Tuesday 20 September 2011

apsrtc thamana nithi(ప్రగతి చక్రం దమననీతి)

1,325 మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపు-మిగిలినవారు విధులకు హాజరైతే తక్షణమే క్రమబద్ధీకరణ అని ప్రకటన-అద్దె బస్సులపై కొరడా-తక్షణమే క్రమబద్ధీకరణ అని ప్రకటన-సమ్మెను నీరుకార్చే ప్రచారాలను నమ్మొద్దు టీజేఏసీ చైర్మన్ కోదండరాం:సకల జనుల సమ్మెలో భాగమై.. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులపై సీమాంధ్ర సర్కారు ఉక్కుపాదం మోపింది. ఆర్టీసీ యాజమాన్యం తన సీమాంధ్ర నైజం బహిర్గతం చేస్తూ కుతంవూతాలకు తెరతీసింది. సమ్మెలో పాల్గొంటున్న కాంట్రాక్టు కార్మికుల ఆత్మసై్థర్యాన్ని దెబ్బతీసేందుకు కుటిల అస్త్రాలను ప్రయోగించింది. నోటీసులిచ్చినా బెదరకుండా తెలంగాణ కోసం తెగించి సమ్మెలో పాల్గొన్న కాంట్రాక్టు కార్మికులపై యాజమాన్యం దమననీతిని ప్రదర్శించింది. 1,350 మంది కాంట్రాక్టు కార్మికులపై వేటు వేసింది. వీరిలో 675 మంది డ్రైవర్లు, 680 మంది కండక్టర్లున్నారు. వీరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రాంతంలో ఆర్టీసీకి సుమారు 10వేల మందికి పైగా కాంట్రాక్టు కార్మికులున్నారు. వీరిలో ఆరు వేల మంది సర్వీసు క్రమబద్ధీకరణకు అర్హులని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించింది.వీరు బుధవారం విధులకు హాజరైతే.. మొదటి దశలో భాగంగా 2,899 మంది సర్వీసును తక్షణమే క్రమబద్ధీకరించనున్నట్లు యాజమాన్యం తెలిపింది. సీఎం ఏర్పాటు చేసిన రవాణా టాస్క్‌ఫోర్సు కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి లక్ష్మీపార్థసారథి, కమిషనర్ హీరాలాల్ సమారియా, ఆర్టీసీ ఎండీ ప్రసాదరావులతో కూడిన టాస్క్‌ఫోర్సు మంగళవారం భేటీ అయింది. ఈ భేటీలో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు, క్రమబద్ధీకరణ, అద్దె బస్సులపై కొరడా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షించారు.అద్దె బస్సులపై కొరడాఆర్టీసీ అద్దె బస్సులు కూడా సమ్మెలో పాల్గొంటుండడాన్ని యాజమాన్యం తీవ్రంగా పరిగణిస్తోంది. తెలంగాణలో ఉన్న 1,000కిపైగా అద్దె బస్సులను వెంటనే తిప్పకపోతే, తమ మధ్యనున్న ఒప్పందాన్ని రద్దు చేస్తామని అద్దె బస్సు యజమానులకు ఆర్టీసీ నోటీసులిచ్చింది. దీంతో 200 అద్దె బస్సులను తిప్పడానికి మంగళవారం ప్రయత్నాలు జరిగాయి. హైదరాబాద్‌లో పోలీసుల భద్రత నడుమ తిప్పిన బస్సులు అద్దెవేనని సమాచారం.కార్మికులను విధుల్లో చేర్పించే బాధ్యత మాదే-ఆర్టీసి జేఏసి ఛైర్మన్ ఆనందంరాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించడాన్ని ఆర్టీసి జేఏసి తీవ్రంగా ఖండించింది. తొలగించే కార్మికులందర్ని విధుల్లో చేర్పించే బాధ్యతను తాము తీసుకుంటామని జేఏసి ఛైర్మన్ ఆనందం ప్రకటించారు. గతంలో కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని ఎన్ని ఉద్యమాలు చేసినా చలించని ఆర్టీసి యాజమాన్యం తెలంగాణ కోసం రెండు రోజుల సమ్మె పూర్తి కాక ముందే వారిని తొలగించడంలో అత్యుత్సాహం ప్రదర్శించిందని ఆయన ధ్వజమెత్తారు. కాంట్రాక్ట కార్మికుల పై వేసిన వేటును నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలపై వేసిన వేటుగా భావిస్తున్నామన్నారు.ఇది సీమాంధ్ర పాలకుల అహంకారానికి నిదర్శనం- ఎన్‌ఎంయు(టి)కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును గుర్తింపు యూనియన్‌గా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని నేషనల్ మజ్దూర్ యూనియన్ తెలంగాణ (ఎన్‌ఎంయు)(టి) ఛైర్మన్ థామస్‌డ్డి, కన్వీనర్ అశ్వథామడ్డి, కో-కన్వీనర్ కె.హన్మంతు అన్నారు. వారి సర్వీసుల క్రమబద్ధీకరణకు ఎన్‌ఎస్‌యుటి చేస్తున్న పోరాటం ఒక పక్క కొనసాగుతుండగానే సమ్మె పేరిట యాజమా న్యం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం బాధకరమని మండిపడ్డారు. తొలగించిన 1350 కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే దాకా ఎన్‌ఎంయుటి రాజీలేని పోరాటం సాగిస్తుందన్నారు. తెలంగాణ కోసం సమ్మె చేస్తుంటే అదే తెలంగాణకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులపై వేటు వేయడం సీమాంధ్ర పాలకుల అహంకారానికి నిదర్శనమన్నారు. బుధవారం విధులకు హాజరైతే మిగతా కాంట్రాక్ట్ కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తానంటున్న యాజమాన్యం దొంగ మాటలను నమ్మోద్దని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకావద్దని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.ఈ తొలగింపుతో ఆర్టీసి సమ్మె మరింత ఉదృతం- ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడాన్ని ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్(ఇయూ) తెలంగాణ ఫోరం కన్వీనర్ రాజిడ్డి తీవ్రంగా ఖండించారు. సమ్మెకు వెళ్ళేముందు మీ ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూస్తామని వారికి హమీ ఇచ్చామని, దీనిలో భాగంగానే సమ్మె ముగిసిన తరువాత తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి చేర్పించిన తరువాతే తాము విధుల్లో చేరుతామని స్పష్టం చేశారు. సమ్మె రెండవ రోజే అత్యుత్సాహంతో సీమాంధ్ర పాలకులు తీసుకున్న నిర్ణయం పట్ల ఇయు తెలంగాణ పోరం తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుతో ఆర్టీసి సమ్మె మరింత ఉధృతమవుతుందని ఆయన హెచ్చరించారు.తొలగింపు కక్షసాధింపు చర్య: ఎంఎన్‌యూ నేత లక్ష్మణ్కరీంనగర్: కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తూ తీసుకున్న చర్యను ఆర్టీసీ జేఏసీ నాయకులు, ఎంఎన్‌యూ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేస్తున్నారని ఇది కక్షసాధింపు చర్యగా మండిపడ్డారు. సమ్మె ముగిసిన అనంతరం డ్యూటీలో ఉంటూ కాంట్రాక్టు కార్మికులు చేరిన అనంతరం తాము చేరుతామని వారిని తొలగించే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.సమ్మెను నీరుకార్చే ప్రచారాలను నమ్మొద్దు- టిజేఏసీ చైర్మన్ కోదండరాంకాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగులకు ఎటువంటి ప్రమాదం లేదని టిజేఏసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సమ్మెను నీరుకార్చటానికి జరుగుతున్న ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మీ హక్కుల ర ణకై, జీతాలకై టి జాక్ బాధ్యత తీసుకుంటుందని ఆయన కార్మికులకు భరోసా ఇచ్చారు.

No comments:

Post a Comment