Tuesday, 20 September 2011
kcr thiksha vaddu(కేసీఆర్... దీక్ష వదు!)
యోచన మానాలని తెలంగాణ శ్రేణుల ఒత్తిడిపట్టువీడేది లేదంటున్న టీఆర్‌ఎస్ అధినేతసర్కారు తీరుపై కేసీఆర్ ఆగ్రహం- పోలీసుల దౌర్జన్యాలపై ఆవేదన- ఇవే ఆయనలో పట్టుదల పెంచాయి?- కేసీఆర్‌తో కేకే భేటీ- సానుకూల నిర్ణయం రాకుంటే మేమూ మీతోపాటే దీక్షలో...- కేసీఆర్‌కు కేకే ప్రతిపాదన!- అక్టోబర్ 2 దాకా వేచి చూద్దాం- జేఏసీ, టీఆర్‌ఎస్ నేతల సూచన- ఉధృతంగా ఉద్యమిద్దామన్న జేఏసీ- 24, 25 తేదీల్లో రైల్ రోకోలు- అక్టోబర్ 15లోగా చలో హైదరాబాద్తెలంగాణ సాధనలో మడమ తిప్పని పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మరోసారి ఆమరణ దీక్షకు దిగే అంశంపై తీవ్ర స్థాయిలో తర్జనభర్జనలు సాగుతున్నాయి. అయితే.. కేసీఆర్ మాత్రం తన పట్టు వీడటం లేదని తెలిసింది. కానీ.. తెలంగాణ ఉద్యమ శ్రేణులు కూడా అంతే స్థాయిలో కేసీఆర్ ఆలోచనను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఉద్యమ రూపాలు చాలా ఉన్నందున, వాటిని ప్రస్తుతం తీవ్రంగానే అమలు చేస్తున్నందున అమరణ దీక్షను వాయిదా వేసుకోవాలని ప్రజా సంఘాలు, టీఎన్జీవో నేతలు, రాజకీయ పార్టీలు, నాయకుల నుంచి కేసీఆర్‌పై ఒత్తిళ్లు వస్తున్నాయి. కేసీఆర్ మరోసారి ఆమరణ దీక్షకు యోచన చేస్తున్నారన్న అంశం మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో ఆయనతో పలు వర్గాల నేతలు ఉదయం నుంచి సంప్రదింపులు జరిపారు. రాజ్యసభ సభ్యుడు, సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కే కేశవరావు స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లారు. అమరణంపై చర్చలు జరిపారు. టీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చినందున అక్టోబర్ రెండో తేదీ వరకు వేచి చూడాలని, ఆ తరువాత ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని కేకే సూచించారు.అటు జేఏసీ కూడా మరో దఫా ఉధృత కార్యక్షికమానికి సిద్ధమైంది. అక్టోబర్‌లో చలో హైదరాబాద్‌కు, ఈ నెల 24, 25 తేదీల్లో రైల్ రోకోలకు పిలుపునిచ్చింది. అక్టోబర్‌లో చలో హైదరాబాద్‌కు పిలుపు ఇవ్వాలని నిశ్చయించింది. తాము జైళ్లకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, తీవ్ర నిర్ణయాలు వద్దని జేఏసీ నేతలు, ఉద్యమ సంఘాల నాయకులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేసీఆర్ మాత్రం తన పట్టు వీడటం లేదని టీఆర్‌ఎస్ ఆంతరంగిక వర్గాలు చెబుతున్నాయి. సకల జనుల సమ్మె మహోధృతంగా సాగుతున్న తరుణంలో కూడా కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాల నుంచి ఉలుకూ పలుకూ లేకపోగా.. ఆందోళనకారులపై దౌర్జన్యాలు పెచ్చుమీరిపోవడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారని ఆ వర్గాలు తెలిపాయి. వీటన్నింటి ఫలితంగానే ఈ సారి ఎలాగైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలనే పట్టుదల ఆయనలో పెరుగుతున్నదని వారు అంటున్నారు. కనుక తాను ఆమరణ దీక్షకు వెళ్లయినా సరే తన కర్తవ్యాన్ని నెరవేర్చాలని ఆయన భావిస్తున్నారని చెబుతున్నారు.ఈ క్రమంలోనే కేసీఆర్‌ను కలిసిన కేకే.. దీక్ష వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే రాజకీయ జేఏసీతో సంప్రతింపులు జరిపిన తర్వాతే దీక్ష విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన కేకేకు వివరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీ, న్యూడెమోక్షికసీ, సీపీఐ నేతలు సైతం దీక్ష వద్దని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశాయి. దీంతో మంగళవారం సాయంత్రం లోటస్‌పాండ్‌లో జేఏసీలోని కీలక రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ సమావేశమయ్యారు. దీక్ష చేపట్టడంపై ప్రధానంగా చర్చించారు. దీక్ష వాయిదా వేయాలని వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిళ్లపైనా చర్చ జరిగిందని సమాచారం. దీనిపై జేఏసీ స్టీరింగ్ కమిటీలో తుది చర్చ జరపాలని నేతలు భావిస్తున్నారు. ఉద్యమంలో అందరం కలిసి సాగుదామని, ఆమరణదీక్ష వద్దని ఉద్యోగ సంఘాలు సైతం కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చాయి. ఉదయం నుండి కేసీఆర్ ఇంట్లో జరిగిన సంప్రతింపుల సందర్భంగానే ఆమరణ దీక్షపై కేసీఆర్ ఒక ప్రకటన చేస్తారని అందరూ ఉత్కం గురయ్యారు. గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న రాజీనామాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సమాయత్తమవుతున్నట్లు సంకేతాలు వస్తున్న తరుణంలో దీక్షను కొద్ది రోజుల పాటు వాయిదావేసుకోవాలని టీఆర్‌ఎస్ నేతలు కూడా కేసీఆర్‌కు సూచించినట్లు సమాచారం.మరో మహోద్యమానికి జేఏసీ సమాయత్తంకేసీఆర్ దీక్షపై చర్చించిన రాజకీయ జేఏసీ.. పలు ఉధృత పోరాట రూపాలను చర్చించింది. ఈ నెల 24, 25 తేదీల్లో భారీ స్థాయిలో రైల్‌రోకోలు జరపాలని నిర్ణయించారు. ఈ రెండు రోజుల ఉద్యమంతో ఉత్తర భారతానికి, దక్షిణ భారతానికి మధ్య రైళ్ల రాకపోకలు మొత్తం బంద్ అయ్యేలా ఉద్యమాన్ని రూపొందించాలని తీర్మానించారు. తద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ అంశం చర్చ జరిగేలా చూడాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమ గతిని మార్చే రీతిలో అక్టోబర్ నెలలో చలో హైదరాబాద్‌కు పిలుపునివ్వాలని నిర్ణయానికి వచ్చారు. అక్టోబర్ 15లోగానే ఈ కార్యక్షికమానికి రూపకల్పన చేయాలని తీర్మానించారు.నిర్ణయం రాకుంటే మేమూ దీక్షలోకి: కేకే‘‘తెలంగాణపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే మేమూ దీక్షలో కూర్చుంటాం. అందరం కలిసి అమరణ దీక్ష చేద్దాం’’ అని కేసీఆర్‌తో తన భేటీ సందర్భంగా కేశవరావు ప్రతిపాదించినట్లు తెలిసింది. సుమారు గంటకు పైగా ఇద్దరూ ఆమరణ దీక్షపై చర్చించారు. తెలంగాణపై తామందరం కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నామని ఈ సందర్భంగా కేసీఆర్‌కు కేకే చెప్పినట్టు తెలిసింది. ఈ నెల 25న అధిష్ఠానాన్ని కలవడానికి ఢిల్లీ వెళుతున్నామని, కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని చెప్పినట్టు సమాచారం. గులాం నబీ ఆజాద్ కూడా ఈ నెల 30 వరకూ సమయం కోరినందున దీక్ష యోచన మానాలని కోరినట్టు తెలిసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment