Thursday, 15 September 2011

vudyama bata pi givo thuta(ఉద్యమబాటపై జీవో తూటా!)

రాష్ట్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా విద్యా ప్రమాణాల పెంపొందించాలని, అకస్మాత్తుగా సెప్టెంబర్ 9న విడుద ల చేసిన జీవో 130 ఉపాధ్యాయ వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ జీవో ముఖ్యంగా తెలంగాణ టీచర్ల మెడమీద కత్తిలా వేలాడుతోం ది. ఇది ఆ జీవోలోని సారాంశాన్ని చూస్తే అర్థ్ధమవుతుంది. కేంద్ర ప్రభుత్వం 2010 ఏప్రిల్1 రోజున విద్యాహక్కును అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి నిర్ణయించింది. అందులో భాగంగా మన రాష్ట్రం జీవో ఎంఎస్ నెం.20 03.03.2011 నుంచి, కేంద్ర ప్రభుత్వ చట్టానికి అనుగుణంగా సర్వశిక్షా అభియాన్ ద్వారా దాన్ని అమలుకు పూనుకున్నది. ఇట్టి జీవో అమలు కోసం రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభుత్వానికి విద్యాహక్కు అమలుకు చేపట్టాల్సిన చర్యల గూర్చి లేఖ నెం.16 ద్వారా సూచించారు.
edit-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaవిద్యాహక్కు చట్టంలోని అంశాలలో మార్పు చేపట్టాలని అనేక మంది మేధావులు విద్యావేత్తలు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు సూచించాయి. అయితే అటు కేంద్ర ఫ్రభుత్వం గానీ ఇటు రాష్ట్ర ప్రభు త్వం గానీ ఆ మార్పుల గురించి పట్టించుకోలేదు. ప్రభుత్వం విద్యారంగంలో 1 నుంచి 8 తరగతుల వరకే తమ బాధ్యత అన్నట్లు వ్యవ హరిస్తున్నది. 1వ తరగతి కంటే ముందున్న పూర్వ బాల్యదశ గురించి కానీ 8వ తరగతి అనంతరం పాఠశాల, కళాశాల విద్య గురించి గానీ పట్టించుకోవడం లేదు. ఆర్‌ఈఎంకు నిధులు అందిస్తున్నా విదేశీ, స్వదేశీ సంస్థలు సూచనల మేరకు ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రజల భాగస్వామ్యం పేర స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ)లకు నిర్వహణ, పరిశీలన, పర్యవేక్షణ తదితర మౌలిక వసతుల కల్పనకు అప్పగించింది. పాఠ్యాంశాల ద్వారా ఏమి చెప్పాలో ఎవరి కోసం చెప్పాలో నిర్దేశించే శిక్షణలు మాత్రం రాజీవ్ విద్యామిషన్ ఆర్‌ఎస్‌ఎంఎలకు నిధు లు, విధులు అప్పగించడం ద్వారా విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది.

ఆ నేపథ్యంలోని స్కూల్ మేనేజ్‌మెం ట్ కమిటీల ఏర్పాటు చేతుపూత్తడం లేదా ఎన్నికల ద్వారానైనా తరగతికో ఆరుగు రు తల్లిదంవూడుల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతంలోని గ్రామీణ కమిటీ ల అదేస్థాయిలో మండల, జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచింది. ఈ కమిటీలు ఆయా స్థాయి ల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతలతో పాటు టీచర్లపై అనవసర పెత్తనాన్ని చెలాయించగల స్థితిని కల్పించారు. ఈ కమిటీలు నిజం గా పాఠశాల విద్యారంగ అభివృద్ధికి దోహదపడితే ఆహ్వానించదగ్గవే. కానీ ఇవ్వాళ గ్రామీణ ప్రాంతాల్లో నెలకొని ఉన్న రాజకీయ పెత్తనం ఎట్లా విద్యావ్యవస్థను శాసిస్తున్నదో తెలిసిందే. సకల రంగాల్లో కాంట్రాక్టర్ల కోసం వెంపర్లాడే నాయకులు అక్కడక్కడ ప్రభుత్వం ఆయా పథకాల ద్వారా విడుదల చేస్తున్న నిధులను పాఠశాలకు ఖర్చు చేస్తే మాకేంటి? అన్న పద్ధతిలో ప్రధానోపాధ్యాయులను పర్సం కోసం, కాంట్రాక్టర్ల కోసం వేధిస్తున్న సంఘటనలు అనేకం.

కేవలం మధ్యాహ్న భోజన ఏజెన్సీ కోసం ఎన్ని గొడవలు సృష్టిస్తున్నారో రోజూ పత్రికల్లో చూస్తున్నాం. ఇలాంటి స్థితిలో ఎన్నికలు జరపాలన్న అంశం తో పాటు, అతి ప్రమాదకరమైన ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని కప్పిపుచ్చుకొని తెలంగాణ టీచర్లను బలిపీఠం ఎక్కించ పూనుకున్న ప్రభు త్వం కుట్రకు నిదర్శనమే 130 జీవో.

‘అన్నం మెతుకులు ఒకచోట ఆకలి మంటలు ఇంకోచోట‘ అన్న కాళోజీ జయంతి రోజున ఈ జీవో విడుదలైంది. ఆయన మాటల్లోనే ఇక్కడి నీళ్ళు, నిధులు కొళ్లగొట్టుకుపోయినా సీమాంధ్ర ప్రాంతంలో మూడు పూటలా పంటలు పండటం వల్ల అయితేనేమి ఆంగ్లా ఆంధ్రా ఆధిపత్యం వల్ల అప్పనంగా తెలంగాణ ప్రాంత విద్య ఉద్యోగ రంగాల్లో తిష్ట వేసిన అధికారుల అసంబద్ధ ప్రణాళికల వల్ల అయితేనేమీ తెలంగాణ ప్రాంత విద్యారంగం సకల సమస్యలను ఎదుర్కొంటున్నది. అత్యధిక అక్షరాస్యత పెరగడానికి కారణమైన గోదావరి జిల్లాలకు అత్యధికంగా బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకొని పలకా బలపం చేతపట్టాల్సిన పిల్లలు వలసపోతున్న పాలమూరు, అక్షరాస్యత అథోగతిలో ఉండడానికి కారణం ఆంధ్ర వలసాధిపత్య పాలన, వివక్ష తప్ప మరొకటి కాదు.

కన్నబిడ్డల్ని అమ్ముకునే దౌర్భాగ్య స్థితిలో బడికి పంప డం ఓ కళ అయిన చోట, మూడుపూటలా తిని ఏ రందీ లేకుండా చదువుకునే పరిస్థితులున్న ప్రాంతానికి మధ్య సమస్యలను అర్థం చేసుకో లేం. అట్లాంటి స్థితిగతుల్ని మార్చడం ద్వారా విద్యారంగాన్ని తెలంగాణ సామాజిక మార్పు కోసం సాగుతున్న పోరాటంలో ఉపాధ్యాయ వర్గం విద్యార్థులు పోరాటబాట పట్టడం సహజం. తాము చదివిన చదువుకు ఎలాంటి భవిష్యత్తు లేనిచోట తమ బతుకు బాగుకోసం పోరాడే శక్తుల్ని నియంవూతించడానికి ప్రభుత్వం కుట్ర పన్నింది.
2009,డిసెంబర్ 9 నాటి తెలంగాణ ప్రక్రియ సజావుగా సాగి ఉంటే ఇవ్వాళ తెలంగాణ సమాజం ఇంత ఆందోళన, ఆవేదనకు గురయ్యేది కాదు. రెండు సంవత్సరాలుగా పాఠశాల, కళాశాలలు బంద్, ఆందోళనలు తదితర పోరాటాలతో పాటు పాఠశాలల్లో మంచినీళ్ల కోసం, పుస్తకాల కోసం మధ్యాహ్న మెతుకుల కోసం పోరాడటం చూస్తున్నాం.

ఇవి తెలిసినా పట్టించుకోకుండా పిల్లలు చదువుతున్న తరగతుల్లో 60 శాతం కన్నా తరగతి మొత్తం అన్ని సబ్జెక్టుల్లో ఫలితా లు తగ్గితే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు, డిస్మిస్, సస్పెన్షన్ మేజర్ ఫెనాల్టీస్ సెక్షన్ 323 కింద కేసులు పెట్టడానికి కూడా వెనకాడేదిలేదని 130లో స్పష్టం చేసింది. ఈ బెదిరింపులు నిజంగానే విద్యా ప్రమాణాలు పెంచడానికే అయితే స్వాగతించవచ్చు. కానీ ప్రభుత్వమే స్వయంగా విద్యా ప్రమాణాలను దిగజార్చే పద్ధతులను, పథకాలను అమలుచేస్తూ నేరం టీచర్ల మీదకు నెట్టచూపడం తీవ్రంగా వ్యతిరేకించాల్సి ఉంది. ప్రాథమికస్థాయిలో తరగతికో టీచర్ తరగతి గదిలేని పాఠశాలలు, వేల సంఖ్యలో ఉన్నట్లు ‘కాగ్’ నివేదిక స్పష్టం చేసింది. సుమా రు 70వేల పాఠశాలల్లో మెజార్టీ 70 శాతం పాఠశాలలకు కనీసం సురక్షితమై న మంచినీటి సౌకర్యం లేదు.

ఆడపిల్లలకు మూత్రశాలలు లేవని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. వీటి కోసం విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా జీవోలు విడుదల చేసింది. కానీ నిధులు విడుదల చేయకుండా వేలాది పర్యవేక్షణాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారులు నిర్లక్షం వహిస్తున్నారు. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీ స్ రూల్స్ అంశం ఏళ్ల తరబడిగా పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమ య్యాయి. వీటితో పాటు ప్రభుత్వమే మాతృభాష పట్ల ప్రైవేట్ విద్యాసంస్థల పట్ల కనబరుస్తున్న ఇంగ్లీషు మోజు, కార్పొరేట్, కాన్సెప్ట్ ఆంధ్రా విద్యాసంస్థల ఆధిపత్యంలో మొత్తం తెలంగాణ విద్యారంగం కుప్పకూలిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. వీటి మెరుగుదల కోసం రేపటి తెలంగాణలో ప్రాథమిక స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు ఉచిత నిర్బంధ విద్యను కామన్ స్కూల్ విధానంలో అమలు చేసుకోవడం కోసం తెలంగాణ టీచర్లు గొంతెత్తడం చూస్తున్నాం.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగుతున్న ‘సకల జనుల’ సమ్మెలో ఉపాధ్యాయులు పాల్గొనకుండా,విద్యా ప్రమాణాలు తగ్గుతాయన్న పేరుతో ప్రభుత్వం పన్నాగం పన్నింది. ప్రభుత్వం విడుదల చేసిన 130 జీవోలో ఉపాధ్యాయులను బెదిరించ చూడటం అప్రజాస్వామికం. ఈ జీవో అందరికీ వర్తించేలా ఉన్నప్పటికీ మొత్తం విద్యా వ్యవస్థలోని లోటుపాట్లను సరిచేయకుండా అమ లు చేయపూనుకోవడడం ప్రాంతీయ వివక్షే. ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా అణగదొక్కడం అన్యాయం. ఈ అన్యాయాలను, అక్రమాలను ఎదుర్కొవాలంటే తెలంగాణ రాష్ట్ర సాధనతోనే అది సాధ్యమవుతుంది. అందుకోసమే యావత్ తెలంగాణ టీచర్లు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యస్తున్నారు. అలాగే తెలంగాణలో మెరుగైన విద్యావిధానం కోసం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పోరాటం తప్ప మరో మార్గంలేదు.

No comments:

Post a Comment