సర్కారు ఆదాయానికి ఏటా రూ.1728 కోట్ల గండి
-బడా నేతలు, పెట్టుబడిదారులదే దందా
- ఒకే నెంబర్‌తో రెండ్రెండు బస్సులు..
- అధికారుల కళ్లలో కారం.. పట్టించుకోని ప్రభుత్వం
- ఆంధ్రోళ్ల బస్సులు అడ్డుకుందాం.. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ పిలుపు..
- సమ్మెకు ముందే కీలక పోరుకు రేపే ముహూర్తం అక్షరాలా పదిహేడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు! ఇది ఆంధ్రోళ్ల ట్రావెల్స్ సంస్థలు ఆర్టీసీ ఆదాయానికి ఏటా కొడుతున్న గండి! లక్షకుపైగా సిబ్బందితో, వేలాది బస్సులతో, వేల కిలోమీటర్ల సర్వీసులతో గిన్నెస్ రికార్డులు బద్దలు కొడుతున్న ప్రగతి రథ చక్రాన్ని నష్టాల బాట పట్టిస్తున్న వైనం! హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా... రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి మరే ప్రాంతానికైనా! అందమైన రంగుల బస్సులతో ఆర్టీసీ వెన్ను విరుస్తున్న తీరు! సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతిలో తెలంగాణకు జరుగుతున్న దగా సంగతి ఒక ఎత్తయితే.. ఆ స్థాయిలో ఓ ప్రభుత్వ సంస్థను కునారిల్లజేస్తున్న సంఘటిత దోపిడీ దందా మరోఎత్తు! ఆర్టీఏ కళ్లలో కారం కొట్టి.. ఆర్టీసీకి నామం పెట్టి.. ఒకే నెంబరుతో రెండు బస్సులు! ఒకటి హైదరాబాద్‌టు షిర్డీ వెళితే.. మరోటి అమలాపురానికో బెజవాడకో! ఒకటి బెంగళూరు వెళితే.. మరోటి రాజోలుకో రాజమంవూడికో! పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుంది.
ఎందుకంటే.. మరి అంతా తనవాళ్లేనాయె! అధికారులూ చూసీచూడనట్లే ఉంటారు.. రాజకీయ అండదండలున్నాయి కాబట్టి! కూడళ్లు నరకాన్ని తలపిస్తున్నా ట్రాఫిక్ పోలీసులూ సాహసించరు.. ఉత్తరమో దక్షిణమో అందుతుంది కనుక! ఆర్టీసీ కార్మికులు మొత్తుకుంటుంటారు.. తమ సంస్థ నష్టాల్లోకి వెళుతున్నదనన ఆవేదనతో! ఇప్పుడు తెలంగాణవాదులూ కన్నెర్ర జేశారు.. తెలంగాణలో సీమాంధ్ర దోపిడీ మార్గాల్లో ఒకానొక ఆయువు పట్టును మట్టుబెట్టడానికి! ఇందుకు ముహూర్తమూ పెట్టారు. అది రేపే! సమయం సాయంత్రం.. సమరవేదిక ఎల్బీనగర్..!
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (టీ న్యూస్): ఉధృతంగా సాగుతున్న సకల జనుల సమ్మెలో పాల్గొనడానికి ముందే తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కీలక ఆందోళనకు పిలుపునిచ్చారు. ఏటా రూ.1728 కోట్లు దోచుకుంటున్న ఆంధ్రోళ్ల బస్సుల పని పట్టడానికి సమాయతె్తైమయ్యారు. నిబంధనలు ఉల్లంఘించి బస్సులు నడుపుతున్న సీమాంధ్ర పెట్టుబడిదారుల దోపిడీకి అడ్డుకట్ట వేయకుండా సకల జనుల సమ్మెకు వెళితే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ... ఆ అక్రమాలను అడ్డుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు 16వ తేదీని ముహూర్తంగా ఎంచుకుంది. ఈ భారీ కార్యక్షికమంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, ప్రజావూఫంట్ కన్వీనర్ గద్‌ద ప్రత్యక్షంగా పాల్గొననున్నారు.
రాజకీయ జేఏసీలోని వివిధ భాగస్వామ్య పక్షాల నేతలు సైతం హాజరవనున్నారు. సీమాంధ్ర దోపిడీకి, అహంకారానికి చిహ్నమైన ప్రైవేటు బస్సుల పనిపట్టే కార్యక్షికమానికి తెలంగాణవాదులు, ఆర్టీసీ తెలంగాణ ఉద్యోగులు భారీగా హాజరు కావాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఆనందం పిలుపునిచ్చారు. పోలీసులు, ప్రభుత్వం ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని, ఆర్టీసీ ఉద్యోగి ఒక్కరిపై లాఠీదెబ్బ పడ్డా తెలంగాణ భగ్గుమంటుందని హెచ్చరించారు. 19 నుంచి చేపట్టే బస్సుల నిలిపివేత కార్యక్షికమాన్ని అవసరమైతే 17కు మారుస్తామని తెలిపారు.
రాజధాని అడ్డాగా అడ్డగోలు సంపాదన
కేశినేని, దివాకర్, కాళేశ్వర్, కావేరి, ఏసీఆర్, పోతుల, నవీన్... ఇలా సీమాంధ్ర బస్సుల ట్రావె్ కంపెనీల పేర్లు మాత్రమే వేరు. లక్ష్యం ఒక్కటే. భారీ దోపిడీ. తెలంగాణ నడిబొడ్డున్న ఉన్న హైదరాబాద్ నగరాన్ని అడ్డాగా చేసుకుని అక్రమంగా, అడ్డగోలుగా సంపాదిస్తున్నాయి ఈ సీమాంధ్ర ట్రావెల్ సంస్థలు. లక్షల మంది కార్మికులతో గిన్నిస్ రికార్డు సృష్టించిన ఆర్టీసీని ఈ రంగురంగుల అందమైన బస్సులు ఆగం చేస్తున్నాయి. ఆర్టీసీకి ఏటా వేల కోట్ల రూపాయాల నష్టాన్ని మూటగట్టిస్తున్నాయి. సంస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. భాగ్యనగరం నుంచి నిత్యం సమారు 3000వరకు ట్రావెల్స్, ఇతర ప్రైవేట్ వాహనాలు వివిధ ప్రాంతాలకు ప్రయాణీకులను చేరవేస్తున్నాయి.
వీటిలో 90శాతం సీమాంధ్ర యాజమాన్యాలవే. ఈ బస్సులతో ఆర్టీసీకి అక్షరాలా ఏటా రూ.1728కోట్లకు పైగా నష్టం వస్తోంది. ఒకే నెంబర్‌తో రెండు బస్సులను కూడా నడుపుతూ ప్రభుత్వ ఆదాయానికి సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రభుత్వం, ఆర్టీసీ నెత్తిన కుచ్చు టోపీ పెడుతున్నారని ఆర్టీసీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కోట్లు కొల్లగొడుతూ కొంత పాపాన్ని అండదండలిస్తున్న సీమాంధ్ర నాయకుల జేబుల్లోనూ వేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.
ప్రధాన కూడళ్లే కేంద్రాలు
కూకట్‌పల్లి, ప్యారడైజ్, ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, బీహెచ్‌ఈఎల్, లక్డీకాపూల్, ఏఎస్‌రావ్‌నగర్, సికింవూదాబాద్ రైల్వే స్టేషన్, ఈసీఐఎల్, టోలిచౌక్... ఇలా నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి నిత్యం వేల మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. ప్రయాణీకుల ఈ అవసరాన్ని గుర్తించిన సీమాంధ్ర వ్యాపారులు నగరంలోని వివిధ కూడళ్లలో ట్రావెల్స్ ఏజన్సీలను నెలకొల్పారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆ కేంద్రాల వద్ద ఇష్టమొచ్చిన రేట్లకు టికెట్లు విక్రయిస్తారు. శనివారమో ఆదివారమో అయితే టికెట్ బరువు మరింత పెరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకే కాకుండా షిర్డీ, బెంగళూర్, చ్నై తదితర రాష్ట్రం వెలుపలి నగరాలకూ సర్వీసులు ఉంటాయి.
ఆర్టీసీకి ఏటా రూ.1728కోట్ల నష్టం
ట్రావెల్స్, ఇతర ప్రైవేట్ వాహనాలతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కి అక్షరాలా రూ.1728 కోట్ల నష్టం వాటిల్లుతున్నదని సమాచారం. నిత్యం 3వేల బస్సులు బయల్దేరుతుంటాయి. ఒక్క బస్సుతో ఆర్టీసీకి రోజుకు 16వేల వరకు నష్టం వస్తుంది. అంటే రోజుకు 3000బస్సులతో దాదాపు రూ.4.80కోట్లు నష్టం. నెలకు రూ.144కోట్లు, ఇలా ఏడాదికి రూ.1728 కోట్ల నష్టం వస్తోందని ఆర్టీసీ అధికారులు లెక్కలు వేస్తున్నారు. సంస్థ నష్టపోవడానికి ప్రైవేట్ ట్రావెల్స్ ప్రధాన కారణమంటూ ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎన్నో ఉద్యమాలు చేశాయి. వాటి ఆగడాలను అరికట్టి, ఆర్టీసీని బతికించాలని ప్రభుత్వాలకు చేసుకున్న వినతులన్నీ ఎప్పటికప్పుడు చెత్తబుట్టపాలవుతున్నాయి.
లక్షా 20వేల మంది కార్మికులతో అతిపెద్ద రవాణా సంస్థగా చరిత్ర సృష్టించి, గిన్నెస్ రికార్డు సాధించిన ఆర్టీసీని ప్రస్తుతం గుప్పెడు మంది సీమాంధ్ర పెట్టుబడిదారుల ట్రావెల్ బస్సులు భయపెట్టిస్తున్నాయి. లక్ష మందికిపైగా ఉపాధి కల్పిస్తున్న భారీ ప్రభుత్వరంగ సంస్థను నిర్వీర్యం చేస్తున్నాయి.
సీమాంధ్ర పెట్టుబడిదారుల పుత్రికలే ఈ ట్రావెల్స్
హైదరాబాద్ నగరంలోని వివిధ ట్రావెల్స్ సంస్థలు దాదాపు సీమాంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులవే కావడం గమనార్హం. ఆ ప్రాంతానికి చెందిన మంత్రులు, ప్రజావూపతినిధులు, పెట్టుబడిదారులే ఈ దందాలను కొనసాగించడం విశేషం. 3000బస్సుల్లో దాదాపు 90శాతం బస్సులు సీమాంవూధులవి కాగా మిగతావి ఇతర ప్రాంతాల వారివి. ట్రావెల్స్, ప్రైవేట్ వాహనాలు సాగిస్తున్న ఈ దందాలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిది ఒక్క బస్సు లేకపోవడాన్ని బట్టే ఎవరు దోపిడీదారులన్నది స్పష్టంగా అర్థమవుతోందని తెలంగాణవాదులు అంటున్నారు.
ఒకే నెంబరు రెండు మూడు బస్సులు
తమ గజకర్ణ, గోకర్ణ, గారడీ విద్యలతో సీమాంధ్ర ట్రావెల్స్ వ్యాపారులు ఆర్టీసీకే కాదు రవాణా శాఖ ఆదాయానికీ కొన్ని కోట్ల రూపాయలు గండి కొడుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వందల వాహనాలు కలిగి ఉన్న వ్యాపారులు ఒకే నెంబర్‌తో రెండు బస్సులను నడుపుతూ రవాణా శాఖ అధికారుల కళ్లలో కూడా కారం కొడుతున్నారు. ఒకే నెంబర్‌తో ఒక బస్సు షిర్డీకి వెళితే మరొకటి అదే నెంబర్‌తో తిరుపతికి వెళుతుంది. వెరసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్సులు, ఇతరత్రా పన్నులు భారీ మొత్తంలో సీమాంధ్ర వ్యాపారులు ఎగవేస్తున్నారు. ట్రావెల్స్ ఆగడాలు రోజురోజుకు శృతిమించి పోతున్నాయని, ఒకే నెంబర్‌తో రెండు బస్సులు తిరుగుతున్నాయని నెత్తినోరు కొట్టుకొని ఎందరు మొత్తుకున్నా రవాణా శాఖ అధికారులు చూసీ చూడనట్లు ఊరుకోవడం దారుణమంటూ స్వయంగా ఆర్టీసీకి చెందిన ఓ ఉన్నతాధికారే అసహనం వ్యక్తం చేశారు.
అయినా బడా రాజకీయ నేతలు, మంత్రులే ట్రావెల్స్ వ్యాపారం చేస్తుంటే ఇక వారు ఏం చేసినా ఎవరు పట్టించుకుంటారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ నష్టానికి ప్రైవేట్ వాహనాలే కారణమని కుండబద్దలు కొట్టారు.
ప్రధాన రోడ్లపై ట్రావెల్ బస్సులు..టాఫిక్‌తో ప్రజల ఇక్కట్లు
నగరంలోని ప్రధాన ప్రాంతాల కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ట్రావెల్స్ ఏజన్సీల వద్ద బస్సులు నానా హంగామా సృష్టిస్తూ ట్రాఫిక్ సమస్యను ఉత్పన్నం చేస్తున్నాయి. వెళ్ళడానికి రెండు గంటల ముందే ఏజన్సీ ఎదుట రోడ్లపై బస్సులను తెచ్చి పెడుతున్నారు సీమాంధ్ర వ్యాపారులు. దీంతో ట్రాఫిక్ స్తంభించి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు సైతం ఈ బస్సులు ఏం చేసినా చూసీ చూడనట్లే వెళుతున్నారు. వాళ్లకూ మామూళ్లు ముడుతుంటాయని విమర్శలున్నాయి. పెద్ద వాళ్ళతో పెట్టుకుని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దనే ఏం చేయలేక పోతున్నామని ఓ ట్రాఫిక్ పోలీసు అధికారి చెప్పుకొచ్చారు. వాటిని హైదరాబాద్ శివార్లలోకి పంపితే కానీ ట్రాఫిక్ సమస్య తీరదని అభివూపాయపడ్డారు.

No comments:
Post a Comment