Saturday 6 August 2011

pratheyaka telangana ni chandrababu naidu addukunnadu(ప్రత్యేక తెలంగాణను చంద్రబాబు అడ్డుకున్నారు):survey

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అడ్డుకున్నారని ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీ సర్వే సత్యనారాయణ విమర్శించారు. 2002లో సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణ ఇవ్వవద్దని బీజేపీ నేతలకు చెప్పారని సర్వే ఆరోపించారు. సావధాన తీర్మానం పెట్టిన బీజేపీపై కూడా సర్వే విమర్శలు సంధించారు. తెలంగాణ అంశం బీజేపీ, ఎన్‌డీఏ పాలనలో కూడా ఉందని, కానీ వారు విస్మరించారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వద్దంటూ ఎల్.కె.అద్వానీ అప్పటి బీజేపీ ఎంపీ ఆలె నరేంద్రకు లేఖ రాసిన విషయాన్ని చెప్పారు.

ఆనాడే తెలంగాణ ఇచ్చి ఉంటే ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలపటం అభినందనీయమన్నారు. యూపీఏ సర్కారు ద్వారా కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. కేంద్రం నుంచి తప్పుడు ప్రకటనలు రావటం వల్లే ఆత్మబలిదానాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ‘‘తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఒక వేళ నేను కూడా రాజీనామా ఇస్తే.. నాసోదరుడు (పక్కనే ఉన్న అంజన్‌కుమార్ యాదవ్‌ను చూపిస్తూ) కూడా రాజీనామా చేస్తే తెలంగాణపై పార్లమెంటులో మాట్లాడేందుకు ఎవరూ ఉండరు’’ అంటూ తను రాజీనామా చేయకపోవటానికి కారణం చెప్పారు.

స్వరాజ్యం నా జన్మహక్కు అని చాటిచెప్పిన బాలగంగాధర్‌తిలక్ స్ఫూర్తిగా ముందుకు వెళ్తానని సర్వే చెప్పారు. ‘‘తెలంగాణ వాలే జాగో.. ఆంధ్రా వాలే భాగో’ అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీది ‘భాగో’ నినాదం కాదు. ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఉండవచ్చు. ఆత్మగౌరవం, స్వయంపాలన కోసం ప్రత్యేక తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని వివరించారు. యూపీ కాంగ్రెస్ కమిటీ చేసిన రెండో ఎస్సార్సీ తీర్మానాన్ని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు ఆపాదించారని సర్వే ఆరోపించారు. రెండో ఎస్సార్సీ వేస్తారని, ఇక తెలంగాణ రాదని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ప్రచారం చేశారని విమర్శించారు.

No comments:

Post a Comment