హింసిస్తున్న పోలీసుల వివరాలు సేకరిస్తున్నాం: కేటీఆర్
- గీత దాటుతున్న ఖాకీలు: కోదండరాం
- వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదు: ఈటెల
- నిజాం కాలేజీ విద్యార్థులకు పరామర్శ నాంపల్లి,
ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసు కుక్కలు నిజాం హాస్టల్‌లోకి చొరబడి తెలంగాణ బిడ్డలపై క్రూరంగా దాడులు చేశాయని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్యని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఉస్మానియా, కాకతీయ యునివర్సిటీలతోపాటు నిజాంలో విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదిన పోలీసు అధికారులను వివరాలు సేకరిస్తున్నామన్నారు. విద్యార్థులను దారుణంగా హింసిస్తున్న పోలీసులను, తెలంగాణ వచ్చిన తర్వాత బట్టలూడదీసి, శంకరగిరి మాన్యాలకు పట్టిస్తామని హెచ్చరించారు. నిజాం హాస్టల్‌లో జరిగిన పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన విద్యార్థులను మంగళవారం జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్‌తో కలిసి కేటీఆర్ పరామర్శించారు.
ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులపై జరిగిన దాడులు.. నాలుగున్నర కోట్లమంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. తాను హైదరాబాదీనేనని, ఇదే కళాశాలలో చదివిన సీఎం కిరణ్‌కుమార్‌డ్డి చెప్పుకుంటున్నారని, ఆయన పర్యవేక్షణలోనే ఖాకీలు విద్యార్థులను చితకబాదడం దారుణమని మండిపడ్డారు. దీనికి బాధ్యులైన పోలీసులను సీఎం కనీసం మందలించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు అకున్ సబర్వాల్, నర్సయ్య, శివకుమార్‌లు రెచ్చిపోయి విద్యార్థులను కొట్టారని, వారి సంగతి తర్వాత తేల్చుతామని హెచ్చరించారు. వీరు తీరు మారకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని స్పష్టం చేశారు.
రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడంలో భాగంగానే పోలీసుల దారుణాలు పెచుమీరుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అసెంబ్లీకి కూతవేటు దూరాన ఉన్న నిజాం హాస్టల్‌పై పోలీసులు విరుచుకుపడటం దారుణమని ఖండించారు. విద్యార్థులపై దమనినీతి ప్రదర్శించి పోలీసు అధికారులు సర్కారు పట్ల తమకున్న రాజభక్తిని చాటుకున్నారని మండిపడ్డారు. వారు రేపు తెలంగాణ వచ్చిన తర్వాత వడ్డీతో సహా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్షికమంలో మాజీ ఎంపి వినోద్‌కుమార్, బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తావూతేయ, ఏబీవీపీ జాతీయ కార్యదర్శి కడియం రాజు, వెంకటడ్డి పాల్గొన్నారు.
ప్రిన్సిపాల్ రాజీనామా..ఆ తర్వాత మాట మార్చి...
పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించేందుకు వచ్చిన ప్రిన్సిపాల్ నాయుడు అశోక్‌పై విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిని నిరసిస్తూ ఆయనను నిలదీశారు. విద్యార్థులపై అకారణంగా దాడి జరిపించిన డీసీపీ అకున్ సబర్వాల్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయాలని పట్టుపట్టారు. పోలీసులు రెచ్చిపోవడానికి ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయనను ఘెరావ్ చేశారు. దీంతో మనస్తాపం చెందిన ప్రిన్సిపల్ నాయుడు అశోక్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే మాట మార్చారు. తాను రాజీనామా చేయలేదని ప్రిన్సిపాల్ నాయుడు అశోక్ మీడియా ప్రతినిధులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.

No comments:
Post a Comment