Thursday 15 September 2011

telangana theaters bundh

-450 థియేటర్లలో సిన్మాలు ఆడలేదు.. నేడు కూడా బంద్
-తొలి రోజు రూ.3 కోట్ల నష్టం... రూ.40 కోట్ల రెవెన్యూకు గండి
-తాళాలు తెరుచుకోని ఆఫీస్‌లు గేట్‌ల మందు ధర్నాలు
-అన్ని జిల్లాల్లో రాస్తారోకోలుద్రోహుల దిష్టిబొమ్మల దహనం హోరెత్తిన నినాదాలు
రెట్టించిన ఉత్సాహంతో రెండో రోజూ అదే జోరు! ప్రభుత్వ కార్యాలయాల తాళాలు తెరుచుకోలేదు.. ఫ్యాక్టరీల్లో సైరన్‌లు మోగలేదు.. వృత్తులు సాగలేదు.. ఉధృతంగా మొదలైన తెలంగాణ సకల జనుల సమ్మె రెండో రోజు మహోధృతమైంది! రెండో రోజు సమ్మెలోకి సినిమాహాళ్ల సిబ్బంది వచ్చి చేరారు. పది జిల్లాల్లోని దాదాపు 450 థియేటర్లలో బొమ్మ పడలేదు! ఒక్క రోజే సినిమా రంగానికి 3 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. గురువారమూ సినిమా హాళ్ల బంద్ కొనసాగనుంది! సింగరేణిలో రెండో రోజూ బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. 65వేల మంది కార్మికులు రెండు రోజులుగా తట్టా పార పట్టకపోవడంతో రూ.50 కోట్ల విలువైన ఉత్పత్తి నిలిచిపోయింది! ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు కదల్లేదు.

ప్రధాన ఆదాయ వనరులైన 450 రిజివూస్టేషన్ కార్యాలయాల్లో ఒక్క ముద్ర పడలేదు! రెండు రోజుల్లో రెవెన్యూ నష్టం 40 కోట్లుగా అధికారులు అంచనా వేశారు! ఉద్యోగులంతా ఉద్యమబాటలోనే నిలిచారు. రాష్ట్రం సాధించేదాకా సమ్మె విరమించేది లేదంటూ ఏకకం నినదించారు! ఖమ్మం రణక్షేవూతమైంది. పోలీసులకు, విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్థినికి కాలు విరిగింది. కరీంనగర్‌లో విద్యార్థులపై ఓ ఖాకీ రెచ్చిపోయాడు. తెలంగాణ అంటే రౌడీ షీట్ తెరుస్తానని బెదిరించాడు. సంగాడ్డిలో ఎమ్మెల్యే జగ్గాడ్డి అనుచరులు రెచ్చిపోయారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై దాడికి దిగారు. ఆదిలాబాద్‌లో అడ్డుగోడ పడింది. చెక్‌పోస్టు ఉద్యోగులందరూ సమ్మెలోకి రావడంతో ఆదిలాబాద్ అంతపూరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద దాదాపు 13 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వివిధ జిల్లాల్లో కార్యాలయాలు, కంపెనీలు, ఫ్యాక్టరీల గేట్‌ల వద్ద జై తెలంగాణ నినాదాలు మారుమోగాయి.డ్రైవర్లు లేక పలువురు జిల్లా స్థాయి అధికారులకు ఇక్కట్లు తప్పలేదు. బైకు ర్యాలీలు, రాస్తారోకోలతో పాలమూరు రహదారులు హోరెత్తాయి. బహిరంగ సభలు, గేట్ మీటింగ్‌లు జరిగాయి. తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉంటున్న రాజకీయ నాయకులకు ఉద్యమ సెగలు తాకుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల మంత్రి శ్రీధర్‌బాబు దిష్టిబొమ్మలను ఆందోళనకారులు దహనం చేశారు. పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు మంత్రి డీకే అరుణ దిష్టిబొమ్మను దహనం చేశారు. నల్లగొండ జిల్లాలో రోడ్లపై విద్యార్థులు మానవహారాలు నిర్మించారు. సీఎం కిరణ్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేవరకొండలో మహిళా టీచర్లు బతుకమ్మలు ఆడారు.

రంగాడ్డి జిల్లా తాండూరులో ఎమ్మెల్యే మహేందర్‌డ్డి మళ్లీ రాజీనామా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటిని ముట్టడించారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి ఆందోళనకారులు ముసుగు వేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యమకారులకు మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి వేధింపులు,సమస్యలు వచ్చినా తాము అండగా నిలుస్తామని రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అభయమిచ్చారు. కుక్కలకు బొక్కలు వేసినట్లు తెలంగాణ కాంగ్రెస్ సన్నాసులకు పదవులు, కాంట్రాక్టులు పారేస్తే ఊరుకుంటున్నారని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. జీతం రాదన్న రంది తెలంగాణ ఉద్యోగులకు అవసరం లేదని, ప్రస్తుతం జీతాన్ని పొదుపు చేశామని వారు అనుకోవాలని సూచించారు.

ఎన్ని నెలలైనా వడ్డీ, బోనస్‌తో కలిపి వారికి జీతాలిస్తామని కేసీఆర్ మరోసారి భరోసా ఇచ్చారు. రాజకీయ నాయకుల వెనుకడుగు వల్లే తెలంగాణ ఏర్పాటు ఆలస్యమవుతోందని, ఉద్యోగులు ముందుండి పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కె.స్వామిగౌడ్ అన్నారు.అందుకోసమే ఉద్యోగులు ముందుకువచ్చి ఉద్యమంలో మమేకమవుతున్నారని తెలిపారు.

No comments:

Post a Comment