Thursday 15 September 2011

thata jejamma nu kotaina telangana sadistha(తాత జేజమ్మను కొట్టైనా తెలంగాణ సాధిస్తా)

10 వేల మంది తెలంగాణ నేతలఫోన్ ట్యాపింగ్
- సర్కారు దొంగతనాన్ని బయటపెడతాం
- చైనా వెళ్లే దమ్ముందా? రాయపాటికి సవాల్
- మాట మార్చడానికి సీమాంధ్రులకు సిగ్గూ, శరం, లజ్జ ఉండదా?
- అది నాలుకా? తాటి మట్టా?
- సీమాంధ్రులను చూసి ఊసర సైతం సిగ్గుపడుతున్నాయి
- మొఖం మీద ఉమ్మేసినా పడి ఉంటారా?
- పాలిటెక్నిక్ గర్జనలో కేసీఆర్ 
హైదరాబాద్, సెప్టెంబర్ 14(టీ న్యూస్): ‘తెలంగాణలోని 10వేల మంది నాయకుల ఫోన్లను పోలీసులు ట్యాపింగ్ చేస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ హరించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? ముఖ్యమంవూతిది దుర్మార్గం. డీజీపీ ఏమిటిదీ?.. తీవ్ర చర్య తప్పదు. ఖబడ్దార్! సర్కారు దొంగతనాన్ని బయటపెడతాం. ఎవరికీ భయపడేది లేదు. ట్యాపింగ్ ట్యూపింగ్‌లు ఏమీ చేయలేవు. దుర్మార్గాలను న్యాయపరంగా ఎదుర్కొంటాం. మానవ హక్కుల కమిషన్‌కు, హైకోర్టుకు వెళతాం’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు. బుధవారం సికింవూదాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో పాలిటెక్నిక్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ‘పాలిటెక్నిక్ గర్జన’లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయి.. ప్రసంగించారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మహోధృతంగా ఉద్యమాలు సాగుతుంటే సర్కారు ఆదేశాలతో పోలీసులు ఉద్యమ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ సమాచారాన్ని దొంగచాటుగా సేకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘తెలంగాణ కోసం తాము ఏదైనా బాజాప్తా చేస్తాం. బేజాప్తా చేయం. చిటిక వేస్తే లక్షలాది మంది సైనికుల్లా రంగంలో దిగుతారు. జాగ్రత్త!’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫోన్లను ట్యాపింగ్ చేసే సంస్కృతి ఏమిటని ప్రశ్నించారు. గుంటూరు ఎంపీ రాయపాటికి ఆయన సవాల్ విసిరారు. 1985-87 మధ్యకా లంలో పొగాకులో రాళ్లను నింపి చైనాకు ఎగుమతి చేసి అక్కడ 16మంది ఉరిశిక్షకు గుంటూరు ఎంపీ రాయపాటి కారకుడయ్యారని, అప్పటి నుంచి రాయపాటిని తమకు అప్పగించమని చైనా భారత ప్రభుత్వాన్ని కోరుతోందని తెలిపారు. అప్పట్లో ఈ విషయంపై పార్లమెంట్‌లో ప్రశ్నలు వేయకుండా, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా రాయపాటి మేనేజ్ చేశారని ఆయన ఆరోపించారు.

రాయపాటికి దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. తన సొంత ఖర్చుతో టీఆర్‌ఎస్ నాయకుడు పద్మారావును రాయపాటితో చైనాకు పంపుతానని, అయితే ఇండియాకు తిరిగి వచ్చేది ఒక్క పద్మారావు మాత్రమేనని కేసీఆర్ పేర్కొన్నారు. ముమ్మాటికీ తెలంగాణ వచ్చి తీరుతుందని, తాత జేజమ్మను కొట్టైనా తెలంగాణను సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అన్నారు. తెలంగాణవాదులకు త్యాగాలు, పోరాటాలు మాత్రమే తెలుసని చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు పురిటి నొప్పుల్లా కొన్ని ఇక్కట్లు తప్పవన్నారు. ప్రస్తుత సమయంలోనే తెలంగాణవాదులంతా బిరుసుగా, మొండిగా, పట్టుదలతో ఉండాలని సూచించారు. ఎన్నో హింసలను భరిస్తున్నామని, ఒక్కో విద్యార్థిపై పోలీసులు వందలాది కేసులు పెట్టారని, టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్‌పై 140 కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు.మురళీధర్ గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ గర్జనలో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, బీజేపీ నాయకులు సీహెచ్ విద్యాసాగర్‌రావు, ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్ వి.శ్రీనివాస్‌గౌడ్, కో-చైర్మన్లు జీ.దేవివూపసాద్‌రావు, సి.విఠల్, సీడబ్ల్యుసీ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆర్.విద్యాసాగర్‌రావు, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు కర్నె ప్రభాకర్, పద్మారావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, గువ్వల బాలరాజ్, బేతి సుభాష్‌డ్డి, టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్, యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రామ్మోహన్, ప్రభుత్వ లెక్చరర్ల జేఏసీ చైర్మన్ మధుసూదన్‌డ్డి, కత్తి వెంకటస్వామి, ఇంజనీర్ల జేఏసీ చైర్మన్ వెంక మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌డ్డి, తదితరులు పాల్గొన్నారు.

పాలిటెక్నిక్ జేఏసీ చైర్మన్‌గా మనోహర్‌డ్డి ఎన్నిక
పాలిటెక్నిక్ జేఏసీ చైర్మన్‌గా ఎం.మనోహర్‌డ్డిని ఎన్నుకున్నట్లుగా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. పాలిటెక్నిక్ ఉద్యోగులు, అధ్యాపకులు, ఇన్‌వూస్టక్టర్లు కలిసి ఏకక్షిగీవంగా మనోహర్‌డ్డి ఎన్నుకున్నారని వెల్లడించారు.

జీతాల రంది వద్దు..
సీమాంధ్రులలకు సిగ్గూ, షరం, లజ్జ ఉండ దా? అని కేసీఆర్ ప్రశ్నించారు. మంత్రి శైలజానాథ్ మాట్లాడిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం, ప్రజలు ఏమనుకుంటారన్న సోయి కూడా వారికి ఉండ దా? అని ప్రశ్నించారు. ‘సీమాంధ్రులలది నాలుకా? తాటి మట్టా?. చెవుల్లో కమ లం పువ్వులు పెడతారా?. సీమాంధ్రులలను చూసి ఊసర కూడా సిగ్గు పడుతున్నాయి. మొఖం మీద ఉమ్మేసినా సిగ్గు లేకుండా ఇక్కడే పడి ఉంటారా?’ అని కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుక్కలు బొక్కలు వేసినట్లు తెలంగాణ కాంగ్రెస్ సన్నాసులకు పదవులు, కాంట్రాక్టులు పారేస్తే ఊరుకుంటున్నారని మండిపడ్డారు. సకల జనుల సమ్మె విజయవంతంగా సాగుతోందని, బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. జీతం రాదన్న రంది తెలంగాణ ఉద్యోగులకు అవసరం లేదని, ప్రస్తుతం జీతాన్ని పొదుపు చేశామని వారు అనుకోవాలని సూచించారు. ఎన్ని నెలలైనా వడ్డీ, బోనస్‌తో కలిపి వారికి జీతాలిస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల వ్యవస్థను చంద్రబాబే తెచ్చారని గుర్తు చేశారు. సీఎం, మంత్రుల పదవులను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తే బాగుండేదని ఎద్దేవా చేశా రు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పదం ఉండదని స్పష్టం చేశారు. పొరపాటున ‘తెలంగాణ రాకుంటే సీమాంధ్రులలు బతకనిస్తారా? చెప్పు కింద నలిపేస్తారు. మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. ఐకమత్యంతో గమ్యాన్ని చేరాలని, దొంగల భరతం పట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment