Friday, 9 September 2011

nagam nagara mogindi(నాగం నగారా మోగింది!)

- ‘తెలంగాణ నగారా సమితి’ ఆవిర్భావం
- అచ్చంపేటలో రోడ్ షోకు అనూహ్య స్పందన
- పోలవరం నిర్మాణాన్ని అడ్డుకుంటాం
- బాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇక సాగనివ్వం: నాగం
- కేసీఆర్‌ను గెలిపించుకొని ఉద్యమ సత్తా చాటిన పాలమూరు
- నాగం వెంటే నడుస్తాం: హరీశ్వర్, జోగు రామన్న, బోడ జనార్దన్
- పోలవరం నిర్మాణాన్ని అడ్డుకుంటాం
- ‘తెలంగాణ నగారా సమితి’ ఆవిర్భావ సదస్సులో నాగం
- అచ్చంపేటలో రోడ్ షోకు అనూహ్య స్పందన
- నాగం వెంటే నడుస్తాం
- ఎమ్మెల్యేలు హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న, బోడ జనార్దన్ 
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 9(టీన్యూస్): తెలంగాణ ప్రాంత గిరిజనులను ముంపునకు గురి చేస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ నాగం జనార్దన్‌డ్డి అన్నారు. తెలంగాణ ప్రాంతంలో కట్టిన ప్రాజెక్టులు, కడుతున్న ప్రాజెక్టులలో ఇక్కడి ప్రాంతం వారి భూములు మునిగితే నీళ్లు మాత్రం ఆంధ్ర ప్రాంతానికి వెళుతున్నాయని, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జునసాగర్ ప్రాజెక్టులే ఇందుకు ఉదాహరణ అని ఆయన మండిపడ్డారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలంలోని ఉమామహేశ్వరం దేవస్థానం సమీపంలో తెలంగాణ నగారా సమితి ఉద్యమ వేదికను నాగం ప్రకటించారు. అనంతరం అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నాగం ఆధ్వర్యంలో ‘తెలంగాణ నగారా సమితి’ ఆవిర్భావ సభ నిర్వహించారు.

ఈ సభకు అచ్చంపేట జేఏసీ కన్వీనర్ వెంక అధ్యక్షత వహించగా.. శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన నాగం వర్గం ఎమ్మెల్యేలు కే హరీశ్వర్‌డ్డి, జోగు రామన్న, బోడ జనార్దన్ పాల్గొని ప్రసంగించారు. నాగం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోనే గిరిజన తండాలు గ్రామ పంచాయతీలుగా మారుతాయని, వారికి 12 శాతం రిజర్వేషన్ వస్తుందని అన్నారు. రెండుకళ్ల సిద్ధాంతం పేరిట చంద్రబాబు ఆడుతున్న నాటకాన్ని కట్టిపెట్టాలని హెచ్చరించారు. ఈ రెండు కళ్ల సిద్ధాంతాన్ని భరించలేకనే తాము టీడీపీ నుంచి బయటకు వచ్చామని పునరుద్ఘాటించారు. అచ్చంపేట ప్రాంత ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాము బలమైన ఆకాంక్షను వ్యక్తం చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే రాములు మాత్రం పదవి పట్టుకొని వేలాడుతున్నారని విమర్శించారు. రాములు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనాలని సభలో పాల్గొన్న ప్రజలతో అనిపించారు.

ఈ నెల 13వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తలపెట్టిన సకల జనుల సమ్మెలో తాము కూడా భాగస్వాములమవుతామని నాగం స్పష్టం చేశారు. అంతకుముందు ఉమామహేశ్వరం నుంచి అచ్చంపేట వరకు రోడ్‌షో నిర్వహించారు. దీనికి వేలాదిగా ప్రజలు హాజరయ్యారు.

అందరూ ఒకే వేదికపైకి రావాలి: నాగం వర్గ ఎమ్మెల్యేలు
తెలంగాణ కోసం అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన రాజీనామాలను ఆమోదింపజేసుకొని ఒకే వేదికపైకి వచ్చి పని చేయాలని తెలంగాణ నగారా సమితి నాయకులు హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న, బోడ జనార్దన్ డిమాండ్ చేశారు. తెలంగాణలో పంటలు ఎండిపోతుంటే చలించని చంద్రబాబు ఆంధ్రా రైతులపై మాత్రం ప్రేమ చూపుతూ ద్వంద్వ వైఖరి ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజీనామాలు చేయని, తెలంగాణ ఉద్యమంలో కలిసి రాని ఎంపీలు, ఎమ్మెల్యేలను గ్రామాల్లోకి రానీయకుండా తరిమి తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

సీమాంవూధలో క్రాప్ హాలిడే ప్రకటిస్తే జాతీయ నాయకులను తీసుకొచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్న బాబుకు తెలంగాణ రైతులు కనిపించడం లేదా? అని వారు ప్రశ్నించారు. కిరణ్ సర్కార్‌కు చంద్రబాబు లోపాయకారి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఇకపై తెలంగాణలో బాబు ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. మొదటి నుంచి తెలంగాణకు అడ్డుపడుతున్నది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. పాలమూరు జిల్లా వెనకబాటులో లేదని సీమాంధ్ర పాలకుల వల్ల వెనకబడిపోయిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జిల్లా ఎంతో ముందంజలో ఉందని కొనియాడారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేశర్‌రావును ఎంపీగా గెలిపించుకొని పాలమూరు ప్రజలు తెలంగాణ వాదాన్ని బలంగా చాటారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలమూరు ప్రజల ఉద్యమాలు తెలంగాణ జిల్లాలకు దిక్సూచిగా మారాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడే వరకు నాగం వెంటే నడుస్తామని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment