Tuesday, 20 September 2011

sigareni karmikula samme

కార్మికులపైకి బదిలీల వల... సింగరేణి ముద్దుబిడ్డలు బేఖాతర్-తుపాకీ నీడలో రహస్యంగా బొగ్గు రవాణా-ఎన్టీపీసీకి కోల్ ఇండియా నుంచి బొగ్గు!-నిత్యం 15వేల టన్నుల బొగ్గు దిగుమతి-ఎన్టీపీసీలో 1,914 మెగావాట్లకు పుంజుకున్న విద్యుత్ ఉత్పత్తి-సమ్మె ప్రభావం నుంచి బయటపడేందుకు సర్కారు విఫలయత్నాలు-ఎక్కడికక్కడే కుట్రలను భగ్నం చేస్తున్న సంఘాలు-రూ.200 కోట్ల ఉత్పత్తికి విఘాతం..రూ.64 కోట్ల వేతనాలు త్యాగంఒకటే గమనం, ఒకటే గమ్యం..అలుపు లేదు మనకు, తెలంగాణ సాధించే వరకు..’అనే తదేక సంకల్పంతో సింగరేణి సోదరులు ముందుకు సాగుతున్నారు. యాజమాన్యం, సర్కారు కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధనవైపు పరుగులు పెడుతున్నారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు సర్కారు తాజాగా ప్రయోగించిన ‘కోరుకున్న చోటుకే బదిలీ’ అస్త్రం కూడా విఫలమైంది. ఈ తాయిలానికి సైతం ఎవరూ ముందుకు రాకపోవడంతో బలవూపయోగమే సరైందని సర్కారు భావిస్తోంది. అమాయకులైన కార్మికులను భయపెట్టి అర్ధరాత్రి వేళలో బలవంతంగా పనులు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడక్కడా ఉన్న కొద్దిపాటి నిల్వలను రహస్యంగా తరలిస్తున్నారు. ఉత్పత్తిని, రవాణాను ఎక్కడికక్కడే అడ్డుకోవడంతో సర్కారు తలపట్టుకుంటోంది.సింగరేణిలో సమ్మె మంగళవారం 8వ రోజుకు చేరింది. ఇప్పటికి 200 కోట్ల ఉత్పత్తికి విఘాతం కలిగింది. కార్మికులు 64 కోట్ల వేతనాలు కోల్పోయారు.పోలీసుల బల ప్రయోగంరామగుండం పారిక్షిశామిక ప్రాంతం (కోల్‌బెల్ట్)లో కార్మికులతో బలవంతంగా పనులు చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించినప్పటికీ వారి తీరులో మార్పులేదు. మంగళవారం ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు-3లో కొంతమంది కార్మికులను తీసుకువచ్చారని, వారితో పనులు చేయించే అవకాశముందని తెలియడంతో ప్రాజెక్టుకు వెళ్లిన జేఏసీ కో-ఆర్డినేటర్ మాదాసు రామ్మూర్తితో పాటు హెచ్‌ఎంఎస్, బీఎంఎస్, ఏఐటీయూసీ నాయకులను అరెస్టు చేశారు. కార్మిక సంఘాల ఆందోళనతో వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు-1 నుంచి సుమారు 3వేల టన్నుల బొగ్గును ఎన్టీపీసీకి వ్యాగన్ల ద్వారా తరలించారు. గోదావరిఖనికి చెందిన కొంతమంది కార్మికులు దూర ప్రాంతాల్లో పనులు చేస్తున్నారు, వారిని ఖనికి బదిలీ చేస్తామని ప్రలోభపెట్టి పనులు చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి పనులు ప్రారంభించేందుకు వీలుగా భారీ వాహనాల్లో డీజిల్ నింపి సిద్ధంగా ఉంచడం, ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న 20వేల టన్నుల బొగ్గును తరలించేందుకు ప్రయత్నాలు చేస్తు వ్యాగన్లను సిద్ధంగా పెట్టడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మణుగూరు నుంచి భారీగా బొగ్గు ?రామగుండం ఎన్టీపీసీకి నిత్యం 15వేల టన్నుల బొగ్గు రావడం వల్ల ఇబ్బంది లేకుండా విద్యుత్ ఉత్పత్తి సాగుతోందని ఎన్టీపీసీ అధికార ప్రతినిధి జాన్ తెలిపారు. మంగళవారం రామగుండం ఎన్టీపీసీలో 1,914 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, అన్ని యూనిట్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు. మణుగూరు నుంచి రామగుండం ఎన్టీపీసీకి నిరంతరాయంగా బొగ్గు రవాణా సాగుతూనే ఉంది. కొత్తగూడెం నుంచి రైలు ద్వారా 7,548 టన్నులు, రోడ్డు ద్వారా 1,060 టన్నులు, ఇల్లందు డివిజన్ నుంచి రైలు ద్వారా 4,009 టన్నులు, మణుగూరులో రైలు ద్వారా 20,078 టన్నులు, రోడ్డు ద్వారా 1,477 టన్నులు, రామగుండం డివిజన్-3 నుంచి 2,100 బొగ్గు రవాణా జరిగిందని వివరించారు. సోమవారం కొత్తగూడెం (6,168 టన్నులు), మణుగూరు (13,635 టన్నులు) రామగుండం (1,700 టన్నులు) మినహా ఎక్కడా బొగ్గు ఉత్పత్తి జరగలేదు.సమ్మెకు మద్దతుసింగరేణి కార్మికులకు సంఘీభావం తెలుపడానికి టీజేఎఫ్, అఖిలపక్షం ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగింది. ఆదిలాబాద్ జిల్లాలో లక్షెట్టిపేట నుంచి మొదలైన ర్యాలీ మంచిర్యాల, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ ఏరియాలోని గనుల మీదుగా సాగింది. శ్రీరాంపూర్, గోదావరి ఖనిలో బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. వివిధ కార్మిక సంఘాల నాయకులతోపాటు సీపీఐ ఎమ్మెల్యేలు గుండా మల్లేశ్, కూనమనేని సాంబశివరావు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జీ అరవింద రెడ్డి, నల్లాల ఓదెలు తదితరులు కార్మికులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. నల్లాల ఓదెలు, ఏఐటీయూసీ సింగరేణి విభాగం ప్రధాన కార్యదర్శి వాసిడ్డి సీతారామయ్య సోమవారం కొత్తగూడెం రీజియన్‌లో కార్మికులతో మాట్లాడారు. అక్కడే రాస్తారోకో నిర్వహించిన కెంగర్ల మల్లయ్య అరెస్టయ్యారు. జేఏసీ కో ఆర్డినేటర్ మాదాసు రాంమూర్తి, కన్వీనర్‌లు గోసిక మల్లేశ్, చాంద్‌పాషా, హెచ్ రవీందర్, కళాధర్, తదితరులతోపాటు ఈబీజీకేఎస్ నాయకులు బంటు సారయ్య, చంద్రయ్య, సంపత్, జే రవీందర్, ఓ రాజశేఖర్, ప్రవీణ్, శ్రీనివాస్‌రావు ఏఐటీయూసీ నాయకులు గోపు సారయ్య, వై గట్టయ్య, దయాకర్ రెడ్డి, వేల్పుల నారాయణ, చిప్ప నర్సయ్య, ఐఎన్టీయూసీ నాయకులు, ఎమ్మెల్సీ బీ వెంకవూటావు, కాంపెల్లి సమ్మయ్య, డీ అన్నయ్య, రాయలింగు, మహిపాల్ రెడ్డి, రాజారాం, ఇఫ్టూ అధ్యక్షులు టీ శ్రీనివాస్, బీ సంపత్ కుమార్, జాఫర్, దాస్, సాధనవేని వెంక హెచ్‌ఎంఎస్ నాయకులు రాజిడ్డి, రహీం, ఓజియర్, సింగరేణి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నీరేటి రాజయ్య, కుమార్, టీఎన్టీయూసీ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ, ఏఐఎఫ్‌టీయూ నేత అంజయ్య ఆయా ప్రాంతాలలో ఆందోళనల్లో పాల్గొన్నారు.

No comments:

Post a Comment