పిల్లలు మరణిస్తున్నారు. తెలంగాణ విషయంలో టీడీపీ ద్వంద్వ వైఖరి వీడాలి.
esma gisma janthanai:jac(ఎస్మా..గిస్మా....జాన్తానై..!)
కొత్తగూడెంలో జరిగిన దీక్షలలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాబంశివరావు, పాల్వంచలో జరిగిన దీక్షలకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావులు సంఘీభావం ప్రకటించారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట జరిగిన దీక్షల్లో ఉద్యోగులు ఎస్మా జీవో ప్రతులను దహనం చేశారు. ఈ దీక్షల్లో జిల్లాలోని ఆయా ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి.
నాలుగున్నర కోట్ల ఆకాంక్ష నెరవేరబోతోంది...
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష త్వరలో నెరవేర బోతోందని మంత్రి రాంరెడ్డి అన్నారు. కూసుమంచిలో జరిగిన దీక్షల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం మరలా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
సాధ్యమైనంత త్వరలో తెలంగాణ వస్తుందని, ఈమేరకు టీ కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నారన్నారు. చర్చల అనంతరం ఉద్యమంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ కోసం నాలుగున్నర కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారని , వారి ఆకాంక్ష నెరవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సీమాంధ్రు లు రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్నారని వారి ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఇక్కడి వారు నిజమైన ఉద్యమ సారథులని కితాబిచ్చిన మంత్రి, తెలంగాణ అమర వీరుల త్యాగాలు వృథా కావన్నారు..
భయపడేది లేదు....
దీక్షల్లో పాల్గొన్న జేఏసీ నేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఎస్మా చట్టం ప్రయోగిస్తామని బెదిరిస్తే భయపడేది లేదన్నారు. ఉడుత ఊపులకు మహావృక్షం ఊగదని, తెలంగాణ ఉద్యోగుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు.
ఈ దీక్షలల్లో జై తెలంగాణ , జైజై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి సీమాంధ్రులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సీఎం కూడా వారికి వంత పాడుతూ సీమాంధ్ర బుద్ధి చూపిస్తున్నారని విమర్శించారు.
అత్యవసర సర్వీసుల పేరుతో కీలకమైన ప్రభుత్వ శాఖల ఉద్యోగులను ఈనెల 17 నుంచి జరిగే సకల జనుల సమ్మెకు వెళ్ళకుండా చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. అందులో భాగంగానే ఎస్మా చట్టం పేరుతో బెదిరిస్తున్నాడని, ఆయనకు ఉద్యోగుల చేతుల్లో పతనం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు మరల రాజీనామాలు చేసి ఆమోదింపచేసుకోవాలని, గతంలో రాజీనామా చేయని వారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఉగ్రరూపం చూపక ముందే ప్రభుత్వాలు తెలంగాణ ప్రకటించాలని, లేకుంటే ఇక్కడి సీమాధ్రులను ప్రజలు తరిమి కొట్టడం ఖాయమని అన్నారు.
ఈ ఆందోళనల్లో జేఏసీ చైర్మన్ కనకాచారి, ఉద్యోగ జేఏసీ చైర్మన్ కూరపాటి రంగరాజు, వెంకటపతిరాజు, ఖాజామియా, టీజీవో ప్రదాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, సంగం వెంకటనర్సయ్య, బత్తుల సోమయ్య, మనోహర్, విజయ్ శ్రనివాసరావు, వెంకటేశ్వర్లు, భద్రయ్య వెంకటరెడ్డి, ప్రభాకర్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Tuesday, 2 August 2011
తెలంగాణకు జరిగిన అన్యాయాలు
- రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం కింద సేవలనందించటానికి ప్రబుత్వం అనుమతించిన హాస్పిటల్స్ 409 .వీటిలో 296 హాస్పిటల్స్ ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్నాయ్ !తెలంగాణలో వున్నవి కేవలం 113 .ఈ 113 లో 36 ఆంధ్ర ప్రాంతీయులవే. 2010 మార్చి వరకు ఆరోగ్యశ్రీ పై ప్రభుత్వం పెట్టిన మొత్తం కర్చు 1554 కోట్లు .ఇందులో ఆంధ్ర ప్రాంతం దక్కించుకున్న వాటా 1438 కోట్లు.తెలంగాణలో కర్చు చేసింది కేవలం 116 కోట్లు.ప్రజల ప్రాణాలను కాపాడే అపర సంజీవని అని చెప్పుకునే ఆరోగ్యశ్రీ లో కూడా తెలంగాణకు అన్యాయమే జరుగుతుంది.
- ఒక ప్రాంత వ్యక్తి ముక్యమంత్రి అయితే మరో ప్రాంత వ్యక్తికి ఉపముక్యమంత్రి పదవి ఇవ్వాలి .ఇది పెద్ద మనుషుల ఒప్పందంలో ముక్యమైన అంశం .1956 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత రాయలసీమకు చెందినా నీలం సంజీవరెడ్డి cm అయ్యాడు.ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంత వ్యక్తిని ఉపముక్యమంత్రిని చేయాలి కాని అది జరగలేదు పైగా ఉపముక్యమంత్రి పదవి ఆరో వేలు వంటిదని వ్యాక్యనించారు నీలం.విచిత్రం ఏంటంటే......కర్నూల్ రాజధాని గ ఉన్న అప్పటి ఆంధ్ర రాష్ట్రానికి 13 నెలల పాటు ఉపముక్యమంత్రిగా పనిచేసాడు .
- రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు 13,ఇందులో .....9 ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయ్!తెలంగాణలో ఉన్నవి నాలుగు కాలేజిలే .ఆ నాలుగింటిలో రెండు రాజధాని హైదరాబాద్ లో ఉన్నాయ్!ఆ రెండు నిజాం స్థాపంచిన ఉస్మానియా.......గాంధి మెడికల్ కాలేజిలు! మొత్తంగా రాష్ట్రంలో 1800 మెడికల్ సీట్లు ఉండగా .పది జిల్లాలు ,40 .69 శాతం జనాబా ఉన్న తెలంగాణకు దక్కినది కేవలం 600 సీట్లే !అంతేకాదు ......రాజధాని హైదరాబాద్లో ఉన్న 350 సీట్లలో సగం కూడా తెలంగాణ విద్యార్థులకు దక్కట్లేదు.
- రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంగించి ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లో 1969 నుంచి 1985 మధ్య కాలంలో 58 వేల మందియా ఆంధ్ర ప్రాంతీయులను నియనిన్చినట్టు జై భారత్ రెడ్డి కమిషన్ తేల్చి చెప్పింది!తెలంగాణ ఉద్యోగ సంఘాల ఆందోళనతో....1985 లో అప్పటి ప్రభుత్వం అక్రంగా నియమితులైన వ్యక్తులను వెనక్కి పంపడానికి జీవో 610...విడుదల చేసింది.ఒక సంవత్సరంలోగా ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది కాని 25 సంవత్సరాలు గడుస్తున్న నేటికి ఆ జీవో అమలుకు నోచుకోలేదు .మలి దశ తెలంగాణ ఉద్యమమ మొదలైన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం 610 జీవో పై వేసిన గిర్ గ్లాని కమిషన్ 2004 లో తన నివేదిక ఇచ్చింది.ఉల్లంగానాలు యదేచ్చగా కొనసాగుతున్నై అని తేల్చింది.రూల్స్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని తేల్చి....వాళ్ళను వెనక్కి పంపాలని సిఫారసు చేసింది.నిజాన్ని కుండబద్దలు కొట్టిన నిజాయితి గల ఒక సీనియర్ అధికారి గిర్ గ్లాని సిఫారసు లకు ఇవాల్టికి దిక్కు మొక్కు లేదు.తెలంగాణ ఉద్యోగ సంఘాల లెక్క ప్రకారం ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగాల్లో రెండు లక్షల మంది ఆంధ్ర ప్రాంతీయులు పనిచేస్తున్నారు!
- రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్యా 18,ఇందులో 12 ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్నాయ్ తెలంగాణలో ఉన్నవి కేవలం 6 !మొత్తం గవర్నమెంట్ ఇంజనీరింగ్ సీట్ల సంఖ్యా 3760 ఇందులో 2625 సీట్లు.....అంటే సుమారు 70 శాతంఆంధ్ర కాలేజీ ల లో నే ఉన్నాయ్. తెలంగాణ విద్యార్థులకు అందుభాటులో ఉన్న సీట్లు 1135 మాత్రమే!వీటిలో కూడా రాజధాని లో ఉన్న 710 సీట్లు తెలంగాణ విద్యార్థులకు పూర్తిగా దక్కడం లేదు.
- తెలంగాణ అనే అంశం పైకి లేచిన ప్రతి సారి చాల మంది తెలంగాణ లేదా ఆంధ్ర కు గుడ్డిగా సపోర్ట్ చేస్తారు .1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి మన తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉంది .మనకు జరిగిన అన్యాయాలు ఒక్కసారి చుడండి .
- తెలంగాణ లో 10 జిల్లాలు,ఆంధ్ర లో 9 జిల్లాలు మరియు రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నాయ్.ఇందులో తెలంగాణలోని 7 జిల్లాలు,ఆంధ్రలోని 3 జిల్లాలు,రాయలసీమలోని 1 జిల్లా వెనుక బడి ఉన్నాయ్ . అంటే దాదాపు 70% తెలంగాణ జిల్లాలు ,35% ఆంధ్ర జిల్లాలు మరియు 25% రాయలసీమ జిల్లాలు వెనక బడి ఉన్నాయ్.
- 45% రాష్ట్ర ఆదాయం తెలంగాణ నుంచి వస్తుండగా 28% మాత్రమే తెలంగాణకు కర్చు పెడుతున్నారు మిగితా ఆదాయాన్ని ఆంధ్ర మరియు రాయలసీమలో కర్చు పెడుతున్నారు.
- మాములుగా మనం కేనాల్స్ ద్వారా పంట సాగు చేస్తాం .ఆ కేనల్స్ ద్వారా సాగు అవుతున్నమన తెలంగాణ లోని భూమి ఒక్క గుంటూరు జిల్లా(ఆంధ్ర) లో సాగు అవుతున్న భూమి కన్నా తక్కువ అంటే నమ్మశక్యం కాదు.
- నాగార్జున సాగర్ డ్యాం నల్గొండ(తెలంగాణ) జిల్లా లో ఉంది .కాని దాని నుంచి కృష్ణా మరియు గుంటూరు జిల్లాలు మాత్రమే సాగు అవుతున్నవి .
- రెండు పెద్ద నదులు ఐనటువంటి కృష్ణా మరియు తుంగబధ్ర నదులు రాష్ట్రంలోకి మహబూబ్ నగర్ లో ప్రవేశిస్తున్నై కాని ఆ జిల్లా ఎప్పుడు కరువుతో అల్లలాడుతుంది .
- RDS ప్రాజెక్టూ మహబూబ్ నగర్ లో 85000 ఎకరాలు సాగు చేయడానికి నిర్మించగా రాయలసీమ నాయకులూ ఆ ప్రాజెక్టూ గేట్లను పేల్చేసి కర్నూల్-కడప ప్రాజెక్టూ కు తరలిస్తున్నారు.
- తెలంగాణ జిల్లాల్లో సంవత్సరానికి ఒక్క పంటనే పండించగాలుగుతున్నాం కాని ఆంధ్ర మరియు రాయలసీమలలో మాత్రం ఒక సంవత్సరానికి మూడేసి పంటలు పండిస్తున్నారు కారణం నీరు .
- 1986 లో తెర పైకి వచ్చిన 610 G.O ఇప్పటి వరకు అమలు కాలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు .మాములుగా 610G.O ఎక్కడి ప్రాంత ఉద్యోగాలు అక్కడి ప్రాంతం వాళ్ళు చేసుకోవాలని రూపొందించింది కాని ఆంధ్ర వాళ్ళకు ఇక్కడ ఉద్యోగాలు రావని చేసిన కుట్ర ఇది .భారతదేశ చరిత్రలో 25 సంవత్సరాలుగా అమలు కాని ఏకైక G.O 610 G.O.
- సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కింద తెలంగాణా లోని ఐదు జిల్లాలు ,సీమంద్ర లోని రెండు జిల్లాలు ఉన్నాయి ,ఆని ఉద్యోగులు మాత్రం సీమంద్ర నుంచు ఐదుగురు కాగ తెలంగాణా నుంచి ఇద్దరు ఇదెక్కడి న్యాయం సీమంద్ర పాలకులారా?ఒక్కసారి ఆలోచించండి
Monday, 1 August 2011
Why We Need Telangana..in telugu
- పెద్దమనుషుల ఒప్పందాన్ని ఏనాడూ ఆంధ్రులు అమలు చేయలేదు. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వటంలేదు.
- కృష్ణా గోదావరి నదుల పరివాహక ప్రాంతం 80 శాతం మాదైతే 88 శాతం నీళ్ళు వాళ్ళవి. కరెంటు70 శాతం ఉత్పత్తి మాది. 80 శాతం పంట ఋణాలు వాళ్ళవి. మూడొంతుల ఉద్యోగాలు వాళ్ళవి.
- శాంతియుతంగా అన్నదమ్ముల్లా విడిపోదాం.
- తెలంగాణ వద్ద ఉన్న వనరులతో ఆంధ్ర ప్రాంతం ఇప్పటికే చాలా ప్రయోజనం పొందింది.
- ప్రత్యేక తెలంగాణం.. స్వాభిమానానికి ప్రతీక. ప్రత్యేక తెలంగాణాపై యాభై ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇది ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టింది.
- రాజ్యాంగం ప్రకారం చూసినా రాష్ట్రాల ఏర్పాటు అనేది కేంద్ర పరిధిలోని అంశం. అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదు. అది లేకుండానూ కేంద్రం ఆమోదించవచ్చు.
- తమిళనాడుకే తెలుగుగంగ నీళ్లు ఇస్తున్నప్పుడు తెలంగాణా నుంచి ఆంధ్రకు నీళ్లు అందకుండా చేస్తారని అనుకోవడం సరికాదు.
- భౌగోళిక, చారిత్రక కోణాల్లో ఎలా చూసినా హైదరాబాద్ తెలంగాణాలో అంతర్భాగమే.
- విలీనం నాటికి తెలంగాణాయే పారిశ్రామికంగా ముందుండేది. గత యాభై ఏళ్లుగా తెలంగాణా చాలా త్యాగాలు చేసింది. ఆంధ్ర అభివృద్ధిలో ఎక్కువ భాగాన్ని ఆంధ్రలోని సంపన్నులు తీసుకున్నారు. తెలంగాణ వివక్షకు గురైంది. సింగరేణిలో, సచివాలయంలో అన్నిచోట్లా కోస్తావారే ముఖ్యమైన ఉద్యోగాల్లో ఉన్నారు. ఇది ఆర్థిక అసమానతలకు దారి తీసింది.
- బడ్జెట్ కేటాయింపులోనూ ఆంధ్రాకే అగ్రస్థానం.
1. Catchment area of Krishna Basin.
Seemandhra | Telangana |
31% | 69% |
2. Allocation of Krishna Water - Recommendation
Seemandhra | Telangana |
35% | 65% |
3. Actual utilization of Krishna Water
Seemandhra | Telangana |
100% | Less than 1% |
4. Catchment area of Godavari River
Andhra | Telangana |
21% (310 TMC) | 79%(1170 TMC) |
5. Utilization of Godavari Water
Seemandhra | Telangana |
23% (100% TMC) | 9.6% (1435 ml) |
Note: 405 TMC is being diverted.
6. Total loss of water share of Telangana 1125 TMC
Note: 1 TMC to serve 10,000 acres.
7. Total cultivation land of Telangana
Lost is 11,25,000 Acres.
8. Backward Districts
Telangana | Andhra | Rayalaseema |
70% | 35% | 25% |
9.Telangana Region CM’s combined Tenure : 6 years
CM’s from Rayalaseema = 23 years
CM’s from Coastal Andhra = 20 years
10.Projects:
Telangana - SLBC (30 TMC) – not taken up.
- SLBC beyond Musi – (20 TMC) not taken up
- RDS (10 TMC) not taken up
- LIS (Mahabubnagar) not taken up
- Bheema (LIS 20 TMC) – Under construction.
Seemandhra - Telugu Ganga (29 TMC) – completed
- SRBC (19 TMC) – completed
- Pulichintala (5ml) – almost completed
- Veligonda (40 TMC) – almost completed
- Handrineeva (38 TMC) – almost completed
- Galerunagari Sujala Sravanthi (38 TMC) – almost completed
- Galerunagari Sujala Sravanthi run through Chittoor via Anantapur.
11.Education - Funds spent on education:
Seemandhra - 1691.43 Crores
Telangana - 163.39 Crores
12.Literacy:
Andhra | Rayalaseema | Telangana |
42% | 38% | 30% |
13. Schools
Seemandhra | Telangana |
39,800 | 17,954 |
14.Hospital
Seemandhra | Telangana |
969 | 270 |
15.Govt. Employees
Seemandhra | Telangana |
9 lakhs | 3 Lakhs |
16.Industries
Seemandhra | Telangana |
6873 | 1250 |
17.Power Utilization
Seemandhra | Telangana |
77% | 23% |
18.For Nagarjuna Sagar Project.
| Andhra | Telangana |
Submerged Land | 0% | 100% |
Cultivation Land | 20 lakh Acres | 4.5 lakhs |
19.Polavaram Project submerging 250 Villages, displacing 5 lakh tribals.
20.Govt. Libraries
Seemandhra | Telangana |
873 | 450 |
21.Panchayath Raj Divisions
Seemandhra | Telangana |
1225% | 295% |
22.White Ration Cards
Most Backward District – Mahaboobnagar 4%
Most developed district – West Godavari 7%
23.Lands
Andhra | Telangana |
Canal Cultivated | Borewells cultivated |
24.Private Aided Degree Colleges
Seemandhra | Telangana |
128 | 30 |
25.Forts are about to ruin in Telangana – 150
26.Migration from Mahabubnagar
- 14 lakhs population out of 35 lakhs
27.A.P. Dairy
Buys Milk from Farmers at the rate of
Seemandhra | Telangana |
Rs.24.30 | Rs.22.30 |
28.Telangana is bigger than – 24 States.
- 160 Countries
(Out of 194)
29.Revenue and expenditure
Seemandhra | Telangana |
Revenue – 38.5% | 61.5% |
Expenditure-49% | 51% |
30.Jobs by Bogus mulk certificates Seemandhrites got 28000 jobs in between 1956-1968. 58000 jobs in 1975 to 1985.
31.Reservation in posts for Telangana people according to Presidential Order
80% District Posts
70% Zonal Posts
60% Gazetted Posts
32. 610 G.0. Restricted to 102 Departments (Out of 250 Govt. Departments)
33. Singareni Coal
23% used in Telangana
77% used in Seemandhra
34.Funds allocation (per capital to student)
S.V. University - Rs.37,500
Andhra University - Rs.35,500
S.K. University - Rs.25,000
Nagarjuna University- Rs.22,700
Osmania University - Rs.17,400
Kakatiya University - Rs.14,000
35.Cultivation land (Lakh acres)
| Andhra | Telangana |
Before 1956 | 30.65 | 18.20 |
In 2004 | 69.27 | 18.00 |
36.Daily wage workers working in Industries
Seemandhra | Telangana |
3.23 lakhs | 0.81 lakhs |
37.Technical Institutions
Andhra | Telangana |
54 | 26 |
38.Polytechnic Colleges
Andhra | Telangana |
70 | 20 |
39.Medical Colleges
Andhra | Telangana |
6 | 2 |