గావులలో 60 ఏండ్ల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఉట్టిపడింది. కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు ప్రకటన వెలువడితే తప్ప మా సమ్మె విరమణ చేసే ప్రసక్త్తి లేదంటున్నారు... మొత్తం 50 బొగ్గు బావులలో రోజుకు లక్షా 45 వేల టన్నుల ఉత్పత్తి అంతా ఆగిపోయింది... లక్ష టన్నులకుపైగా జరిగే రవాణా ఆగింది. రెండు, మూడు రోజులకన్నా ఎక్కువ సరిపోయే స్టాకు విద్యుత్ ప్లాంటులలో నిలువ లేదు. కార్మికులు సకల జనుల సమ్మెలో పట్టుదలతో సమ్మెలో పాల్గొంటున్నారు. పుట్టెడు బండ కిందకుపోయి రాక్షసి బొగ్గును ఉత్పత్తి చేస్తూ దక్షిణ భారతదేశానికి వెలుగును ప్రసాదిస్త్తున్న ఆ కార్మికుల వెతలు తీరాలంటే తెలంగాణ ఏర్పాటు కావాల్సిందేననే విషయాన్ని కార్మికులే కాదు వారి కుటుంబాలు నమ్ముతాయి... నమ్ముతున్నాయి.... ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని బొగ్గు గనుల ప్రాంతం ఎన్నో ఉద్యమాలకు ప్రతీక... ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు ఇక్కడ పురుడుపోసుకున్నాయి. జీవించే హక్కు కోసం ప్రతి పేదవాడు మంచిగా బతకాలని ఆశించే ఎందరో ఉద్యమ కారులు పుట్టిన గడ్డ ఇది. సింగరేణి కార్మికులు తమ హక్కుల కోసం 56 రోజుల వరకు సుదీర్ఘ సమ్మెలు చేసి న చరిత్ర ఉంది. సింగరేణిలో ప్రస్తుతం తెలంగాణ ఉద్యమం అంటుకున్నకొలిమిలా కొనసాగుతోంది. దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా సింగరేణిలో కార్మిక వర్గం తెలంగాణ ఆకాంక్షతో ఈ ఏడాది తొమ్మిది సార్లు తమ విధులు బహిష్కరించి పార్లమెంటులో ప్రత్యేక రాష్ట్ర బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధించేంత వరకు సమ్మె ఆపేది లేదని, బొగ్గు పెల్ల బయటకు తీసేది లేదని, పంపేది లేదని గిరిగీసి కూర్చున్నారు బొగ్గు గని కార్మికులు...
బొగ్గు గని కార్మికులు ఈ రోజు తమ బతుకులు బాగు పడటం కోసం, తమ సింగరేణిని దక్కించుకోవడం కోసం, తమ వనరులను తాము కాపాడుకోవడం కోసం, తమ పిల్లలకు ఉద్యోగాలు రావాలని తెలంగాణ రావాలని కోరుకుంటున్నారు... ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ నుంచి దూరంగా సంస్థను రక్షించుకోవడం కోసం ఉద్యమిస్తున్నారు. ఇదే సంవత్సరం తెలంగాణ మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగులు సహాయ నిరాకరణలో పాల్గొన్న సందర్భంలో సింగరేణిలోనూ సహాయ నిరాకరణ కార్యక్షికమం కొనసాగింది. చాలా మంది కార్మికులు ఈ ఉద్యమంలో అరెస్టులకు కూడా గురయ్యారు... జైలుపాలయిన వారు ఉన్నారు. చరివూతలో ఎన్నడూ లేని విధంగా సంస్థలో పని చేసే అధికారులు కూడా ఈ ఏడాది జూలై ఐదు, ఆరు తేదీలలో కార్మికులతోపాటు తెలంగాణ కోసం విధులను బహిష్కరించారు. ఇది చారివూతక ఘట్టం.
సింగరేణిలో దశాబ్దాలుగా వలస వాదుల రాజ్యం కొనసాగుతుంది... అధికార గణంలో వారే మెజార్టీలో ఉన్నారు. ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కొంత తెలంగాణ వాదులకు అవకాశాలు వస్తున్నాయి...
ఇదంతా ఉద్యమ ఫలితంగానే జరుగుతున్నది. అయితే ఇప్పటికి సింగరేణిలో 610జీవో కూడా సంపూర్ణంగా అమలు కాలేదు. సీమాంధ్ర వాసుల కోసం మూడున్నర దశాబ్దాల క్రితం క్లరికల్ ఉద్యోగానికి డిగ్రీ అర్హతగా ఉండేది. వాస్తవానికి ఈ రోజు వరకు కూడా అటు కేంద్రంలో, ఇటు రాష్ర్టంలో క్లరికల్ ఉద్యోగానికి ఎస్‌ఎస్‌సీ మాత్రమే అర్హతగా ఉన్నది. అయితే సింగరేణిలో మాత్రం డిగ్రీ అర్హతగా నిర్ణయిం చారు. కేవలం అప్పట్లో తెలంగాణలో విద్యా సౌకర్యం అతి తక్కువ ఉండటం మూలకంగా 10వ తరగతి వరకే చదువులు ఆపేసిన వారు చాలా మంది ఉండేవారు. అలాంటి వారికి క్లరికల్ ఉద్యోగం దొరకకుండా సింగరేణిలో కొంత మంది ఆంధ్రా డైరెక్టర్‌లు ఈ అర్హతను డిగ్రీగా మార్చేశారు. దానితో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వేలాది మంది వచ్చి ఇక్కడ క్లర్కులుగా చేరిపోయారు. ఇలాంటి సింగరేణిలో జరిగాయి. క్వార్టర్ల కేటాయింపులో, ప్రమోషన్‌లలోనూ ఇలా వివక్ష కొనసాగింది.
1969, 1972 ప్రాంతంలో కూడా సింగరేణిలో వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాలు పంచుకున్న వారు సింగరేణి వివక్ష గురించి ఇప్పటికి కథలు కథలు గా చెప్పుకుంటుంటారు. నాటి నుంచి రగులుకుంటూ వచ్చిన తెలంగాణ ఆకాంక్ష ఇప్పు డు ఉప్పెనలా బయటకు వచ్చింది. ఈ రోజు కార్మికులు తెలంగాణ కోసం నిరవధిక సమ్మె చేసి దక్షిణ దేశం మొత్తం కూడా పారిక్షిశామిక సంక్షోభాన్ని సృష్టించడానికి సిద్ధమయ్యారు.తెలంగాణ ప్రాంతం ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసిన నేపథ్యంలో వారిని అభినందిస్తూనే కార్మికులు రాజీనామా చేయని వారి దిష్టిబొమ్మలను కూడా దహనం చేస్తున్నారు. రాజీనామా చేయని ప్రజావూపతినిధులను బొగ్గు బావుల ప్రాంతానికి రానివ్వమని మొట్ట మొదట ఏడాది క్రితమే వారిని బహిష్కరించిన, పిలుపునిచ్చిన ఘనత కూడా బొగ్గు గని కార్మికులదే. ఈ రోజు కార్మిక సంఘాల కార్యకలాపాలకు అతీతంగా దాదాపు అన్ని కార్మిక సంఘాలు కలిసి పని చేస్తున్న ఉద్యమం కూడా ఇదే కావడం విశేషం.
అపజయం ఎరుగని తిరుగుబాటుకు మరో పేరయిన సింగరేణి బిడ్డలు ఈ రోజు తెలంగాణ కోసం ఉద్యమించడం అదికూడా తమ గమ్యాన్ని చేరుకునే వరకు ఆగేది లేదని ప్రకటించడం శుభసూచకం. సకల జనుల సమ్మె ద్వారా దక్షిణ భారతదేశంలో పారిక్షిశామిక సంక్షోభం సృష్టించయినా తెలంగాణను సాధించుకుంటామనే గట్టి నమ్మకంతో కార్మికులు ఉన్నారు. నాలుగు వేలకుపైగా దక్షిణ భారతదేశంలోని పరిక్షిశమలన్నీ గని కార్మికుల ఈ సమ్మెతో బంద్ అయిపోతాయి. సమ్మెతో స్వరాష్ట్రాన్ని సాధించుకుంటామని కార్మికులు నినదిస్తున్నారు.

No comments:
Post a Comment